Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
గర్భాధారణ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి...
స్త్రీలు గర్భం ధరించిన తర్వాత తమను తాము కాపాడుకోవాలంటున్నారు వైద్యులు. సాధారణంగా స్త్రీ గర్భం ధరించగానే -ఇంట్లో ఏ పనీ చెయ్యకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం మనం చూస్తూనే వుంటాం. అయితే- ఆ స్త్రీ సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రసవ సమయంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అందుకే -ఇంట్లో పనులను తనంతట తానుగా చేసుకుంటున్నట్లయితే సుఖ ప్రసవం జరుగుతుందని పెద్దలు సూచిస్తుంటారు. వారి కోసం కొన్ని చిట్కాలు..
చాలా మంది గర్భిణి స్త్రీలు నిద్రలేమితో బాధపడుతుంటారు. కాబట్టి పడుకోపోయే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. స్త్రీలకు ఆహార విహారాలలో కావలసినంత స్వేచ్చ ఇవ్వాలి.
గర్భం ధరించినపుడు లైట్ మేకప్ హుందాగా ఉంటుంది., పలుచని కాటుక రేఖ, లైట్ ఫౌండేషన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంట్లో వాడాకానికి మేక్సీ లేదా గౌను చాలా సుఖంగా ఉంటుంది. పెరిగిన శరీరాన్ని కాటన్ శారీ బాగా కప్పతుంది.

బ్లౌజ్ లూజ్ గా వుంటేనే మంచిది. టైట్ గా ఉండే వస్త్రాలు రక్తప్రవాహానికి ఇబ్బంది కలిగిస్తుంది. బ్రా అంత టైట్ గానూ వద్దు, అంత లూజ్ గానూ వద్దు. గర్భావస్థలో స్థనాలు పెరుగుతాయి అందువలన అవి జారిపోకుండా ఉండేందుకు తగినట్లుగా జాకెట్ ఉండాలి.
హై హీల్స్ శాండిల్ వేసుకోకూడదు. ప్లాట్ శాండిల్స్ చెప్పులు మంచిది. సింథెటిక్, పాలియస్టర్, నైలాన్ వస్త్రాలకు దూరంగా వుండాలి. ఇవి చర్మానికి మంచిదికాదు. ఈ వస్త్రాలు దురదలకు కారణం కావచ్చు.
వంటింట్లో పనిచేసేటపుడు సాదా రబ్బరు చెప్పులు కాటన్ వస్త్రాలు వాడాలి. ఈ స్థితిలో ఎప్పుడూ స్టూల్, టేబుల్ పై ఎక్కి పనిచేయ్యద్దు. మెట్లు ఎక్కిదిగేటపుడు జాగ్రత్తగా వుండాలి. మెల్లగా ఎక్కిదిగాలి. తొందరపాటు పనికిరాదు.
గర్భిణి స్త్రీలు తమ బరువు పెరుగుతున్నారా? లేదా? గమనించుకోవాలి. తొమ్మిది నెలలో గర్భిణి-ఎనిమిది లేక తొమ్మిది కిలోల బరువు పెరగాలి. పెరగనిచో ఏదో సమస్య ఉన్నట్లే. కనుక డాక్టర్ను సంప్రదించాలి. చివరి నెలలో అకస్మాత్తుగా బరువు పెరగడం మంచిది కాదు.
తల్లికాబోయే ఆమెకు మంచి పోషకాహారం ముఖ్యం. పచ్చటి ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, మాంసము మొదలగు ఆహరం తీసుకోవాలి.
గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువసేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి.
పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి-లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారితీయును. .
కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతీలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది--చాతిలోమంట నిద్రరానివ్వదు ..
పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు.
పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి.



Click it and Unblock the Notifications
