Latest Updates
-
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
గర్భవతుల పాదాల సమస్యలు!

కారణాలు పరిశీలిస్తే...దీనిని వైద్య భాషలో ఎడీమా అంటారు. కడుపులో వున్న బిడ్డ కొరకు శరీరం నీరు, రక్తం అధికంగా తయారు చేస్తుంది. అది ద్రవ పదార్ధం కనుక సాధారణంగా శరీరంలోని చివరి భాగాలైన కాళ్ళ భాగానికి చేరుతూంటుంది. గర్భాశయం పెరగటం ద్వారా ఒత్తిడి కలిగి శరీర కింది భాగంలోకి ప్రవహిస్తుంది. కాళ్ళు, మడమలు ప్రెగ్నెన్సీ మూడవ త్రైమాసికంలో చాలా బాధ కలిగిస్తాయి. ఈ వాపులు, నొప్పులనుండి ఉపశమనం కలగాలంటే...గర్భవతి పలుచని, సాగేటి చెప్పులు ధరించాలి. ఎపుడు వీలైతే అపుడు మీ కాళ్ళను ఎత్తుమీద పెట్టి కూర్చోవాలి. పనిలో కష్టమే కాని మీ పరిస్ధితి అటువంటిది. కనుక సందేహించకండి. ఎత్తైన స్టూలు లేదా కుషన్ లేదా టేబుల్ వంటి వాటిపై కాళ్ళను చాపి ఎత్తులో వుంచండి. ఎక్కువసేపు నిలబడి వుండకండి. నిలబడి వుంటే, రక్తం దిగువ భాగానికి ప్రసరిస్తుంది.
పొటాషియం అధికంగాను, సోడియం తక్కువగాను వుండే ఆహారాలు తీసుకోవాలి. ఉప్పు చాలా వరకు తగ్గించాలి. మీకు ఎడమ చేతివైపుకు తిరిగి పడుకుంటే కొంత రిలీఫ్ కలుగుతుంది. గర్భవతుల కాళ్ళకు అమ్మే సాక్స్ కొని వేసుకోండి. ఇవి ఉదయం నుండి సాయంత్రం వరకు వేసుకుని వుంటే కొంత ఊరట కలుగుతుంది. శరీర భాగాలు గర్భవతులకు కొంత మేరకు వాపు రావటం సహజమే. గర్భవతికి నెలలు గడిచే కొలది ఉదయం వేళ వాపు తక్కువగా వుండటం, రోజులో తర్వాత కాళ్ళకు, పాదాలకు వాపు అధికం కావటం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ చివరి భాగంలో వాపు మీ చేతులను కూడా తాకుతుంది. వేళ్ళు ఉబ్బిపోతాయి.
దురదృష్టవశాత్తూ, గర్భవతికి మూడవ త్రైమాసికంలో ఈ సమస్య అధికంగా వుంటుంది. ఆరోగ్యవతులైన గర్భవతులలో ఈ సమస్య 40 నుండి 80 శాతం వరకు ఉంటుంది. వేసవి కాలం సమయంలో ఈ జబ్బు మరింత అధికంగా వుంటుంది. అయితే, మీకు కనుక ముఖం చేతులు వంటివి ఆకస్మాత్ గా ఉబ్బరించితే, వైద్యులను తప్పక సంప్రదించండి. ఎందుకంటే ఈ సమస్య కొన్నిమార్లు మీకే కాదు, మీ బేబీకి సైతం నష్టం కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
