వైద్య సలహా లేకుండా గర్భవతి మందులు వాడవచ్చా?

By B N Sharma

Pregnant Women Should Not Self-Medicate.
గర్భం ధరించిందంటే మహిళకు సంతోషం. పుట్టబోయే బిడ్డ కొరకు ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. ఆరోగ్యకర ఆహారాలు తీసుకుంటుంది. తన బిడ్డకు సౌకర్యంగా తన జీవన విధానాన్నే మార్చుకుంటుంది. అయితే, కొంతమంది మహిళలు వైద్యుడు లేకుండా మందులు వేసుకుంటారు. బిడ్డ భవిష్యత్తే కాక, వారి భవిష్యత్తు కూడా పాడు చేసుకుంటున్నామని తెలుసుకోలేరు.

గర్భవతి తన మొదటి మూడు నెలల కాలంలో వాడే మందులు సరైనవి కాకుంటే గర్భంలోని బిడ్డపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయి. బిడ్డ ఎదుగుదల సరిగా వుండదు. ఎనిమా చేసుకోడం, అమ్మమ్మలు ఇచ్చే కషాయాలు తాగటం వంటివి గర్భవతికి సురక్షితం కాదు. మొదటి మూడు నెలలలో పిండం భారీ పరిణామాలకు లోనవుతుంది. స్వంత వైద్యం చేసుకుంటే పిండానికి హాని కలుగుతుంది. మూత్ర పర సమస్యలు, జననేంద్రియాల సమస్యలు వస్తాయి.

గర్భవతులకు సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం లేదా ఇతర చిన్నపాటి అనారోగ్యాలు కలుగుతూంటాయి. సమస్య ఏదైనప్పటికి ఏ మందుకైనా సరే వైద్యుడిని సంప్రదించటం మంచిది. సమస్యలు ఏవైనప్పటికి బేబీ పుట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే పరిష్కరించవచ్చు. కానీ వాటి ప్రభావం బేబీ భవిష్యత్తుపై కూడా వుంటుంది. కనుక గర్భవతులు తమంత తాము ఏరకమైన మందులు వైద్య సలహా లేకుండా వాడరాదు.

Story first published: Saturday, October 29, 2011, 15:10 [IST]
Desktop Bottom Promotion