Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
ఈ పరిస్థితుల్లో మాత్రమే అబార్షన్ చేయించుకోవడం అత్యవసరం ...!

అయితే కొన్ని సందర్భాల్లో పిండం సరిగా లేనప్పుడు సీరియస్ జెనెటిక్ డిఫెక్ట్స్ కలిగి ఉండే ఇక వారి సమస్యను బాగు చేయలేమని డిసైడ్ అయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలు అబార్షన్ చేయించుకోవల్సి వస్తుంది. గర్భశ్రావం చేయడానికి వైద్య పరంగా ఎటువంటి పరిస్థితుల్లో అవసరం అవుతుందో ఒక సారి చూద్దాం...
గర్భిణీగా ఉన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు: గర్భం దాల్చిన తర్వాత కొన్ని వైరల్ డిసీజెస్ చికెన్ పాక్స్ వంటివి వచ్చినప్పుడు, ఆ మహిళక ఖచ్చితంగా అబార్షన్ చేయించుకోవడం అవసరం. చికెన్ పాక్స్ కు సంబంధించిన వైరన్ మీ శరీరంలో కనీ మూడు నెలలు నిల్వఉంటాయి కాబట్టి ఇది కడుపులో పెరిగే బిడ్డకు ఇన్ఫెక్షన్ గా మారుతుంది.
క్యాన్సర్: గర్భాధారణ సమయంలో, మహిళ క్యాన్సర్ బారీన పడిందని తెలిసినప్పుడు మెడికల్ టర్మినేషన్ చేయించుకోవడం అత్యవసరం. ఎందుకంటే క్యాన్సర్ కు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. కీమోథెరపీకి ఉపయోగించే కఠినమైన కెమికల్స్ కడుపులో పెరిగే బిడ్డ మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. ఒక గర్భిణీ స్త్రీ క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు డెలివరీ కోసం వేచి ఉంటే అది ఆమె ఆరోగ్యాని(జీవితాని)కే ప్రమాదకరంగా మారవచ్చు.
పుట్టుకతో లోపాలు: బేబీ డౌన్ సిండ్రోం లేదా మస్తిష్క పక్షవాతం వంటి పుట్టుకతో కూడిన లోపాలు ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా ఉమ్మనీటిని సిరంజితో తీయుడం వంటివి చేస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోవడం ఉత్తమం.
గర్భశ్రావం: కొన్ని సందర్భాల్లో తల్లి చాలా బలహీనమైన గర్భం కలిగి ఉండి డాక్టర్ తప్పనిసరిగా గర్భశ్రావం జరుగుతుంది అని ఖచ్చితంగా నిర్ధారించినప్పుడు, ఆ స్త్రీకు ఎటువంటి హానీ కలగకుండా ముందే అబార్షన్ చేయించుకోవడం వల్ల ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తవు.
లైంగిక సంక్రమణ వ్యాధులు ఉన్నప్పుడు: స్త్రీ గర్భం దాల్చినప్పుడు లైంగిక సంక్రమణ వ్యాధులు అంటే హెచ్ ఐవీ, లేదా సిఫిలిస్ వంటివి నిర్ధారణ అయినప్పుడు బిడ్డకు కూడా చాలా హాని చేసే పరిస్థితులు ఉన్నప్పుడు అబార్షన్ చేయించుకోవడం అత్యవసరం. హెచ్ ఐవీ ఉన్నప్పుడు అది బిడ్డకు సంక్రమిస్తుందో లేదో కూడా తెలియకపోవచ్చు దాంతో బిడ్డ జీవితాంతా వ్యాధితో బాధపడే కంటే ఇలా అబార్షన్ చేయించుకోవడమే ఉత్తమం.
గర్భిణీకి మధుమేహం ఉంటే: గర్భిణీకి డయాబెటిక్ ఉన్నప్పుడు, ఆమె రక్తంలోని షుగర్ లెవల్స్ బేబీ డెవలప్ మెంట్ కు చెడు ప్రభావం కలిగించవచ్చు. కాబట్టి మీ డైయబెటిక్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటే అబార్షన్ అవసరమని మీ డాక్టర్ సలహా ఇవ్వొచ్చు.
హైథైరాయిడ్: తల్లి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నప్పుడు, కడుపులో పెరుగుతున్న బేబీ బ్రెయిన్ కు పూర్తిగా చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి మదర్ థైరాయిడ్ హార్మోన్స్ కంట్రోల్లో ఉండకపోవడం చేత అబార్షన్ చేయించుకోవడం అవసరం అవుతుంది.
ఇవన్నీ అత్యవసర పరిస్థితిల్లో అబార్షన్ చేయించుకోవడానికి వైద్యపరమైన కారణాలు.



Click it and Unblock the Notifications