Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చే అబార్షన్లు!

సరి అయిన అవగాహన లేక నేటి యువతులు అసుక్షిత అబార్షన్లకు గురైపోతున్నారు. ఒక ప్రాధమిక నివేదిక మేరకు 6,00,000 గర్భవతుల మరణాలలోను 13 శాతం అసురక్షిత అబార్షన్ల కారణంగానని కూడా తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 మిలియన్ల అసురక్షిత అబార్షన్లు జరుగుతున్నట్లు రికార్డులు చెపుతున్నాయి. మరో ఆశ్చర్యకర విషయంగా, ఈ అబార్షన్లు అత్యధికంగా భారతదేశంలోనే జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వైద్యపర సమస్యలున్నాయని తెలిసి కూడా గర్భవతులు తమ గర్భాలను అసురక్షిత మార్గాల ద్వారా విచ్ఛిన్నం చేసుకోటానికి ప్రయత్నించటం వారికిగల అవగాహనా లోపమే. శాస్త్రీయపరంగా కనుక అబార్షన్ చేసినట్లయితే అది ఎంతో తేలిక దానినే మెడికల్ టర్మినల్ ఆప్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. కాని సమాజానికి భయపడి చాలామంది నేడు అసుక్షిత విచ్ఛిన్న విధానాన్ని ఆచరిస్తున్నారు.
ప్రభుత్వాలు ఈ దిశగా తమ దృష్టిని కేంద్రీకరించి చట్టాలలో సవరణలు తీసుకురావలసిన భాధ్యత వారిపై వుంది. చట్టాలున్న దేశాలలో సరి అయిన అవగాహన కల్పించాల్సిన అవసరం వుంది. మనదేశంలో చాలామంది స్త్రీలు అబార్షన్లు అన్ని దశలలోను చట్టబద్ధం కానివిగానే అర్ధం చేసుకుంటున్నారు. అన్నిటికంటే కూడా ముందు సమాజం గర్భవిచ్ఛిన్నాలకు ఆమోదం ఇవ్వాలి.నేడు జరిగే చాలా గర్భ ధారణలు పెళ్ళికి ముందు జరుగుతున్నవే.కనుకే సమాజంలో ఈ రకమైన అభిప్రాయాలున్నాయి.
పెద్దలు తమ కుటుంబ మాన మర్యాదలు పోతాయేనే భయాలతో రహస్యంగా అసుక్షిత పద్ధతులలో గర్భ విచ్ఛిన్నాలకి మార్గాలు అవలంబిస్తున్నారు. ప్రభుత్వాలు తక్షణమే వీటికి చట్టపర పరిష్కార మార్గాలు ఆలోచించాలి. బిడ్డకు జన్మనివ్వటం స్త్రీ యొక్క జన్మహక్కని ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేయాలి.



Click it and Unblock the Notifications
