Latest Updates
-
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది!
గర్భవతి మహిళ అవసరాల కొనుగోలు ఎలా వుండాలి?

గర్భవతి చిట్కాలు పుస్తకం - గర్భం ధరించిన ప్రతి మహిళకు ఈ పుస్తక అవసరం ఎంతైనా వుంటుంది. నేడు మార్కెట్ లో ఎన్నో చిట్కాలతో ఈ పుస్తకాలు దొరుకుతున్నాయి. కనుక గర్భవతి మహిళ ఏం తినాలి? ఏం తినకూడదు మొదలైన ఆహార, విహార సంబంధిత అంశాలకు మార్గదర్శకంగా ఒక పుస్తకం కొనుగోలు చేసి దానిని ఎపుడూ అందుబాటులో వుంచుకోవాలి.
లోపలి దుస్తులు - కాటన్ లో దుస్తులు గర్భవతికి సౌకర్యం. యోని నుండి డిశ్చార్జి అవుతుంది కనుక కాటన్ త్వరగా పీల్చేస్తుంది. కాటన్ గుడ్డ త్వరగా ఎండిపోతుంది, తేలికగాను వుంటుంది. వేసే బ్రాసరీలు కూడా వదులుగా వుండాలి. స్తనాలలో పాలు ఏర్పడుతూంటాయి, స్తనాలు పెరుగుతూంటాయి. కనుక వదులుగా వుంటే బాగుంటుంది.
దుస్తులు - గర్భవతి మహిళ కొనే దుస్తులు కొంచెం వదులుగానే వుండాలి. దుస్తులు వదులుగా వుంటే తేలికగా తిరగవచ్చు. వీరికి కాటన్ దుస్తులు బాగుంటాయి. బిగువుగా వుండే పేంట్లు, స్కర్టులు వేయవద్దు. అవి గర్భవతులకు హాని కలిగిస్తాయి. స్ట్రెచ్ మార్కులు కూడా పడతాయి. మంచి సిల్క్ గౌన్ కొన్ని నగలతో, వేస్తే కూడా చాలా బాగుంటుంది.
చెప్పులు - గర్భవతి మహిళ ఈ సమయంలో హై హీల్స్ వేయరాదు. పలుచని స్లిప్పర్స్ తేలికగా వుంటాయి. లేసులు వున్న బూట్ల వంటివి వేయకండి.
గర్భవతి మహిళ కొనుగోలు చేయటానికి పైన తెలిపినవి అతి సామాన్య వస్తువులు. వీటిని ఉపయోగిస్తే ఆమెకు చాలా సౌకర్యంగా వుంటుంది.



Click it and Unblock the Notifications
