Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
గర్భిణీ స్త్రీలకు అత్యంత ప్రయోజకారిని..ఫోలిక్ యాసిడ్

సాధారణంగా మీరు గర్భం ధరించటానికి ప్లాన్ వేసుకుంటే దానికి ఒక సంవత్సరం ముందు నుంచి ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లను వాడితే నెలలు నిండకుండా పుట్టే పిల్లల శాతం 60%శాతానికి పైగా రిస్క్ తగ్గుతుంది. ఒకవేళ గర్భధారణ ఆకస్మికంగా ఉంటే మీరు గర్భవతి అని తెలిసిన వెంటనే ఫోలిక్ ఆమ్లం మాత్రలను ప్రారంభించండి.గర్భధారణ యొక్క మొదటి 12 వారాల ఫోలిక్ ఆమ్లం మాత్రలు తీసుకోవాలి.ఫోలిక్ ఆమ్లం B విటమిన్ యొక్క ఒక రూపం.ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల గర్భస్రావం జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, మరియు పిల్లలు నాడీ ట్యూబ్ డిజార్డర్ ప్రతి 1000 మందిలో ఒకరికి వచ్చేఅవకాశం ఉంది.
1.పుట్టుకతో వచ్చే లోపాలు గర్భం యొక్క మొదటి 3-4 వారాలలో సంభవిస్తాయి. మీ బిడ్డ యొక్క మెదడు మరియు వెన్నెముక అభివృద్ధి చెందే ఆ తొలి దశలలో మీరు తప్పనిసరిగా ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లను తీసుకోవాలి.
2.పాలకూర వంటి కూరగాయలు, మొలకలు, బ్రోకలీ, ఆకుపచ్చ బీన్స్, మరియు బంగాళాదుంప లలో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది.
3. మీరు గర్భవతి ఉన్నప్పుడు ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లను మరియు అదనంగా మీరు ఫోలిక్ ఆమ్లం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
4. కణ విభజన మరియు పిండం అభివృద్ధి కి ఫోలిక్ ఆమ్లం బాగా ఉపయోగపడుతుంది.
5. ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల నెలలు నిండకుండా పిల్లలు పుట్టటం మరియు తక్కువ బరువు గల పిల్లలు పుట్టటం జరుగుతుంది.
6. ఫోలిక్ ఆమ్లం ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
7. అల్జీమర్స్ వ్యాధి, గుండెపోటు, స్ట్రోక్ మరియు క్యాన్సర్ వంటి ప్రమాదాలు తగ్గిస్తుంది.
8. ఫోలిక్ ఆమ్లం డియోక్సిరిబౌన్స్లెయిక్ యాసిడ్ (DNA) ఉత్పత్తికి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
9. ఇది శిశువుకు గుండె లోపాలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
10. ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల గర్భస్రావం జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
11. ఫోలిక్ ఆమ్లం లేకపోవడం వల్ల పిండం యొక్క అభివృద్ధి మరియు కణ విభజన బలహీనపడవచ్చు.
12. గర్భధారణ సమయంలో ఫోలిక్ ఆమ్లం యొక్క రక్షక ప్రభావం వల్ల నాడీ సంబంధ నాళిక లోపాలను నివారించవచ్చు.
13. బిడ్డ యొక్క మెదడు మరియు వెన్నెముక మరియు పుట్టుకలో వచ్చే లోపాలను నిరోధిస్తుంది.లింబ్ లోపాలు మరియు మూత్ర నాళాలు క్రమరాహిత్యాలు రిస్క్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
14. ఫోలిక్ ఆమ్లం B9 విటమిన్ యొక్క ఒక రూపం.
ఫోలిక్ ఆమ్లం ఉన్న ఆహార పదార్దాలు
తృణధాన్యాలు
కాయధాన్యాలు
ఆకుకూర, తోటకూర
బచ్చలికూర
బ్లాక్ బీన్స్
పీనట్స్
ఆరెంజ్ జ్యూస్
రొట్టెలు మరియు పాస్తా
పాలకూర
మొలకలు
బంగాళాదుంప
బ్రోకలీ .......మొదలైనవి
గర్భధారణ సమయంలో ప్రతి రోజు తీసుకోవలసిన ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్
గర్భం ప్రయత్నిస్తున్న సమయంలో: 400 MCG
గర్భధారణ యొక్క మొదటి మూడు నెలలు: 400 MCG
గర్భధారణ యొక్క నాలుగు నుంచి తొమ్మిది నెలలు: 600 MCG
బిడ్డకు పాలు ఇచ్చు సమయంలో : 500 MCG



Click it and Unblock the Notifications