Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఆమెకు నెలసరి సమయంలో పురుషుడు ఏం చేయాలి?

ఆమెలో ప్రతినెలా ఆ సమయంలో వచ్చే మార్పులను ముందుగానే మీరు ఆమె మూడ్ స్వింగ్ ల ద్వారా పసిగట్టవచ్చు. కొంతమంది దీనిని పురుషుడిపై మండిపడే సమయంగా కూడా వర్ణిస్తారు. ఆ సమయం వచ్చేస్తోందంటే ఆమె రిఫ్రిజిరేటర్ లో తనకిష్టమైన చాక్లెట్ వుంచుకోవడం లేదా ఘాటైన ఇతర తినే పదార్ధాలను వుంచుకోవడం చేస్తుంది. ఇక ఇటువంటపుడు మీరు ఆమె కోప తాపాలను ఎదుర్కొనటానికి సిద్ధం కావాలి. ఏ కారణం లేకుండానే ఆమె మీపై లేదా ఇతర కుటుంబ సభ్యులపై విరుచుకుపడే అవకాశం వుంటుంది.
మీరు ఏం చేయాలి?
అప్పటివరకు మీరు ఆమెతో కొనసాగిస్తున్న సరస సల్లాపాలు కట్టేయాలి. ఆమె కనుక బెడ్ లో పడుకొని తనతో పాటు టి.వి. వంటి వాటిలో వచ్చే రొమాంటిక్ ఫిల్ములు చూడాలంటే, మీరు అంతవరకు చేయాలి. ఆమెను ఆమె కిష్టమైన రనెస్టరెంటు కు తీసుకు వెళ్ళి రుచికరమైన పదార్దాలను తినేలా చేయండి. ఆ సమయంలో ఆమెకు రెస్టరెంట్ లో సీటింగ్, సెర్వింగ్ మొదలైనవాటిలో ఏ అసౌకర్యం కలుగకుండా వెన్నంటి వుండండి. మహిళ ఈ సమయంలో చిన్న అసౌకర్యానికి కూడా చాలా కోపం చేస్తుంది.
ఈ సమయంలో ఆమెలో శారీరకమైన, హా్ర్మోన్ల సంబంధంగాను మార్పులు వస్తాయని గుర్తించండి. ఆమెకిష్టమై చేసే వంటకాలను ఏ మాత్రం అయిష్టం చూపకుండా తినేయండి. ఆమె కిష్టమైన రంగు షర్టు వార్డ్ రోబ్ లో ఎణక్కడున్నా సరే తీసి ధరించండి. ఆమె తనకిష్టమైన రీతిలో ఫర్నిచర్ ఏర్పాటు చేస్తే కాదనకండి.
చాక్లెట్లు తెచ్చివ్వండి - రుతుక్రమ సమయంలో మహిళతో వాదించేముందు, మీ చేతిలో చాక్లెట్ ఒకటి ఎపుడూ వుండాలి. ఆమెకు ఈ సమయంలో వచ్చే తలనొప్పి మైగ్రేన్ వంటి ఇబ్బందులు తగ్గాలంటే చాక్లెట్ లోని పదార్ధాలు బాగా పనిచేస్తాయని రీసెర్చి తెలుపుతోంది.
సానుభూతి చూపండి - ఈ సమయంలో ఆమె మీ నుండి అన్నిటికి పాజిటివ్ సమాధానాలే కోరుతుంది. అందుకుగాను మీరు అన్నిటికి అవును ....నీ బాధ అర్ధం చేసుకోగలను వంటి మాటలే వాడాలి. ఆమె మూడ్ మార్చాలంటే మీకు చాలా సమయం పడుతుంది.
సహనంతో వుండండి - మహిళ సగటున నెలకు ఆరు రోజులు భావావేశాలతో వుంటుంది. అవసరమైన సమయాలలో తప్పక మందులు వాడండి. మందుల వాడకం కంటే కూడా మీ ఉదార ఆలోచనలు ఆమెకు ఊరటనిస్తాయి.
ఆమె ప్రతిదినం చేసే పనులలో కొన్నింటిని మీ అంతట మీరే చేసుకోండి. వంటలో సహాయం చేయటం, ప్రతిరోజూ ఆమెకు అవసరమైన సరుకులు లేదా శానిటరీ నేప్ కిన్స్ వంటివి తీసుకురావటం మొదలైన పనులు ఆమెకు మీ పట్ల మంచి భావన కలిగిస్తాయి. ఒకవేళ మీరు కనుక ఆమెకుగల రుతు క్రమం తెలుసుకోలేకపోతే, ఆమె భావావేశాలకు లోనవుతుంటే, ఆమెను ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి. ఇది మీ పట్ల ఆమెకు మంచి భావనే కలిగిస్తుంది.
ఈ సమయంలో అన్నిటికి మించి ఆమె మాటలకు మీరు విమర్శించకండి. ఆమెలో వచ్చే శారీరక మార్పులను విమర్శించకండి. ఈ సమయంలో మహిళలు వారికిష్టమైన ఆహారాలు తీసుకుంటారు. వాటిని మీరు నియంత్రించకండి. ఆమె మీకు బరువుతగ్గాలని భావించినా, ఆ సమయంలో తినే ఆహారాలపట్ల నియంత్రణ కోరకండి. మీరు కనుక ఆమెతో ఈ అంశాలలో విభేదిస్తే, ఆమె డిప్రిషన్ కు గురయ్యే ప్రమాదం వుంది. వాదనలు, పోట్లాటలు వంటివి ఈ సమయంలో సూచించదగినది కాదు. ఆమెను ప్రశాంతపరచేందుకు ప్రయత్నించండి. ముఖ్యమైన పనులేమైనా వుంటే వాటిని కొద్ది రోజులు వాయిదా వేయండి. ఆమె ప్రశాంతంగా వున్నపుడే ఆ పనులు చేసుకోండి.



Click it and Unblock the Notifications
