Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
గర్భవతి ప్రసవ తేదీ ఎలా నిర్ణయిస్తారు?

గర్భవతి పూర్తి నెలలు నిండితే వినబడే ప్రశ్నలు ఇవి. మీ డాక్టర్ డెలివరీ తేదీని ఎలా లెక్కిస్తారో తెలుసా. చాలా తేలిక. మీ రుతుక్రమ తేదీ మీకు గుర్తుంటే మీరే లెక్క కట్టవచ్చు. దీనినే ప్రెగ్నెన్సీ కేలండర్ అంటారు. ప్రెగ్నెన్సీ కేలండర్ లో మహిళకు తన శరీరంలో ఏం జరుగుతోందనేది తెలుస్తూ వుంటుంది. డెలివరీ తేదీనాటికి ఎలా సిద్ధపడాలనేది సూచిస్తుంది. ఈ కేలండర్లు, గోడ, లేదా డెస్క్ లేదా ఆన్ లైన్ గా కూడా మెయిన్టెయిన్ చేయవచ్చు.
ఎవరికి వారే స్వంతంగా కేలండర్ ఎలా తయారు చేసుకోవాలి? చివరి రుతు క్రమ కాలం మొదటి రోజుకు 280 రోజులు కలపండి. 280 రోజులు ఈ దశ అనుకుంటే అందులో 266 రోజులు మానవులకు గర్భం ధరించిన కాలంగాను 14 రోజులు అండం డిశ్చార్జ్ కు గాను లెక్కించవచ్చు. మీ నెలసరి, దాని తేదీలు ఖచ్చితంగా వుంటే డెలివరీ గడువుతేదీ లెక్కింపు చాలా ఖచ్చితంగా తెలుస్తుంది. లేదా అల్ట్రా సౌండ్స్ ను బట్టి కూడా ఈ కేలండర్ తయారు చేయవచ్చు.
ప్రెగ్నెన్సీ దశలో, అనేక హార్మోన్ల, శారీరక, మానసిక మార్పులు జరుగుతాయి. గర్భిణీ స్త్రీ బరువు పెరుగుతుంది. స్తనాలు మెత్తబడతాయి, ఉదయం వేళ వికారంగా వుంటుంది, తల, వెన్ను నొప్పులు వస్తాయి. చెడ్డ చిరాకుగా వుంటుంది. చివరి త్రైమాసికం తర్వాత, అంటే 29 నుండి 40 వారాలకు, బేబీ ఆకారం ఏర్పడుతుంది డెలివరీ తేదీ లెక్కింపు అక్కడినుండి మొదలవుతుంది. పుట్టుకకు బేబీ తన తలకిందపెట్టి పెరుగుతూంటుంది.
ప్రెగ్నెన్సీ కేలండర్ లో ఏం తెలుసుకోవచ్చు?
-బేబీ ఎదుగుదల
-గర్భవతిలోని శారీరక, హార్మోన్ మార్పులు
-గర్భంలోని బిడ్డకు ఆహారం ఎంత అందించాలి?
-మీకు లేదా బేబీకి సంభవించే సమస్యలు
కనుక, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు గర్భవతిగా వున్నపుడు ఒక స్వంత కేలండర్ కలిగి వుండండి. డెలివరీ తేదీలను లెక్కించండి. సురక్షితమైన డెలివరీతో ముచ్చటగా ముద్దులొలికే ఒక బిడ్డకు జన్మనివ్వండి. మీ జన్మ ధన్యమైందని భావించండి.



Click it and Unblock the Notifications