Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అబార్షన్ తర్వాత ఆహారం ఎలా వుండాలి?

1. ఆహారంలో ప్రొటీన్లు అధికంగా వుండాలి. విటమిన్లు, ఇతర ఖనిజ లవణాలు వుండాలి. దీనివలన రక్తహీనత లేకుండా సరైన పోషకాలు శరీరానికి అందుతాయి.
2. అబార్షన్ తర్వాత తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. చల్లనైన, లేక ఆయిల్ అధికంగా వున్న ఆహార పదార్ధాలు తినరాదు. ముల్లంగి, కాకర కాయ, ఆరెంజ్ మొదలైనవి తినవద్దు.
3. చేపలు, మెత్తటి కోడి మాంసం, గుడ్లు, జంతువుల లివర్, మాంసం, సోయాబీన్, పాలు, ఖర్జూరాలు, తాజా పండ్లు, తాజా కూరగాయలు మొదలైనవి ఆహారంలో వుండాలి.
4. అబార్షన్ తర్వాత చెమట అధికంగా పడుతుంది. కనుక ప్రతిరోజూ 8 నుండి 12 గ్లాసుల నీరు తాగండి. ఇది డీహైడ్రేషన్ నుండి కాపాడటమే కాక, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
5. తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు అధికంగా వుంటే రక్తంలోని ఎర్రకణాలు అధికమవుతాయి. గుడ్లు, చేప, ఉడికించిన బీన్స్, అరటిపండు, అవకాడో, కేరట్, ఛీజ్, బఠానీ, ఆరెంజి, పచ్చలి ఆకు కూరలు, బాదం పప్పు మొదలైనవి ప్రొటీన్ అధికంగా వుండే పదార్ధాలు.
6. మాంసాహారులైతే, చేప, షెల్ ఫిస్, గునా, బీఫ్, పోర్క్, చికెన్, ల్యాంబ్, ఉడికించిన బీన్స్, బఠాణీలు ప్రొటీన్ అందిస్తాయి. వీరికి ఐరన్ మరియు బి బిటమిన్లు కూడా కావాలి.
7. తక్కువ కొవ్వు కల పాల ఉత్పత్తులు కాల్షియం అధికంగా ఇస్తాయి. పాల ఉత్పత్తులు ప్రొటీన్లను, విలమిన్లను కూడా ఇస్తాయి.
8. మసాలాలు వుండే ఘాటైన పదార్ధాలు తినవద్దు. మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో చికెన్ లేదా గుడ్లు తింటే మంచిది.
అబార్షన్ అయిన తర్వాత కలిగే బలహీనతనుండి బయటపడాలంటే పై చిట్కాలు పాటిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.



Click it and Unblock the Notifications
