Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతులకు బియ్యం చేసే హాని!

ఈ పరిశోధనలో, న్యూ హేంప్ షైర్ లోని డార్ట్ మౌత్ మెడికల్ స్కూల్ పరిశోధకులు 229 ప్రెగ్నెంట్ మహిళల మూత్రాన్ని పరిశీలించారు. వారు తినే చేప, బియ్యం, నీరు మొదలగు ఆహారాలను సుమారు మూడు రోజుల ముందునుండే పరిశీలించారు. బియ్యం అధికంగా తిన్న మహిళల మూత్రంలో ఆర్సెనిక్, ఇనార్గానిక్ ఆర్సెనిక్ (అకర్బన పాషాణం) లు అధికంగా వున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క గ్రాము రైస్ కు 1 శాతం ఆర్సెనిక్ స్ధాయి పెరిగిందట. శరీరంలో ఇనార్గానిక్ ఆర్సెనిక్ స్ధాయి అధికమయితే, అది బ్లాడర్, లంగ్, చర్మ కేన్సర్, టైప్ 2 డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తుందని అమెరికా ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ తెలిపింది.
సాధారణ వ్యక్తులలో ఆర్సెనిక్ స్ధాయి ప్రభావం ఎలావున్నప్పటికి గర్భవతులలో మాత్రం పుట్టబోయే బిడ్డకు ఇది తప్పక హాని కలిగిస్తుందని తెలిపారు. అయితే బియ్యంలోని మరి కొన్ని ఆర్సెనిక్ పదార్ధాలు హాని కలిగించేవి కావని కూడా తెలిపారు. ఏది ఏమైనప్పటికి గర్భవతి మహిళలు తమ ఆహారంలో రైస్ వినియోగం అతి తక్కువగా వుండాలని పరిశోధకులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనా ఫలితాలను నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ప్రచురించారు.



Click it and Unblock the Notifications