Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
గర్భవతి కి నిద్రలో వచ్చే కలలు నిజాలవుతాయా?

గర్భవతి కలలకు అర్ధం ఏమిటి? గర్భవతికి వచ్చే కలలను వ్యాఖ్యానించాలంటే, దానికిగల మూలాలను మీరు తెలుసుకోవాలి. ఆమెకు గల భయం, ప్రేమ, ఆందోళన మరియు జాగ్రత్తలు, శారీరక మార్పులు మొదలైనవి గుర్తించాలి. ప్రతి త్రైమాసికంకూడా కొత్త రకాల కలలు కలిగిస్తుంది.
మొదటి త్రైమాసిక కలలు అంటే మీరు గర్భవతిగా సర్దుబాటు చేసుకునే సమయంలో కలలలో అధికంగా నీటికి సంబంధంగా కనపడతాయి. దానికి కారణం ఆమె గర్భంలో ఉమ్మినీరు చేరుతూండటం, బేబీ దానిలో తేలియాడుతూండటం అంటారు మానసిక వేత్తలు. జన్మ తర్వాత బేబీ ఎలా వుంటుంది అనేది కూడా హె ఊహించుకుంటుంది.
రెండవ త్రైమాసిక కలలు బేబీని గురించిన ఆందోళన ఆసక్తి కలిగిస్తాయి. కాని మీ జీవితం అదివరకులాగా వుండదు కనుక, మీ భాస్వామిని వేరెవరో లాగేసుకుంటున్నట్లు కలలు వస్తాయి. అతనిచే మీరు తిరస్కరించబడినట్లు కలలు వస్తాయి.
ఇక మూడవ త్రైమాసిక కలలు కొద్దిపాటి కామోద్రేకం కలిగినవిగా వుంటాయి. మీరు బాగా పొట్ట పెంచుకోవడం చేత, మీ పార్టనర్ మిమ్మల్ని ఇష్టపడనట్లుగా, అభద్రతగా భావించినట్లు కలులు వుంటాయి.
గర్భవతికి వచ్చే కలలు గుర్తుంటాయా? చాలామంది మహిళలు నిద్రలో వచ్చే కలలతో ఇబ్బంది పడతారు. ఉదయం వేళ వికారాలు, తరచుగా వాష్ రూమ్ కి వెళ్ళడం, రక్తపోటు తగ్గటం, పెరగటం, నిద్ర లేకపోవడం ఎన్నో సమస్యలుంటాయి. గాఢ నిద్ర లేకుంటే, మరుసటి రోజు ఆరోగ్యంగా వుండదు. అందునా కలలు వస్తూంటే, మరింత కష్టంగా వుంటుంది. నిద్ర కొద్దిగా చెదిరినా...అది అసౌకర్యమే.
గర్భవతికి వచ్చే కలలే కాదు, ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి అనుభవం ఆమెకు ఒక తాజా అనుభూతిగా వుంటుంది. హార్మోన్ల స్ధాయి పెరిగిన కారణంగా కొత్త అనుభూతులు చెందుతూంటుంది. ప్రొజెస్టిరోన్ హార్మోన్ లోని పెరుగుదల, తగ్గుదల, కలలను ప్రభావితం చేస్తుంది. హార్మోన్లు మీ బ్రెయిన్ తో నేరుగా సంబంధం కలిగివుంటాయి. కనుక మీ గర్భస్ధ దశలోని జాగ్రత్తలు, భయాలు, మీకు కలలుగా వస్తూ వుంటాయి.



Click it and Unblock the Notifications
