Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
గర్భిణి స్త్రీ ప్రసవించడానికి సిద్దంగా ఉన్నదని గుర్తించే 10 సంకేతాలు
మీరు భావోద్రేకంతో ఎదురుచూస్తున్న ఆ గొప్ప రోజు ఏ సమయంలోనైన రావొచ్చు. ఏ అద్భుతం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఒక సాధారణ గర్భిణి స్త్రీ తను అనుభవించే నొప్పుల గురించిన ఆలోచనలకు గురవుతూ ఉంటుంది. మీ గర్భిణి చివరి దశలో కలిగే ఆందోళనను మీరే పోగొట్టుకోవటానికి, క్రింద ఇచ్చిన 10 సంకేతాలను చదవండి.
1. బేబీ క్రిందకి జరగటం : మీ బేబీ కొంచెం క్రిందకి జరిగినట్లుగా మీరు అనుభూతి చెందుతారు. మీయొక్క బేబీ బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టటానికి సిద్ధమవుతోంది.
2. మీరు శ్వాసను సులభంగా పీల్చుకోగలగటం : ఎందుకంటె బేబీ క్రిందికి జరగటం వలన మీ డయాఫ్రమ్ మీద కొంత ఒత్తిడి తగ్గి శ్వాస సులభంగా తీసుకోగలుగుతారు. మీరు ఇదివరలో కన్నా శ్వాసను తేలికగా తీసుకోవటం గమనించవొచ్చు.

3. మీ మూత్రాశయం నిండినట్లుగా మీరు అనుభూతి పొందటం : మీ బేబీ క్రిందికి జరగటం వలన మీ డయాఫ్రమ్ మీద ఒత్తిడి తగ్గి ఉపశమనం పొందినా, మీ మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి, మీరు తరచుగా బాత్రూంకు వెళుతుంటారు.
4. మీరు ముకస్ ప్లగ్ (తెల్ల స్రావం) కోల్పోవటం: దీనిని కూడా బ్లడీ కార్యక్రమం అంటారు. హానికరమైన బ్యాక్టీరియా మీ యోని గుండా ప్రవేశించకుండ,మీ గర్భాశయ ద్వారం కప్పుతున్న'తెల్ల స్రావాన్ని' కోల్పోతారు. తెల్ల స్రావాన్ని కోల్పోవటం అంటే మీరు నొప్పులకు దగ్గరవుతున్నారు. ఈ తెల్ల స్రావ ఉత్సర్గం శ్లేష్మం మాదిరి మృదువుగా మరియు జిగటగా ఉంటుంది. ఇది గులాబి లేదా ఎరుపు మచ్చలతో ఉంటుంది. ఒక్కోసారి ఇది చాలా స్వచ్చంగా ఉంటుంది.
5. మీ నీటి విచ్ఛిన్నం: ఈ రకమైన సంకేతాన్ని సినిమాలో ఒక గర్భిణి స్త్రీ తన యోని నుండి హఠాత్తుగా నీరు పడిపోయినట్లుగా, ఆ స్త్రీ కెవ్వున కేక వేసి 'నీరు పడిపోయింది' అన్నట్లుగా చూపిస్తారు. నిజానికి ఇది చాలా నిదానంగా, కాని నిరంతరం బొట్లుగా బొట్లుగా పడుతుంది. ఇలా ఎప్పుడు జరుగుతుందో, వెంటనే మీరు డాక్టర్ ను కావాలి.
6. మీరు శక్తివంతులుగా ఉన్నట్లుగా అనిపిస్తారు: మీరు హఠాత్తుగా ఇంట్లో శుభ్రం చేయటం ప్రారంభిస్తే మరియు మీరు బద్ధకంగా కాకుండా చురుకుగా అనిపించటం, ఇది కూడా నొప్పులకు సంకేతం. దీనిని 'గూడు స్వభావం' అని అంటారు.
7. మీ గర్భాశయ ద్వారం సన్నగా అవటం ప్రారంభమవుతుంది: గర్భాశయ ద్వారం యెంత సన్నబడిందో ఒక నర్సు లేదా వైద్యుడు కాని కొలుస్తారు మరియు నిర్ణయిస్తారు. దీనినే ఎఫెస్మేంట్ అంటారు. దీని అర్థం మీ శరీరం గొప్ప రోజు కోసం రెడీగా ఉందన్న మాట!
8. మీ గర్భాశయ ద్వారం వెడల్పుగా అవటం మొదలవుతుంది: దీని అర్థం మీ గర్భాశయం శిశువు జన్మించటానికి తెరుచుకుని రెడీగా ఉందన్న మాట.
9. మీకు సన్నని వెన్నునొప్పి మొదలవుతుంది: బేబీ క్రిందికి జారతంవలన మీకు వెన్నునొప్పి మొదలవుతుందన్న మాట. ఇది ఇంకో సంకేతం.
10. మీకు కుదింపులు లేదా నొప్పులు మొదలవటం: ఇది నొప్పులకు గుర్తు. మెల్లమెల్లగా ఈ కుదింపులు క్రమంగా త్వరత్వరగా ఒక పద్ధతిలో మొదలవుతాయి. అవి చాలా తీవ్రంగా మరియు చాలా తక్కువ దూరంలో ఉంటాయి.
మీరు ఈ రకమైన సంకేతాలను ఎదుర్కుంటున్నట్లయితే, వెంటనే మీరు డాక్టర్ను సంప్రదించండి.
e



Click it and Unblock the Notifications
