Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
మాతృత్వంపై రహస్యంగా వుంచబడిన 5 నిజాలు!

గర్భం ధరించిన వార్తను మీరు అందరకు తెలిపారు. ఇక ఆసమయంనుండి మీకు పెద్దలనుండి, ఇప్పటికే బేబీలు కలిగిన జంటలనుండి ఎనలేని సలహాలు వచ్చిపడుతూంటాయి. ఎన్ని సలహాలు, సమాచారం వచ్చినప్పటికి మీకు మీ మంచి స్నేహితులు, అతి సమీప కుంటుంబ సభ్యులు కూడా తెలుపని కొన్ని వాస్తవాలు వుంటాయి. అవేమిటో పరిశీలిద్దాం. మొదటగా గర్భ ధారణ ఎంతో ఉద్రేకంతోను, ఆవేశంతోను తెలియవస్తుంది. మీరు ఎంత సిద్ధంగా వున్నానని భావించినప్పటికి మీరు గర్భవతి అని నిర్ధారణ చేయగానే మీలో ఆ ఉద్రేకం కలిగే తీరుతుంది.
ప్రమాదాలపై కలలు
మీ బిడ్డ ఎంతో సురక్షితంగా వుండాలనుకుంటారు. కాని ప్రపంచంలో ఏదీ సురక్షితమైనది కాదని గ్రహించండి. మీ బిడ్డపుట్టిన తర్వాత ఏ చిన్న విషయమైనా సరే మీకు సురక్షితం కాదనిపిస్తుంది. మీ బేబీని మీ స్నేహితులు, బంధువులు ఎవరైనా పట్టుకుంటే చాలు, మీరు అభధ్రత భావిస్తారు. బిడ్డకు సంబంధించి పొగతాగేవారు, ట్రాఫిక్ కాలుష్యం వంటి అంశాలపై మీ గుండె ఆగి ఆగి కొట్టుకుంటుంది. వారి చేతులకు ఎన్నో క్రిములు వున్నట్లు భావిస్తారు. కాని ఇవన్నీ తప్పనిసరిగా వుండేవే. అనవసర ఆలోచనలు మానండి. వీలైనన్ని జాగ్రత్తలు బిడ్డ పట్ల తీసుకోండి. మానవమాత్రులుగా మీ బిడ్డను మీరు అన్ని ఆపదలనుండి కాపాడలేనని గుర్తించండి.
మారిన ఫోకస్
తొమ్మిది నెలలు గడిచిపోయాయి. అందరూ మీ ఆరోగ్యం గురించి అడుగుతూనే వుంటారు. కాని మీ బిడ్డ వచ్చిన తర్వాత మీ భాధ్యతలను గురించి ఎవరూ చెప్పరు. మీరు ఒక తల్లిపాత్ర ధరించాలి. బిడ్డకు పాలు, దుస్తులు వంటివి అందించాలి. నిద్రపోయేలాచేయాలి. అయితే, ఇకపై అందరి శ్రద్ధ మీ బేబీపైనే వుంటుంది. మీరు వారికి రెండో వ్యక్తి మాత్రమే.
తల్లిపాలు కష్టం
బిడ్డకు పాలు పట్టటం అత్యంత మెళకువలతో కూడినది. అది మీకై మీరే నేర్చుకోవాలి. మంటపెట్టే స్తనాలు, బ్లాక్ అయిన గ్రంధులు, ఇన్ఫెక్షన్లు ఎన్నో వుంటాయి. మీ హార్మోన్లు బలహీనపడతాయి. ఇటువంటపుడు వైద్యులు లేదా నర్సుల నుండి మీరు కొన్ని టెక్నిక్ లు నేర్చుకోవాలి. మీ ఆహారం, పానీయాలపట్ల జాగ్రత్త వహించండి. తగినంత నీరు తాగండి. ఆందోళన చెందకండి. తాత్కాలికంగా పాలు తగ్గినప్పటికి మీ బిడ్డ అసౌకర్యం భావించడని గమనించండి.
చిన్న అంశాలు పెద్దవిగా భావించకండి
బిడ్డ పుట్టిన తర్వాత ఏ సోప్ వాడాలి, బిడ్డకు ఏ దుస్తులు ఇవ్వాలి వంటి వాటిపై అతిగా ఆలోచించకండి. అవసరమైన సహాయం ఇతరులనుండి పొందండి. మీరు చేసే ప్రతి పని బిడ్డపై ప్రభావం చూపుతుందని గ్రహించండి.
పోటీ తత్వం పెరుగుతుంది?
మనం మన బిడ్డలను ప్రత్యేకంగా పెంచాలనుకుంటాం. ఇతరులతో పోల్చరాదని భావిస్తాం. కాని ఎంత బలవంతులకైనా పోటీ తప్పదని గ్రహించండి. మీరు మీ బిడ్డకు తక్కువ చేస్తున్నామని భావించకండి. ఏదైనా ఆలస్యం అయినా అది మీ అసమర్ధతగా భావించకండి.



Click it and Unblock the Notifications
