Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పండంటి బిడ్డకు తేలికైన యోగా!

మీరు ఆచరించగల యోగాసనాలు ఏవి?
మీ గర్భంపై ఒత్తిడి తెచ్చే ఆసనాలు వదిలేయండి. మీ అంగాలు వంగకుండా కష్టం అనుకునేవి కూడా వదిలేయండి. అధికమైన యోగా ఆసక్తి చూపండి. తేలికైన కొన్ని ఆసనాలు పరిశీలించండి. అవి మీ శరీరానికి సరిపడతాయనుకుంటే, మీరు తేలికగా చేయగలరనుకుంటే వాటిని కొనసాగించండి.
పర్వతాసనం -ఈ ఆసనంలో మీరు బలాన్ని, నిలకడను, స్ధిరత్వాన్ని సాధిస్తారు. రిలాక్స్ అయ్యేటందుకు ఇది బాగా పని చేస్తుంది. దీనిలో మీరు నిలకడగా చేతులు పైకి ఎత్తి రెండింటిని కలుపుతూ నిలబడాలి. కళ్ళు మూయాలి. దీనివలన మీలో మంచి ప్రశాంతత ఏర్పడుతుంది.
ట్రయాంగిల్ ఆసనం - ఇది గర్భిణీ స్త్రీ తేలికగా చేయగలిగినది. శరీరం, మైండ్ రెండూ రిలాక్స్ అవుతాయి. దీనిని ధ్యానంలో చేస్తారు. అన్నిటికంటే చివరిలో చేసేది ఇది. కాళ్ళను వీలైనంత దూరంగా వుంచండి. ఒక చేయి గాలిలోకి వదిలి మరో చేయితో మీ కాలు పట్టుకోండి.
యోధుని భంగిమ - ఈ భంగిమలో మీరు చేతులు కాళ్ళు విశాలంగా చాపుతారు. ఇది మీ చేతులను, కాళ్ళను బలపరుస్తుంది. తలనొప్పి తగ్గిస్తుంది. ఏకాగ్రత, బలం అధికమవుతాయి. సాధారణంగా గర్భవతులకు వచ్చే వెన్ను నొప్పి, డయోరియా, రక్తపోటు వంటివి వుంటే ఈ ఆసనం వేయకండి. ఈ ఆసనంలో కాళ్ళు రెండూ వెడం చేసి ఒకే కాలిపై శరీర బరువు ఆనేలా చేస్తారు. చేతులను ముడవటం, తెరవటం చేస్తారు.
నిలబడి ఒక పక్కకు వంగటం - ఈ భంగిమ మీకు మంచి శక్తినిస్తుంది. ఒక చేయి గాలిలోకి వదులుతారు. ఒకచేయిని పక్కకు ఒరుగుతూ పాదాలు తాకేలా చేస్తారు.
భుజాలు పైకెత్తటం - శరీర కండరాలలోని టెన్షన్లు, బిగుసుకుపోవడాలు వంటివి దీనిలో తగ్గుతాయి. కండరాలు బలపడతాయి. సరళత్వం పెరుగుతుంది. దీనిలో భుజాలు పైకి శరీరం వీలైనంత కిందకు వంచేలా చేస్తారు. గర్భంకు సంబంధించిన భయాలు ఇది పోగొడుతుంది.
ప్రాణాయామాలు - గర్భవతి సౌకర్యవంతంగా కూర్చొని ఎడమ ముక్కుతో గాలిపీల్చడం, కొద్ది సెకండ్లు నిలబెట్టి, కుడిముక్కుతో గాలి వదలడం చేయాలి. దీనిని మరల రివర్స్ దిశగా చేయాలి. ఇటువంటి శ్వాస సంబంధిత వ్యాయామాలు గర్భం ధరించడంలోని ఆందోళన, కాన్పు నొప్పుల భయాలు వంటివి తగ్గిస్తాయి. ఆమెకు మంచి శారీరక రూపం కలిగిస్తాయి. గర్భాశయం, పొట్ట, తుటి ప్రదేశం, వెన్ను వంటి భాగాల నొప్పులు తగ్గిస్తాయి.



Click it and Unblock the Notifications
