For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీలలో సంతానలేమికి ప్రాధానకారణం పీసీఓడీ..లక్షణాలు

|

స్త్రీలలో సంతానలేమికి చాలా కారణాలుంటాయి. అందులో ఒకటి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ 20 శాతం మంది మహిళల్లో కనిపించే సమస్య. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల రక్తంలోకి అధికంగా ఇన్సులిన్ విడుదలవుతుంది. ఫలితంగా సిస్ట్‌లు ఏర్పడుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. కొందరిలో ఆండ్రోజన్స్ విడుదల కూడా ఎక్కువగా ఉంటుంది.

పురుషుల్లో మాత్రమే ఉండే ఈ హార్మోన్ కొన్ని సార్లు స్త్రీలలో కూడా కనిపిస్తుంది. అండాలు సక్రమంగా తయారుకావడానికి, రుతుక్షికమం సరిగ్గా రావడానికి కూడా హార్మోన్లు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడినపుడు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌కు దారి తీస్తుంది. ప్రతి రుతుక్షికమంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అండాలు విడుదలవుతుంటాయి. కానీ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న వారిలో అండాలు సంపూర్ణంగా తయారుకావు. అండాశయం నుంచి విడుదల కావు. ఇది సంతానలేమికి దారితీస్తుంది. ఇది సాధారణంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలలో కనిపిస్తుంది. ఈ పాలిసిస్టిక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే...

Signs You Have Polycystic Ovaries

1. రుతుక్రమ సమస్యలు: రుతుక్రమం ప్రారంభమయిన కొద్దిరోజుల్లోనే లక్షణాలు బయట పడగతాయి. కొందరిలో మాత్రం చాలా కాలం తర్వాత కనిపిస్తాయి. వ్యక్తిని, శరీరతత్వాన్ని బట్టి ఇది మారుతుంది. నెలానెలా సమయానికి రుతుక్రమం రావడమనేది అండాశయం, పిట్యూటరీ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ల పై ఆధారపడి ఉంటుంది. పునరుత్పత్తి క్రమం ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడినపుడు రుతుక్రమం ఆలస్యమవుతుంది. లేదా ఆగిపోతుంది. సంతాన లేమి సమస్య మొదలవుతుంది.
2. మొటిమలు: మేల్ హార్మోన్స్ (ఆన్డ్రోజన్)వల్ల అధికంగా మొటిమలు రావడానికి కారణం అవుతుంది. పాలీసిస్టిక్ ఓవరీ ఉన్నదనడానికి ఇది ఒక క్లియర్ ఇండికేషన్. శరీరంలోని హార్మోనుల అసమతుల్యత వల్ల చర్మంలో ఆయిల్ గ్రంథులు ఎక్కువ ఆయిల్ ను ఉత్పత్తి చేసి, మొటిమలకు దారితీస్తుంది.
3. అతి రోమత్వము: హార్మోనుల అసతుల్యత వల్ల శరీరంలో మరియు ముఖం మీద అధికంగా అవాంఛిత రోమాలు ఏర్పడుతాయి. పాలిసిస్టిక్ ఓవరీ వల్ల స్త్రీలలో స్త్రీ హార్మోనుల కంటే మేల్ సెక్స్ హార్మోన్స్ ఎక్కువగా అభివ్రుద్ది చెందుతాయి. అందువల్లే అవాంఛిత రోమాలకు దారితీస్తుంది.
4. పురుషుడు నమూనా బోడి: పాలిసిస్టిక్ ఓవరీతో బాధపడే స్త్రీలలో జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. అపక్రమ రుతుక్రమంతో పాటు బట్టతల ఏర్పడుతుంది. పాలిసిస్టిక్ ఓవెరీ ఉందనడానికి ఇది చాలా ఖచ్చితమైన లక్షణంగా భావిస్తారు.
5. సడన్ గా బరువు పెరగడం: ఉన్నపలంగా బరువు పెరగడం అనేది పాలిసిస్టిక్ యొక్క లక్షణాలలో ఒకటి. చాలా తక్కువ సమయంలో మీరు బరువు పెరగడం గమనించినట్లైతే, వెంటనే మీరు మెడికల్ అడ్వైజలు తీసుకోవడం చాలా అవసరం.
6. వాయిస్ మార్పులు: మాట, గొంతులో మార్పు. ముఖ్యంగా హార్మోనుల ప్రభావం వల్ల మీ మగవారిలాగా డీప్ వాయిస్ తో మాట్లాడుతారు. దీనికి ప్రధానకారణం మీలో మేల్ హార్మోన్స్ వ్రుద్దికావడమే. దాంతో హార్మోనుల అసమతుల్యత కూడా కారణం కావచ్చు.
7. డిప్రెషన్ : మన మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి హార్మోనులు ప్రధానపాత్రను పోషిస్తాయి. కాబట్టి మూడ్ స్వింగ్స్ మరియు డిప్రెషన్ వంటివి పిసిఓఎస్ కు అనుసంధానించబడి ఉంటాయని ఇవి హార్మోనులు అసమతుల్యత వల్ల ఏర్పడుతాయి కనుగొనడం జరిగింది. మీలో బాధ, అలసట, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ కూడా పాలిసిస్టిక్ ఓవరీకి ప్రధాన లక్షణాలు.
8. స్కిన్ పిగ్మెంటేషన్: చర్మ రంగులో మార్పు . మీ మెడ వెనుక లేదా మెడ చుట్టూ డార్క్ నెస్ ఏర్పడటం. పాలిసిస్టిక్ ఓవరీకి ఉందనడానికి అవకాశాలెక్కువ.
9. సెకండరీ రుతుక్రమ లేమి: సెంకడరీ అమినోరియా రుతుక్రమంలో మార్పులను సూచిస్తుంది. ఇది కూడా హార్మోనుల అసమతుల్యతతో అనుసందానించబడి ఉంటుంది. ఇది కూడా పాలిసిస్టిక్ ఓవరీకి లక్షణాలలో ఒకటి..

English summary

Signs You Have Polycystic Ovaries

Polycystic ovarian syndrome (PCOS) is one of the most common and frequent female endocrine diseases of the reproductive age. It is also known by the name Stein-Leventhal syndrome. Earlier the disease was called polycystic ovarian disease, which is later corrected as polycystic ovarian syndrome.
Desktop Bottom Promotion