For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె జబ్బు వున్న మహిళకు గర్భం వస్తే?

By B N Sharma
|

Can a Heart Disease Woman Get Pregnancy
గుండె జబ్బు వున్న మహిళ గర్భాన్ని ధరించవచ్చా? మహిళలు గర్భం ధరించే ముందు ఆరోగ్యంగా వుండాలి. అయితే కొన్ని పరిస్ధితులలో గర్భం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వచ్చేస్తూంటుంది. అయినప్పటికి మహిళ తన గర్భాన్ని కొనసాగిస్తూనే కొన్ని ఆరోగ్య పర జాగ్రత్తలు తీసుకోవాలి.
గుండె జబ్బు అనేది కొంతమందికి జన్యుపరంగా సంక్రమిస్తుంది.

మరి కొందరికి మధ్యలో ఏర్పడుతుంది. సాధారణంగా మహిళల శరీరంలో 5.5 లీటర్ల రక్తం వుంటుంది. అయితే, ఇది గర్భవతి అయిన తర్వాత సుమారుగా 30 నుండి 35 శాతం అధికమవుతుంది. గర్భం పొందిన మూడు నెలలనుండి ఈ మార్పు సంభవిస్తుంది. గుండె రక్తాన్ని వేగంగా పంప్ చేయడంతో గుండె కొట్టుకోవడం కూడా ఎక్కువవుతుంది. రక్త సిరలు విస్తరిస్తాయి. ఆరోగ్య వంతులకు ఈ వేగం పరవాలేదుగానీ గుండె జబ్బులు వున్న వారు ఈ వేగానికి తట్టుకోలేకపోవచ్చు.

ఈ జబ్బును వారు నిర్లక్ష్యం చేస్తే మొదటి మూడు నెలలకాలంలోనే గర్భవిచ్ఛిన్నం జరిగే అవకాశం వుంటుంది. ఈ పరిస్ధితి మహిళకు మరింత ప్రమాదకరం. కొన్ని పరిస్ధితులలో మరణం కూడా ఆమె పొందవచ్చు. కనుక తీవ్ర గుండె జబ్బులున్న మహిళలు గర్భం దాల్చకుండా ఉంటే మంచిదని నిపుణులు తెలుపుతారు. అయితే, గుండె జబ్బుకు తగిన చికిత్స తీసుకున్న తర్వాత వైద్య సలహాపై మహిళ గర్భం ధరించవచ్చు.

గుండె ఆపరేషన్ లేదా చికిత్స జరిగిన మహిళలు గర్భం ధరించినప్పటినుండి ప్రసవం అయ్యేవరకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వుండి ఎప్పటికపుడు పరిస్ధితిని అదుపులో పెట్టుకోవటం మంచిది. కాన్పు సమయంలో గుండె వైద్య నిపుణులు అందుబాటులో వున్న ఆస్పత్రులలో ప్రసవం కావటం మంచిదిగా కూడా సూచిస్తారు.

English summary

Can a Heart Disease Woman Get Pregnancy! | గుండె జబ్బు వున్న మహిళకు గర్భం వస్తే?

Women who underwent heart related treatments or surgeies and got conceived should have a close supervision from the time of their conception to the time of delivery. They should deliver the baby preferebly in the presence of a Heart specialist or in a hospital where heart related treatments are available.
Story first published:Saturday, April 7, 2012, 17:07 [IST]
Desktop Bottom Promotion