Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ప్రెగ్నెంట్ మహిళ ఉద్యోగి అయితే, ఆహారం ఎలా వుండాలి?

మొలకెత్తిన విత్తనాలలో అత్యధిక ప్రొటీన్లు వుంటాయి. కండల నిర్మాణం బాగా జరగాలంటే ఆమె ఈ ఆహారాన్ని తినాలి. పెసలు, శనగలు, అలచందలు, వేరు శనగలు మొదలైనవి నీటిలో బాగా నానపెట్టి, మొలకలు కట్టి తగిన మొత్తాలలో తన పని స్ధలానికి తీసుకువెళ్ళి తినవచ్చు. మొలకెత్తిన విత్తనాలతోపాటు, కీరదోస ముక్కలు, కేస్పికం, టమాటాలు, పచ్చి మిరప వంటివి కూడా కలిపితే బాగానే వుంటాయి. వీటిలో కొద్దిపాటి నిమ్మరసం, ఉప్పు చేరిస్తే మరింత రుచికరంగా వుండి అనారోగ్యకరమైన బయటి ఛాట్ వంటి తిండ్లకు దూరంగా వుండవచ్చు. అయితే వీటిని మహిళ తయారు చేసిన రెండు లేదా మూడు గంటలలోపుగా తినివేయాలి.
ఉడికించిన మొక్కజొన్న విత్తులు, ఆకు కూరల శాండ్ విచ్ వంటివి కూడా తేలికగా జీర్ణం అయి శక్తినిస్తాయి. బ్రెడ్, వెన్న కూడా తినవచ్చు. ఉద్యోగం చేసే ప్రెగ్నెంట్ మహిళకు ఆహారం ఏ సమయంలో ఏదిగా వుండాలనేది పరిశీలించండి. నిద్ర లేవగానే ఉదయం ఒక కప్పు టీ మరియు రెండు బిస్కట్లు. ఉదయం 8 గంటలకు అల్పాహారంలో ఒక గ్లాసెడుపాలు, ఇడ్లీ రెండు లేదా మూడుగా వుండాలి. 10 గంటల సమయంలో రెండు లేదా మూడు పండ్ల ముక్కలు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఒక గ్లాసెడు లస్సి లేదా ఒక కప్పు కస్టర్డ్.
మధ్యాహ్నం వేళ లంచ్ లో రెండు రొట్టెలు కొద్దిపాటి పప్పు, తగినన్ని కూరలు, పెరుగు వుండాలి. సాయంకాలం స్నాక్స్ గా 4 గంటలకు ఒక కప్పు టీ , రెండు బిస్కట్లు, సాయంత్రం 6 గంటలకు ఒక గ్లాసెడు పాలు తీసుకోవాలి. రాత్రి 8 గంటలకు డిన్నర్ చేయాలి. దీనిలో రెండు రొట్టెలు, కొద్దిపాటి పప్పు, తగినన్ని కూరలు, పెరుగు వీటితో పాటు ఏదేని ఒక స్వీట్ వుండాలి.
రాత్రి నిద్రించే సమయంలో 10 గంటలకు 200 మి.లీ. పాలను తాగాలి. గర్భవతి మహిళ మాంసాహారి అయినట్లయితే, మధ్యాహ్నం లంచ్ లోను రాత్రి డిన్నర్ లోను కూరగాయలతోపాటు 1 గుడ్డు, 100 గ్రా. చికెన్, 80 గ్రా. మటన్, 120 గ్రా. చేపలు ప్రతిరోజూ తినాలి.



Click it and Unblock the Notifications
