Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
గర్భధారణ సమయంలో చేయకూడని కొన్ని ప్రమాదకర చర్యలు...!
గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం చాలా సర్వసాధరణం. ఈ మార్పులు ప్రతి మహిళ శరీరంలోనూ ఏర్పడుతాయి. గర్భధారణ సమయంలో మహిళలకు సాధారణ జీవితాన్ని గడపాలని సూచిస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో ప్రమాదకర కార్యకలాపాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి గర్భధారణ సమయంలో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండటం ఉత్తమైన మార్గం. దాని తర్వాత అన్నీ..ఎందుకంటే గర్భధారణ అనేది 9నెలలు మాత్రమే కాబట్టి ఆ 9నెలలు మహిళలకు చాలా విలువైన సమయంగా భావించాలి.
గర్భధారణ సమయంలో ఎటువంటి కార్యకలాపాలు ప్రమాదకరమైనవో మీకు తెలిసుండకపోవచ్చు. కానీ మనకు తెలసిన కొన్ని కార్యకలాపాలు మాత్రం న్యూట్రీషియన్ ఫుడ్ అధికంగా తీసుకోవాలి. దూరప్రయాణాలు చేయకూడదు. దగ్గర ప్రయాణాలైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు అధిక బరువులు మోయకూడదు మొదలగునవి....కాబట్టీ మీ గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉండటానికి చాలా చాలా లౌకిక విషయాలను తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ఉదా: మీకు రాక్ బ్యాండ్ యొక్క సంగీతానికి హాజరు కావడం అనేది గర్భధారణ సమయంలో ప్రమాదకర కార్యకలాపంగా చెప్పవచ్చు.
గర్భధారణ సమయంలో అధికంగా వ్యాయామం చేయడంతో హార్ట్ బీట్ పెరుగుతుంది మరియు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా పెంచుతుంది. గర్భధారణ సమయంలో ఉదర భాగంలో వ్యాక్సింగ్ చేయించుకోవడం కూడా మంచిది కాదు. ఇటువంటి కొన్ని చిన్న విషయాలు మీ గర్భధారణ సమయంలో సురక్షితమా కాదా అని గుర్తించేందుకు మరికొన్ని మీకోసం బోల్డ్ స్కై అందిస్తుంది. ఈ రిస్కీ యాక్టివిటీస్ కు గర్భాధారణ సమయంలో దూరంగా ఉండీ ఆరోగ్యాన్ని సురక్షితం చేసుకోండి...

ఎత్తు చెప్పులను ధరించడం: గర్భధారణ సమయంలో హై హీల్స్ ను ధరించడానికి లేదు. గర్భధారణ సమయంలో ఇవి చాలా అసౌకర్యానికి గురిచేస్తాయి. హీల్స్ వేయడం వల్ల మీ శరీర బరువు మీ పాదాలా మీద మోపినట్లు అవుతుంది. దాంతో వెన్ను నొప్పికి దారితీస్తుంది. కాబట్టి గర్భధారణ సమయంలో ఎత్తు చెప్పలను వాడకపోవడమే సురక్షితం.

ఫర్నీచర్ ను మార్చకూడదు: సాధారణంగా ఇంట్లో వస్తువులు ఫర్నీచర్ ను ఇక్కడి అక్కడ..అక్కడవి ఇక్కడ మార్చుతుంటారు. అయితే మీ గర్భధారణ మొదటి సెమిస్టర్(మొదటి మూడు నెలల్లో) ఇటువంటి రీస్కీ యాక్టివిటీస్ ను నివారించడం చాలా క్షేమం. ఇది మీ మీద ఒత్తిడిని పెంచుతుంది.

పిల్లలను మోయడం: మీ రెండవ ప్రెగ్నెన్సీ కంటే ముందు మీకు పిల్లలను చూసుకోవల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి, వారు 5కేజీల బరువు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అతనిని/ఆమెను ఎత్తుకోవడం నివారించడం. లేదంటే మీ వెన్నుకు ఒత్తిడి కలిగించవచ్చు.

