Latest Updates
-
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్ -
బీపీని తరిమికొట్టే 5 సూపర్ ఫుడ్స్.. ఇక మందులతో పనిలేదు! -
సాయంత్రానికి నోరూరించే జొన్న పకోడీ..మామిడికాయ పచ్చడితో తింటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
వేడిని తగ్గించే కీర దోసకాయతో.. నోరూరించే కొరియన్ కిమ్చి..ఈజీగా చేసేయండిలా.. -
ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి! -
నోరూరించే వంకాయ పచ్చి కారం..వేడి అన్నంతో తింటే అద్భుతో అద్భుత అద్భుతసహ్య.. -
ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
వృషభం, మిథునం, సింహ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉంది? - 17 నుండి 23 మే 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం మీ అదృష్టం ఎలా ఉంది? - ఆదివారం, 17 మే 2026 -
Chilkur Balaji Temple: వీసా మాఫియా గుడి.. చిలుకూరు బాలాజీ ఆలయంపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
గర్భణీ 2వ నెలలో తినకూడని10 హానికర ఆహారాలు!
సాధారణంగా మహిళలు నెల తప్పగానే వారి శరీరంలోని హార్మోనుల ప్రభావం చేత వారిలో మానసికంగా మరియు శారీరకంగా అనేక మార్పులకు చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా నెల తప్పగానే స్త్రీలో అలసట, వికారం, వేవిళ్ళు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే ఈ లక్షణాలు రెండవ నెలలో కూడా అలాగే కొనసాగుతాయి. ఈ నెలలో, తల్లి కాబోతున్నారన్న సంతోషం మాత్రమే కాదు, ఆనందంతో పాటు మానసిక కల్లోలం, అలసట మరియు మైకము, తరచూ మూత్రవిసర్జన వంటి లక్షణాలను కలిగి ఉంటారు. అంతే కాదు, వీరిలో వివిధ రకాల ఆహారాల మీద కోరికలు ఉన్నప్పటికీ, గర్భం ధరించిన తర్వాత రెండవ నెల నుండే కొంత కాలం పాటు కొన్ని రకాల ఆహారాలను తినడానికి వీలు లేదు.
గర్భధారణ సమయంలో, అండాశయంలోని కణాలు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అలాగే కొనసాగుతుంటుంది. ఈ హార్మో వల్ల పూర్తి గర్భధారణ కాలం ఆరోగ్యకరంగా నిర్వహించడానికి చాలా ముఖ్యం. అంతే కాదు దీని వల్ల గర్భిణీ స్త్రీలో బ్లడ్ సర్యులేషన్ బాగా జరిగుతుంది. దాంతో గర్భిణీ మునపటి కంటే వెచ్చని అనుభూతిని కలిగి ఉంటుంది. ఈ మార్పులను, శరీరంలో ఏర్పడే మార్పులను, ఉదర భాగం పెరగడాన్ని చూసి ఆనందంచడం మీరు గమనించవచ్చు. అలాగే తల్లి కూడా, రెండవ నెలలో తన శరీరంలో ఏర్పడే ఉష్ణత వల్ల కడుపు లోపల పెరిగే పుట్టబోయే బిడ్డ గురించి ఆమె శాంతముగా అనుభూతిని కలిగి ఉంటుంది.
కాబట్టి, గర్భిణీ స్త్రీకి, సురక్షిత ప్రసవం జరగాలంటే, వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. మరియు ముఖ్యంగా గర్భధారణ సమయంలో మంచి పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, మహిళలు గర్భం ధరించిన తర్వాత కొన్ని తినకూడని సాధారణ ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిని రెండవ నెల నుండే తినకుండా నివారించాలి. ఈ సమయంలో (రెండవ నెలలో)అన్ని ఆహారాలను తీసుకోవడం గర్భిణీకి సురక్షితం కాదు. కాబట్టి, గర్భం దాల్చిన రెండ నెలలో తినకూడని కొన్ని ఆహారాల లిస్ట్ ఏంటో ఒక సారి పరిశీలించండి...

మీట్ స్ప్రెడ్(Meat Spread): గర్భధారణ సమయంలో ముఖంగా గర్భం ధరించిన రెండవ నెలలో ఇటువంటి ఆహారాన్ని నివారించాలి. గర్భిణీలు నివారించవల్సిన ప్రధాన ఆహారాల్లో ఒకటైన ఈ మీట్ స్ప్రెడ్ లిస్టిరియాను కలిగి ఉంటుంది. ఇది శిశువు యొక్క పెరుగుదలకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వీటిని నివారించడమే ఉత్తమం.

