Latest Updates
-
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.!
మామ్ సాంగ్ పెట్టు.... డ్యాన్స్ చేస్తా?
గర్భవతిగా ఉన్నపుడు మ్యూజిక్ వింటూ ఉంటే దాని ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఎంతో మంచిగా ఉంటుంది.అయితే, ఇంతవరకు దీనిప్రభావం ఏ పరిశోధనలోను రుజువు కాలేదు. అయినప్పటికి కొన్ని అంశాల కారణంగా మనం మ్యూజిక్ ప్రభావం కడుపులో ఉన్న బిడ్డపై ఉంటుందని చెప్పవచ్చు. అయితే, గర్భవతి ఏ రకమైన సంగీతాన్ని వినాలి? పాప్, లేదా జాజ్ లేదా సాంప్రదాయ సంగీతమా? ఏది వినాలి? ఏది వింటే బిడ్డకు తల్లికి పాజిటివ్ ప్రభావాలు కలుగుతాయి అనేది పరిశీలించండి.

ప్రెగ్నెన్సీ సమయంలో పెద్ద ధ్వనులు కడుపులోని బిడ్డకు అసౌకర్యం కలిగిస్తాయి. శబ్దం అధికంగా ఉండరాదు. డ్రమ్మింగ్, లేదా చికాకు పెట్టే ధ్వనులు ఉండరాదు. అవి బేబీలో బ్రెయిన్ డెవలప్ మెంటును అరికడతాయి. బేబీలకు సున్నితమైన సంగీతం ఉండాలి. అది వారికి ఎల్లపుడూ వినేదిగా ఉండాలి. క్లాసికల్ మ్యూజిక్ వంటివి సూచించదగినవి. శ్రావ్యమైన సంగీతం నిదానమైన ధ్వనితో పెట్టి వినిపించాలి. సాంప్రదాయ సంగీతంలోని రాగాలు కూడా వారికి మంచి కలిగిస్తాయి.
పుట్టబోయే బిడ్డకు మ్యూజిక్ ఎలా మేలు చేస్తుంది?
మేలు చేస్తుందనే దానికి ఖచ్చితమైన రుజువులు లేనప్పటికి గర్భవతి దశలో మొదటి త్రైమాసికంలోనే బిడ్డ సంగీతానికి స్పందిస్తుందనేది తేలింది. తాను వినే మ్యూజిక్ ను బట్టి బేబీ తన శ్వాసలో హెచ్చు తగ్గులను చేస్తుందనేది తేలింది. కనుక వినసొంపుగా, విశ్రాంతి నిచ్చే మ్యూజిక్ బిడ్డను శ్వాస మెల్లగా తీసుకునేలా చేస్తుంది.రణగొణ ధ్వనులతో కూడిన సంగీతాలు బిడ్డ వేగంగా శ్వాస తీసుకుని ఆందోళన చెందేలా చేస్తాయి.
గర్భవతి దశలో మహిళ మ్యూజిక్ వింటే అది పుట్టబోయే బిడ్డకే కాదు, ఆమె కు కూడా ఎంతో మేలు చేస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడి ఆరోగ్యంగా ఉంటుంది. కష్టాలు మరచిపోతుంది. కనుక గర్భవతులు ఇకపై తప్పక మ్యూజిక్ వినేయండి. అయితే అది ఎంతో శ్రావ్యంగా నిదానంగా ఉండేలా చూడండి.
ధ్వని ఎంత పెద్దదిగా పెట్టుకోవచ్చు?
ఎంత పెద్దగా మ్యూజిక్ పెట్టుకోవచ్చనేది చాలామందికి తెలియదు. బేబీ కనుక వినాలని మీరు భావిస్తే, మ్యూజిక్ ను మీ గర్భానికి సన్నిహితంగా పెట్టుకోండి. చాలామంది తల్లులు నతమ పొట్టపై హెడ్ ఫోన్ లు పెట్టుకుంటారు. అయితే, వైద్యపరంగా ఇది సూచించదగినది కాదు. శబ్ద తరంగాలు అధికమై బేబీకి అసౌకర్యం కలుగవచ్చు. మీరు ఈ రకంగా సంగీతం వినాలనుకుంటే ఒక గంటకంటే అధికంగా వినకండి.
మరో పద్దతిగా స్టీరియో సిస్టం లోని మ్యూజిక్ పెట్టి మీరు పనిలో నిమగ్నమవండి లేదా రిలాక్స్ అయిపొండి. ఇక్కడ కూడా మీరు 70 డెసిబుల్స్ కు మించి అధికంగా శబ్దం పెట్టరాదు. మ్యూజిక్ పెట్టినపుడు వీలైనంత మేరకు ఇతర ధ్వనులు లేకుండా చూడండి. బేబీ శ్రావ్యమైన సంగీతమే వినేలా చూడండి. అపుడే దాని ప్రభావం బేబీ బ్రెయిన్ పై ఉండి అది మంచి తరంగాలు కలిగి అభివృద్ధి చెందటం మొదలు పెడుతుంది. మరో రకంగా తల్లికి కూడా అది ఎంతో ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