స్కేటింగ్: వ్యాయామంలో చాలా మంది రోలర్ స్కేటింగ్ ను ఉపయోగిస్తారు. అయితే మహిళలు గర్భధరించినప్పుడు, ఈ రోలర్ స్కేటింగ్ వ్యాయామాన్ని మానుకోండి. రోలర్ స్కేటింగ్ చేయడానికి మంచి బ్యాలెన్సింగ్ ఉండాలి.

స్టీమ్ బాత్: గర్భధారణ సమయంలో స్టీమ్ బాత్ చేయడం అనేది చెడు ఆలోచన. ఎప్పుడైతే మీ శరీరం వేడి పొందుతుందో, అప్పుడు మీ చర్మని బ్లెడ్ సెల్స్ రీడైరెక్ట్ గావింపబడి మీ చర్మాన్ని చల్లబరుస్తుంది. అలా చేయడం వల్ల కడుపులో పెరగుతున్న శిశువుకు అదనపు రక్తప్రవాహం కోల్పోతుంది.

కఠనమైన వ్యాయామాలు: గర్భధారణ సమయంలో కఠిన వ్యాయామాలు చేయడం వల్ల హార్ట్ రేటు పెరుగుతుంది. దాంతో గర్భస్థమావికి(placenta)కు రక్త సరఫరా తగ్గిపోతుంది మరియు దాని వల్ల రక్తపోటు పెరిగే అవకాశం కూడా ఉంది.

రక్తదానం: గర్భధారణ సమయంలో రక్తదానం చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోవచ్చు. అయితే రక్తం దానం చేయడం వల్ల రక్తంలోని ఐరన్ ను కోల్పోవలసి వస్తుంది. కాబట్టి గర్భణీ స్త్రీలకు రక్తదానాన్ని ఇవ్వడాన్ని నివారించబడింది.

అమ్యూజ్మెంట్ పార్క్స్ వెళ్ళండి: మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకోవడానికి అమ్మూజ్మెంట్ పార్క్ కు వెళ్ళవచ్చు. కానీ అక్కడి సవారీలు వేటిని ప్రయత్నించి ఆనందించడానికి సాధ్యం కాదు. ముఖ్యంగా రోలర్ కోస్టెర్ సవారీలు, సాహస కార్లు మొదలగునవి..గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరంగా ఉంటాయి.

గుర్రపు స్వారికి వెళ్ళడం: గుర్రపు స్వారీ స్థిరంగా ఉండదు. ఎగుడుదిగుడు స్వభావంగా ఉండటం చేత గర్భిణీ స్త్రీలుకు ఇది అసమర్థచేస్తుంది. ఫలితంగా placentaకు అంతరాయం కలిగి గర్భస్రావం వంటి ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది.

రాక్ సంగీతనానికి హాజర్ కావడం: ఎప్పుడైతే మీరు సంగీత విభాగాలకు వెళ్ళుతే అక్కడ ఎక్కువ జనంతో గుంపులు గుంపులుగా ఉండటం వల్ల చాలా కఠిన వాతావరణం కలిగి ఉంటుంది. అటువంటి ప్రదేశంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరికీ మీరు గర్భిణీ అని తెలుపలేరు కాదా. అక్కడ తోపులాటలతో కూడా మీకు అసౌకర్యం కలగవచ్చు. మరియు 22వారాలు కలిగిన మీ శిశువు బిగ్గరా శబ్ధాలు వినడం కూడా మంచిది కాదు.

ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధులు: ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధులు మీ కుటుంబ సభ్యుల ద్వారా లేదా ఆఫీస్ లో పనిచేసే సహచరుల నుండి కూడా రావచ్చు. కాబట్టి ఎవరికైనా చికెన్ పాక్స్, డేంగ్యూ లేదా ఇతర వైరల్ వ్యాధులు ఉన్నట్లైతే వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించడండి.



Click it and Unblock the Notifications