For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలలో రక్తపోటు నివారణ ఎలా?

By B N Sharma
|

Blood Pressure In Pregnant Women?
సాధారణంగా గర్భవతికి నాలుగు లేదా అయిదు నెలలు నిండాయంటే, రక్తపోటు పెరగడాన్ని గమనించవచ్చు. గర్భవతులకు రక్తపోటు అధికం అవటం సహజం. ఇలా పెరిగిన రక్తపోటు, మహిళ బిడ్డను ప్రసవించగానే తగ్గిపోతుంది. రక్తపోటు అయిదవ నెల తర్వాతనే పెరిగినప్పటికి అందుకు కొన్ని కారణాలు వుంటాయి. పిండం ఎదుగుదల ఆరు నుండి పది వారాల లోపే మొదలవుతుంది. అంటే పిండం గర్భ రనసంచి లోపల గోడకు అతుక్కుని, తల్లినుండి పోషక పదార్ధాలు పొందే క్రమంలో మాయ లేదా ప్లాసెంటా ఏర్పడుతుంది.

ఇది ఏర్పడే దశలోనే మరి కొన్ని లోపాల వల్ల తల్లికి కొన్ని నెలల తర్వాత రక్తపోటు అసాధారణంగా పెరగడం జరుగుతుందని నిరూపించబడింది. రక్తపోటు పెరగడం మొదలైనప్పటి నుంచి తల్లి రక్తనాళాలు కుచించుకపోవడం చేత బిడ్డకు రక్తప్రసరణ తగినంతగా అవ్వక తక్కువ బరువుతో పుట్టడం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం, నెలలు నిండకముందరే ప్రసవం అయిపోవడం వంటివి కూడా జరగవచ్చు.

నియంత్రణ లేకుండా రక్తపోటు పెరిగితే తల్లికి వాంతులవటం, తలనొప్పి, కడుపులో నొప్పి, ఫిట్స్ రావడం లేదా డెలివరీకి ముందరే అధిక రక్తస్రావం వంటివి జరగవచ్చు. అందుచేతనే రక్తపోటు కొద్దిగా పెరిగిన వెంటనే డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. రక్తపోటును నియంత్రించడానికి తగిన మందులు వాడటం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

కాళ్ళ వాపులు రక్తపోటు పెరిగినప్పుడు మాత్రమే కాకుండా ప్రెగ్నెన్సీలో కూడా చివరి నెలలో సాధారణంగా కనపడతాయి. కాబట్టి కొందరు దీనిని చాలా తేలికగా తీసుకుంటారు. అలాగాక రక్తపోటు ఎక్కువగా వుంటే తక్కువ డోసులో రక్తపోటు టాబ్లెట్లు వాడాలి. యూరిన్ పరీక్షలు చేయడం అవసరం. రక్తపోటు పరీక్ష రెగ్యలర్ గా చేయించాలి. మందులు వాడినప్పటికి రక్తపోటు నియంత్రణలో లేకుంటే, తల్లి ఆరోగ్య రీత్యా కొందరిలో నెలలు నిండకముందే ప్రసవం చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. అటువంటపుడు ఈ సమస్యను అధిగమించటానికి నిరంతరం వైద్యుల సలహా పొందాలి.

English summary

Blood Pressure In Pregnant Women? | గర్భిణీ స్త్రీలలో రక్తపోటు నివారణ ఎలా?

Generally, pregnant woman gets blood pressure during her fourth or fifth month. This is a natural thing while in pregnancy. This blood pressure comes down when the woman gets delivery of the baby. Fetus in her gets developed between sixh and ten months of her pregnancy and during this stage abnormal changes happen in mothers body.
Story first published:Monday, May 14, 2012, 9:35 [IST]
Desktop Bottom Promotion