సాఫ్ట్ చీజ్: ఖామమ్బెర్ట్, Roquefort, బ్రీ, కొన్ని రకాల మృదువైన జున్నువంటివి. ఈ చీజ్ లలో ఇ కోలీ ఉంటుంది. ఇది రెండవ నెల గర్భధారణ సమయానికి చాలా హానికరం.

లివర్: కొంత మంది గర్భిణీ స్త్రీలు, గర్భం ధరించిన నాల్గవ నెలలో లివర్ తినాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. అయితే గర్భం ధరించిన రెండవ నెలలో ఈ ఆహారాన్ని నివారించాలి. ఎందుకంటే లివర్ (మాంసాహారం) ఇందులో విటమిన్ ఎ, రెటినల్ రూపంలో కలిగి ఉంటుంది. ఇది గర్భస్రావంకు దారితీస్తుంది.

అన్ పాస్టురైజ్డ్ మిల్క్(unpasterurized milk): సూక్ష్మ క్రిమిరహిత పాలును గర్భధారణ సమయంలో నివారించాలి. ఎందుకంటే గర్భణీ స్త్రీ ఆరోగ్యానికి తీవ్రంగా హానికలిగించే మైక్రోఆర్గనిజం(సూక్ష్మిక్రిములు)కలిగి ఉంటాయి. unpasterurized పాలలో సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బాక్టీరియా కలిగి ఉంటుంది.

ఆల్కహాల్: గర్భం ధరించారని నిర్ధారణ అయిన వెంటనే ఆల్కహాల్ తీసుకోవడం నివారించాలి. ఆల్కహాల్ వల్ల పిల్లల పుట్టుకలో లోపాలు ఏర్పడుతాయి. కాబట్టి, ఆల్కహాల్ కలిగినటువంటి అన్ని రకాల పానియాలను నివారించడం గర్భణీ స్త్రీకి సురక్షితం.

పచ్చిగుడ్లు: గర్భధారణ సమయంలో ఉడికించన గుడ్లను తీసుకోకూడదు. లైట్ గా ఉడికించినవి కూడా తినడకూడదు. ఉడికించని గుడ్లలో సాల్మోనెల్లా ఉంటుంది. ఇది తల్లికి మరియు బిడ్డకు ప్రమాధకరం.

రిఫ్రజరేటెడ్ మీట్: నైట్రిక్ యాసిడ్ తో ఉడికించిన ఆహారాన్ని నివారించడం ఉత్తం. శీతలీకరించిన మాంసాహారాలు గర్భం ధరించిన రెండవ నెలలో తినడం మంచిది కాదు . గర్బిణీ స్త్రీలు తినే మాంసాహారం అధిక ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడకబెట్టి తీసుకోవాలి.

చేపలు: షుషిఅనే చేపలను గర్భధారణ సమయంలో నివారించడం చాలా మంచిది. పీల్డ్ సీఫుడ్, అంటే క్రాబ్స్, ప్రాన్స్ మరియు లాబ్ స్టర్ వంటివి నివారించాలి. కానీ, తునా ఫిష్ ను నెలకు ఒక సారి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మెర్క్యురి అధికంగా ఉంటుంది.

కుక్కీస్ పిండి: కుక్కీస్ చాక్లెట్ వంటివి తయారు చేసే సమయంలో వాటి రుచిని తెలుసుకోవడానికి పచ్చిపిండిని టేస్ట్ చూస్తుంటారు. అలా చేయకూడదు. కుక్కీస్ లో పచ్చిగుడ్లను వేయడం వల్ల అందులో సాల్మోనెల్లా అధికంగా ఉండి గర్భణీ స్రీకి హాని కలిగిస్తుంది.

ప్రీ స్టఫ్డ్ ఫుడ్: స్టఫ్డ్ ఫుడ్ 180డిగ్రీల్లో ఉడికించకపోతే, వాటిలోని బ్యాక్టీరియా గర్భణీ స్త్రీ ప్రమాదాన్ని కలిగిస్తాయి. అంతే కాదు కడుపులో పెరిగే శిశువు పెరుగుదల మీద కూడా హాని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications