Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
గర్భవతి రతి చేస్తే బిడ్డకు ప్రమాదమా?

ప్రెగ్నెన్సీ సమయంలో ఇద్దరు జీవిత భాగస్వాముల కోరికలు ఎప్పటికపుడు మారుతూంటాయి. అవి తగ్గవచ్చు లేదా పెరగ వచ్చు. అయితే మీ భాగస్వామి కోరికలను, సౌకర్యాలను అర్ధం చేసుకోటానికి ప్రయత్నించండి. మహిళకు హార్మోన్లు అధికంగా ప్రభావిస్తుండటంచేత ఆమె స్తనాలు జననాంగాలు అధిక సెన్సీటివిటీ పొందుతాయి. కొంతమంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో మరింత ఆడతనం పొందుతారు. మరి కొంతమంది అలసట, ఆందోళన పొందుతారు. మరి కొంతమంది కి కామవాంఛ నశిస్తుంది. కనుక ఎప్పటికపుడు మహిళను అర్ధం చేసుకుంటూ పురుషుడు ఆ సమయంలో సెక్స్ చేయటానికి లేదా మానటానికి ప్రయత్నించాలి.
పురుషులలో కూడా కొంతమంది తమ మహిళ శరీరం మరింత సెక్సీగా వుందని భావిస్తారు. కొంతమంది సెక్స్ చేయటానికి వెనుకాడతారు. తాను తండ్రినవబోతున్నాననే భావన రావటంతో మరింత భాధ్యతాయుతంగా ఆమె పట్ల ప్రవర్తిస్తారు. ఇరువురికి గనుక తీవ్ర కామవాంఛ లేకుంటే, ఒకరినొకరు స్పర్శించుకుంటూ కూడా పూర్తి సెక్స్ ఆనందం పొందవచ్చు.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ సెక్స్ చేస్తే గర్భంలో వున్న బిడ్డకు ప్రమాదకరమా అనేది గర్భవతులను, వారి భాగస్వాములను వేధిస్తున్న సమస్య. లోపల వున్న బేబీకి ఇబ్బంది కలిగిస్తున్నామా, నిద్రిస్తున్న బేబీని లేపటమవుతుందా? పేరెంట్స్ సెక్స్ చేస్తున్నట్లు లోపలి బేబీకి తెలుస్తుందా? ఇటువంటి అనుమానాలు కూడా వుంటాయి. మహిళ గర్భం లో వున్న పిండం చుట్టూ ఎమినియోటిక్ ద్రవాలు వుండి, గర్భాశయంలో బిడ్డ ఎంతో సుక్షితంగా వుండి బయటి ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా వుంటుంది. అయితే, మహిళ తాను గర్భం మోసే 9 నెలలలోను, మొదటి మూడు నెలల కాలంలో అలసట, మార్నింగ్ సిక్ నెస్, నిద్ర అధికమవటం మొదలైన కారణాలుగా సెక్స్ అంటే చివరి ప్రాధాన్యత చూపుతుంది. దీనికితోడు ఆమె స్తనాలు కామోద్రేకం కలిగితే నొప్పిపెడుతూంటాయి. ఒక వేళ పురుషుడు సెక్స్ తలపెట్టినా ఆమె తిరస్కరిస్తుంది.
రెండో త్రైమాసికంలో మహిళ కడుపులో బిడ్డకు కొంత అలవాటుపడి కామ వాంఛ కలిగి వుంటుంది. ఈ రెండో త్రైమాసికంలో జీవిత భాగస్వాములు ఆనందకర రతిని సౌకర్యంగా చేసుకోవచ్చు. దీనినే సెకండ్ హనీమూన్ గా కూడా చెపుతారు. ఈ సమయంలో మహిళకు సెక్స్ కోర్కెలు అధికం అవుతాయి. బేబీకి ఎటువంటి అపాయం కూడా వుండదు. చాలామంది పురుషులు తమ భాగస్వామి శారీరక లావణ్యం చూసి రతికి సిద్ధపడతారు.
మూడవ త్రైమాసికంలో కూడా సెక్స్ సాధ్యమే కానీ కడుపులో బిడ్డ పెద్దదవటంతో అసౌకర్యంగా వుంటుంది. సాధారణంగా రతి చురుకుదనం తగ్గిపోతుంది. ఇక మహిళ దృష్టి అంతా పుట్టబోయే బిడ్డపైనే వుంటుంది. బిడ్డ కదలికలు కూడా లోపల అధికంగా వుండటంతో అలసిపోతుంది. ఇక ప్రెగ్నన్సీ చివరి దశలో 50 శాతం జంటలు తమ సెక్స్ కార్యాన్ని ఆపేస్తారు.



Click it and Unblock the Notifications