Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Postpartum Fatigue: డెలివరీ తర్వాత విపరీతమైన అలసట.. మీ సమస్య కూడా ఇదే అయితే, ఈ చిట్కాలు మీకోసమే
తల్లికావడం మధురమైన అనుభూతి. నవమాసాలు మోసి, ఓ బిడ్డకు ప్రసవించడం గొప్ప అనుభవం. అయితే 9 నెలల పాటు బిడ్డను మోసి, ప్రసవించడంల అంత తేలికైన పని కాదు. స్త్రీ గర్భం దాల్చినప్పుడు హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అదే విధంగా ప్రసవం తర్వాత తల్లి శరీర స్థితిలో అనేక మార్పులు వస్తాయి.
తల్లి అయిన తర్వాత పిల్లల సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లులు అలసిపోవడం సహజమే. ఏమాత్రం ఓపిక ఉండదు. కాసేపు కూర్చున్నా.. అలసట వచ్చేస్తుంది. అయితే ఈ అలసటను పోగొట్టి శరీరంలో శక్తిని తిరిగి తీసుకురావడానికి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రసవానంతర అలసట:
ప్రసవించిన తర్వాత తల్లి శరీరంలోని శక్తి మొత్తం కోల్పోతుంది. ఇది కొత్త తల్లులు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విధంగా ప్రసవించిన తర్వాత వచ్చే అలసటను అధిగమించడానికి, శక్తిని పుంజుకోవడానికి తల్లులు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఓపిక లేక అలసటతో ఇబ్బంది పడే తల్లులకు ఈ చిట్కాలు చక్కగా పని చేస్తాయి.
విశ్రాంతి:
విశ్రాంతి తీసుకోవడం చాలా చాలా కీలకం. ప్రసవం తర్వాత తల్లులు శక్తి కోల్పోతారు. అలాగే పాల రూపంలో తమ శక్తిని బిడ్డకు అందిస్తారు. అందుకే ఎప్పుడూ నీరసంగా ఉంటారు. కొద్దిసేపు కూర్చున్నా అలసట వచ్చేస్తుంది. అందుకే ఈ సమయంలో బాలింతలు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. బిడ్డ నిద్రపోతుంటే తనతో పాటు పడుకోవాలి. బిడ్డ నిద్రపోతున్నప్పుడు ఇతర పనుల్లో నిమగ్నమైతే తను లేచినప్పుడు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు.
ఆరోగ్యవంతమైన ఆహారం:
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. అన్నిరకాల పోషకాలు, కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉండే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. కెఫిన్, చక్కెరను వీలైనంతగా తగ్గించాలి. ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.
వేడి నీటి స్నానం:
వేడి నీటి స్నానం చేయడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రసవం తర్వాత తల్లి కండరాలు బలహీనంగా మారతాయి. వేడి నీటితో స్నానం చేస్తే ఉపశమనంగా అనిపిస్తుంది. శరీరం తేలికగా అనిపించడంతో పాటు నొప్పులు తగ్గుతాయి.
లావెండర్ సువాసన:
లావెండర్ పూల నుంచి తయారైన సుగంధ ద్రవ్యాలు అలసటను తగ్గించి నిద్రను ప్రోత్సహిస్తాయి. లావెండ్ సుగంధ ద్రవ్యాలు మంచి మూడ్ ను అందిస్తాయి.
నీరు తాగడం:
డెలివరీ తర్వాత డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. చెమట, మూత్రం రూపంలో శరీరంలోని నీరు బయటకు పోతుంది. దానిని భర్తీ చేయడానికి పుష్కలంగా నీళ్లు తాగాలి.
వ్యాయామం:
బిడ్డ కొద్దిగా పెద్దదైతే.. తనను ఎత్తుకుని కాసేపు అలా నడవడం అలవాటు చేసుకోవడం మంచిది.దీని వల్ల శరీరానికి వ్యాయామం చేసినట్లు అవుతుంది. అలాగే డెలివరీ తర్వాత వైద్యులు సూచించే చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేస్తుండాలి.
ఒత్తిడికి దూరంగా ఉండాలి:
శరీరంలో అలసట మానసిక ఒత్తిడిని తీసుకువస్తుంది. అలాంటి సమయాల్లో ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటివి సాధన చేయాలి. దీని వల్ల ఒత్తిడి దూరం కావడంతో పాటు ప్రసవానంతర సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications