Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
గర్భవతి దశలో బరువు నియంత్రణ !

గర్భవతి మహిళ సాధారణంగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి బరువు పెరుగుతుంది. అయితే పెరిగే బరువు కడుపులోని బిడ్డ వరకు మాత్రమే వుండేలా చూసుకోవాలి. మహిళ తాను కూడా బరువు పెరిగితే, డెలివరీ అయిన తర్వాత మరల పూర్వపు శారీరక రూపం సంతరించుకోవటం ఆమెకు ఎంతో కష్టమవుతుంది. కనుక గర్భవతి అయినప్పటికి బరువు పెరగకుండా ఎప్పటికపుడు ఎలా నియంత్రించాలో చూద్దాం.
డెలివరీ తర్వాత ఫిట్ గా వుండటమే కాదు, ఆరోగ్య సమస్యలు లేకుండా వుండాలన్నా కొన్ని ఆహార నియమాలు, వ్యాయామాలు పాటించితీరాలి. గర్భంతో వచ్చే కొవ్వు త్వరగా తగ్గదనే వాస్తవంకూడా గ్రహించండి. గర్భవతి వారానికోసారి బరువు పరీక్షించుకుంటూ వుండాలి. ఎప్పటికపుడు డాక్టర్ ను సంప్రదిస్తూ ఎంత మాత్రం బరువు వుండవచ్చో తెలుసుకుంటూ అధిక బరువు నివారించుకోవాలి.
గర్భవతి ఆహారాలు ఎలా వుండాలి?
గర్భవతిగా వున్నపుడు కూడా డైటింగ్ చేయవచ్చు. తప్పేమీ కాదు. సరి అయిన సమయానికి సరైన ఆహారం అనేది నియమంగా వుండాలి. ప్రొటీన్లు అధికంగా కల పప్పులు, మినరల్స్, విటమిన్లు వున్న కూరలు, ఒక చెంచాడు నెయ్యి వంటివి ప్రతి రోజూ సంతులిత ఆహారమే. అధిక బరువుండే స్త్రీలు గర్భవతి దశలో బరువు తగ్గాలంటూ వ్యాయామాలు చేస్తారు. ఇది సరికాదు. ప్రతి దశలోను పోషకాహార నిపుణులను సంప్రదించాలి.
బరువు నియంత్రణకు ఒక ఛార్టు పెట్టుకోండి. మీ బరువు, బాడీ మాస్ ఇండెక్స్, వయసు, ఎత్తు మొదలైనవి ఫిట్ నెస్ నిపుణులకిస్తే వారు గర్భస్ధదశలో కూడా మీబరువు నియంత్రిస్తారు. గర్భవతి దశలో మీరు తీసుకునే బలవర్ధకమైన ఆహారాలు సూచిస్తారు. ఈ ప్రత్యేక ఆహారాలు బిడ్డ పోషణకు సహకరించేవిగా వుంటాయి. అదే సమయంలో మీరు బరువు అధికంకాకుండా వుంటారు. డెలివరీ తేలికగా అయ్యేటందుకు కొన్ని వ్యాయామాలు చేయండి. ప్రాణాయామం, స్ట్రెచెస్, ధ్యానం వంటివి శరీరాన్ని హాయిగొల్పేలా చేస్తాయి.



Click it and Unblock the Notifications
