Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
గర్భిణీ పాదాలు, చేతి వాపులను అధిగమించడం ఎలా?
గర్భవతులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలలో సహజంగా వచ్చే కాళ్ళ వాపు ఒకటి. ఈ వాపు ఎంతో అసౌకర్యంగా వుంటుంది. వాస్తవానికి కాళ్ళు, మాత్రమే కాదు శరీరం అంతా కూడా కొద్దిపాటిగా ఉబ్బి నొప్పులు కలిగిస్తూంటుంది. ఈ దశలో మీ బరువులో నాలుగో వంతు నీరు మాత్రమే. కనుక మీరు ఆందోళన చెందనవసరం లేదు. గర్భధారణ సమయంలో ఇలా వాపులు రావడానికి రెండు ముఖ్య కారణాలున్నాయి. ఒకటి శరీరం అధిక నీటిని నిల్వచేసుకుంటుంది. రెండవది, పెరిగిన రక్తపరిమాణం ప్రెగ్నెన్సీ సమయంలో పిండం ఎదుగుదలకు ఉత్పత్తి చేస్తుంది.
మీ బేబీ కడుపులోని నీటిలో తేలియాడుతూ వుంటుంది. ఈ అదనపు నీరు అంతా ఎక్కడికో అక్కడికి పోవాలి కనుక అది శరీరం కిందిభాగమైన కాళ్ళలోకి చేరిపోతుంది. పొట్ట పెరుగుతూంటే, దిగువ భాగం శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తసరఫరా నిమ్మదిస్తుంది. గర్భిణీకి మూడవ త్రైమాసికంలో కాళ్ళు, చేతులు వాపురావటం అధికంగా వుండి అసౌకర్యాన్ని కలుగజేస్తుంది. ఈ అసౌకర్యాన్ని తొలగించుకోవడానికి కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిని పరిశీలించండి...

తరచూ కదులుతుండాలి: మీరు ఎప్పటికీ కదలకుండా అధికంగా రెస్ట్ తీసుకోవడం వల్ల కూడా శరీరం వాపుకు గురిఅవుతుంది. అదే పనిగా కదలకుండా కూర్చొని పనిచేయడం వల్ల వాపుకు కారణం అవుతుంది. కాబట్టి మీరు ఉద్యోగస్తులైనా లేదా ఇంట్లో వారైనా సరే పనిచేసే సమయంలో మద్యమద్యలో కొంత విరామం తీసుకొని ఇటు అటు నడవడం మంచిది. అదే విధంగా మీ డాక్టర్ సిఫారస్సు మేరకు చిన్న పాటి వ్యాయామాలు కూడా చేయవచ్చు.

సోకింగ్(నీటిలో నానడం లేదా నానబెట్టుకోవడం): నీటిలో శరీరాన్ని కొద్దిసేపు నానేలా చేయడం వల్ల శరీరం కొంత తేలిక పడుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో వాపులను నివారించడానికి స్విమ్మింగ్ ను ప్రయత్నించవచ్చు. ఇది సాధ్యం కానప్పుడు, మీరు బాత్ టబ్స్ లో కొంత సమయం గడపడం ద్వారా కొంత సహాపడుతుంది. కానీ, బాత్ టబ్ లో అయినా, స్విమ్మింగ్ పూల్లో అయినా నీరు మరీ వేడిగా గా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. గర్బిణీ స్త్రీలకు వేడిగా ఉన్ననీరు ప్రమాదకరం.

కాళ్ళు ఎత్తులో పెట్టుకోవాలి లేదా నిఠారుగా ఉంచుకోవాలి: కాళ్ళను ఎత్తులో పెట్టుకోవాలి: ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల కాళ్ళు వాపులు అవ్వడం చాలా సహజం. ఒకే చోట కూర్చోవడం వల్ల శరీరంలో బ్లడ్ షర్యులేషన్ సరిగా జరగక కాళ్ళ వాపులకు రావచ్చు. కాబట్టి, కాళ్ళను ఎపుడు పైకి పెట్టగలిగితే, వాపులను నివారించవచ్చు. కాళ్ళను చిన్న స్టూల్ మీద నిఠారుగా చాపి కూర్చోవడం ఉత్తమం. పనిలో కష్టమే. కాని పరిస్ధితి అటువంటిది. కాళ్ళు పైకి పెట్టేందుకై చిన్నపాటి ఎత్తున్న బల్ల లేదా స్టూలు వుంచుకోండి. అధిక రక్తం కాళ్ళవైపుకు రాకుండా వుంటుంది.

ఎడమవైపు తిరిగి పడుకోవాలి: గర్భిణీ స్త్రీలు, ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వల్ల బ్లడ్ సర్యులేషన్ బాగా జరుగుతుంది. కాబట్టి చాలా వరకూ మీరు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడానికి ప్రయత్నించండి.

ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి: కాళ్ళ వాపులు తగ్గాలంటే, ఆహార పరంగా పొటాషియం అధికంగాను, సోడియం తక్కువగాను వున్న పదార్ధాలు తినాలి. పదార్ధాలలో ఉప్పు బాగా తగ్గించండి. ఉప్పుకు నీటిని నిలువ చేసే గుణం వుంది. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం కూడా మంచిదే. దిగువ శరీరంలోని ప్రధాన రక్త నాళాలు లావెక్కిన మీ శరీరానికి కొంత సౌఖ్యాన్నిస్తాయి.

తగినన్ని నీళ్ళు త్రాగాలి: రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగాలి. కొంతమంది మహిళలకు వాపులు కాళ్ళు పాదాలకు మాత్రయే పరిమితం కావు. చేతులు మొహం కూడా వాచి లావుగా ,బరువుగా అవుతాయి. అటుంవంటివారు వేంటనే డాక్టరు ను సంప్రదించాలి.
పైన చెప్పిన చిట్కాలు గర్భధారణ సమయంలో వాపు నయం చేయడానికి సహాయంచేయవచ్చు. సో, మీరు గర్భధారణ సమయంలో వాపు నుండి ఉపశమనం పొందేందుకు ఏమి చేస్తారు?



Click it and Unblock the Notifications
