Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
ప్రసవం తర్వాత జుట్టు రాలే సమస్యను నివారించే ఉత్తమ ఆహారాలు
మహిళలకు గర్భధారణ అనేది ఒక మంచి అనుభూతి. చెప్పలేని ఆనంద. చర్మంలో గ్లో, అధిక బరువు పెరుగుతామన్న దిగులు ఉండదు. పీరియడ్స్ ఉండవు అంతే కాదు జుట్టు కూడా ఎక్సట్రా హెల్తీగా మరియు గ్లాసీగా కనబడుతుంది . ఇలాంటి అనుభవాలను మరేవీ బీట్ చేయ్యవు అనేవిధంగా ఉంటుంది . అయితే అందరిలో అలా జరగదు. ఎందుకంటే గర్భధారణ సమయంలో ఇలాంటి భానలున్నా...ప్రసవంత తర్వాత ఆ ప్రభావం జుట్టు మీద, జుట్టు ఆరోగ్యం మీద ఎక్కువగా పడుతుంది.
బిడ్డ పుట్టిందన్న సంతోషం మహిళలకు అధికంగా వుంటుంది. కాని ఆ సమయంలో వచ్చే చిన్నపాటి అనారోగ్యాలు, జుట్టూ ఊడటం మొదలైనవి మహిళలో డిప్రెషన్ కలిగిస్తాయి. మహిళ అందాన్ని పెంచేది కేశ సౌందర్యమే. ఇక అది ఊడితే వారు ముసలి వారైనట్లే భావిస్తూంటారు. బిడ్డ పుట్టిన తర్వాత జుట్టు ఊడటం సహజమని అది ఒక తాత్కాలిక దశ అని మొదటగా స్త్రీలు గుర్తించాలి. ముఖ్యంగా రోజుకు వందలోపు వెంట్రులకు ఊడితుంటే అది సహజంగా భావించాలి. అదే వందకంటే ఎక్కువగా ప్రతి రోజూ 500 వందల వరకూ ఊడితుంటే మాత్రం పరిస్థితిని సీరియస్ గా తీసుకోవాలి. మరి ఈ సమస్యకు నివారించాలంటే ఏం చేయాలి? మహిళలకు గల ఈ జుట్టు ఊడటం సమస్యను పరిష్కరించటమెలా?
ప్రసవం తర్వాత కోల్పోయిన్ విటమిన్స్ ను తిరిగి పొందడానికి మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

1. చేపలు:
చేపలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉండి. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా ఎక్కువగా అవసరం అయ్యే ఆహారం ఇది . సాల్మన్, తున వంటి ప్రత్యేకమైన చేపల్లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది . ఇవి న్యూట్రీషియన్ విలువలను పెంచుతంది . తద్వారా ప్రసవం తర్వాత జుట్టు రాలడం అరకట్టవచ్చు.

2. టోఫు:
ప్రసవం తర్వాత జుట్టు రాలడంను నివారించడానికి ఒక గ్రేట్ ఫుడ్ టోఫు . ఎందుకంటే ఇందులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది.

3. విటమిన్స్:
ప్రసవం తర్వాత జుట్టు రాలడం అరకట్టడానికి రెగ్యులర్ డైట్ లో విటమిన్ సప్లిమెంట్ ను పెంచాలి. ముఖ్యంగా విటిమన్ బి, సి మరియు డి ముఖ్యంగా బయోటిన్ ఇది విటమిన్ బిలో ఒక బాగం. హెల్తీ హెయిర్ గ్రోత్ కు ఇది చాలా అత్యవసరం అయినవి.

4. పెరుగు మరియు కాటేజ్ చీజ్:
ఎక్కువ ప్రోటీనులున్న ఆహారాలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలడం అరకట్టడంతో పాటు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించుకోవచ్చు.

5. ఈస్ట్:
బ్రెడ్ మరియు పెరుగు కలిగిన హై కంటెంట్ ఈస్ట్ ఇవి ప్రత్యేకంగా జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడుతాయి. అలాగే జుట్టును బీర్ తో వాష్ చేయడం ద్వారా ప్రసవం తర్వాత జుట్టు రాలడం నివారించుకోవచ్చు.

6.ఫ్యాటీ యాసిడ్స్:
ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఓమేగా 3, 6, 9 వంటివి జుట్టును రాలడం అరికట్టడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి . ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ మరియు ఫిష్ ఆయిల్ ను ఎక్కువగా తీసుకోవాలి.

7. సెలీనియం:
హెల్తీ హెయిర్ కోసం చాలా ముఖ్యమైన న్యూట్రీషియన్ సెలీనియం . ఇది జుట్టు పెరుగుదలకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

8. ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్:
ప్రసవం తర్వాత జుట్టు రాలడం తగ్గించుకోవడానికి హెల్తీ డైట్ తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్స్ జుట్టు పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతాయి.

9. ఓయిస్ట్రెస్:
ఓయిస్ట్రెస్ లో ఐరన్ పుష్కలంగా ుంటుంది. మరియు జింక్ కూడా పుష్కలం . ఈ రెండు జుట్టు రాలడం తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.

10. గుడ్డు:
గుడ్డులో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది . ఇది జుట్టుకు తగినంత బలాన్ని అందిస్తుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ కు మరియు నరాలకు తగిన బలం అందివ్వడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
