Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆడపిల్లను అక్కున చేరుద్దాం....!

తన మహిళ కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తేచాలు గర్భాన్ని సైతం విచ్ఛిన్నం చేయటానికి వెనుకాడరు. కాని తన పుటుకకు, పెంపకానికి, చివరకు తాను ఏ దశకు చేరాలన్నా ఒక ఆడదే తోడు అనే ప్రాధమిక అంశాన్ని కూడా గ్రహించని వారు నేటికి ఉన్నారు. మన దేశంలో ఆడ పిల్లలను గర్భంలోనే అంతమొందించటం చట్ట విరుద్ధంగా ప్రకటించారు. అసలు గర్భవతి అయినపుడు పుట్టేది ఆడా ? మగా? అని నిర్ణయించే వైద్య పరీక్షలను సైతం నిషేధించారు. మరి ఈ పరిస్ధితులలో చట్టపరంగా తగిన చర్యలు చేపట్టటమే కాక, సమాజపరంగా కూడా ప్రతి ఒక్కరు భ్రూణ హత్యలను అనాగరిక చర్యలుగా భావించి వాటిని నిరసించాలి.
తాజా సమాచారంగా, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా తన రాష్ట్రంలో ఆడపిల్లను పిండంగా ఉన్నపుడే గర్భంలోనే అంతమొందించటాన్ని ఒక హేయమైన చర్యగా ఖండించిన ఒక పంచాయతీ సంస్ధకు ఆ గ్రామాభివృధ్ధికిగాను కోటి రూపాయలను మంజూరు చేశారు. ఈ గ్రామం ఆ రాష్ట్రంలోని జింద్ జిల్లాలో బిబి పూర్ గా పిలువబడుతోంది.ఆ గ్రామంలోని ప్రజలు ప్రత్యేకించి మహిళలు ఆడ పిల్లలను భ్రూణ హత్య గావించటం చట్ట విరుద్ధమని, ఆ చర్య చాలా హీనమైనదని వారు ఖండించారు. ఈ గ్రామ ప్రజలు చేపట్టిన ఈ అంశం ఇతర ప్రాంతాల ప్రజలకు ఆదర్శమని, వీరి చర్య తమ రాష్ట్రంలోనే కాక, దేశంలోని ఇతర ప్రాంతాల వారికి కూడా ఆదర్శమని ముఖ్యమంత్రి హూడా వారిని అభినందించారు.
ఈ గ్రామ ఖాప్ మహా పంచాయతీలో మొట్ట మొదటి సారిగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరి సమావేశం బిబిపూర్ గ్రామంలో జరిగింది. వారు అక్కడినుండే సమాజంలో చెడును తొలగించే ఈ అంశంపై ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మహాపంచాయతీ లో హర్యానా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పంచాయతీలనుండి కూడా పెద్దలు పాల్గొని ఈ సామాజిక దురాచారాన్ని మట్టు బెట్టాలని తీర్మానించారు. మహిళా భ్రూణ హత్యల కారణంగా యువతుల సంఖ్య దేశంలో నానాటికి తగ్గిపోతోందని, ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు చర్యలు సమర్ధవంతంగా చేపట్టాలని వారు తీర్మానించారు.
ఇతర ఖాప్ పంచాయతీలు ముందుకు వచ్చి ఈ రకమైన సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. హర్యానా రాష్ట్రం ఇప్పటికే ఈ మహిళా భ్రూణ హత్యల దురాచారం రూపుమాపటానికి వివిధ కార్యక్రమాలను ప్రారంభించిందని, వీటిని అమలు చేయటానికిగాను ప్రజలనుండి హృదయ పూర్వక మద్దతు అవసరమని, అపుడే, తాము ఆశించిన ఫలితాలు సమాజానికి అందుతాయని ముఖ్యమంత్రి హూడా ప్రజలకు వివరించారు. మహిళా భ్రూణ హత్యలను అరికట్టటంలో చర్యలు చేపట్టి తమ పంచాయతి సమాజంలో సవ్యమైన మార్పులు ఏ రకంగా తీసుకు రావచ్చనేది చూపుతూ ఆదర్శంగా ఉందని ఇతర సామాజిక సంస్ధలకు ఒక మంచి ఉదాహరణా నిలిచి వుందని ఆయన కొనియాడారు.



Click it and Unblock the Notifications