Latest Updates
-
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం?
పిల్లలు కలగకపోవడానికి ఇవే ప్రధాన కారణాలా?
వంధ్యత్వం అంటే మౌలికంగా గర్భం దరించ లేక పోవడమే. వంధ్యత్వం అంటే ధరించిన గర్భాన్ని పూర్తిగా చివరి దాకా మోయలేక పోవడమే. వంధ్యత్వం అంటే ఒక ఏడాది ప్రయత్నం తరువాత కూడా గర్భం దరించ లేక పోవడం. లేదా స్త్రీలు 35 ఏళ్ళకు పైబడ్డ వారైతే ఆరు నెలలు. గర్భం ధరించి కూడా చివరి దాకా నిలవక పోవడం కూడా వంధ్యత్వం క్రిందికే వస్తుంది.
వంధ్యత్వం అంటే ప్రతి సారీ స్త్రీ సంబంధమైన సమస్యే కాదు. స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ వంధ్యత్వాన్ని కలిగించే కారణాలు ఉండవచ్చు. వంధ్యత్వం కేసుల్లో మూడో వంతు స్త్రీ సమస్యల వల్లనే. మరో వంతు పురుషుల వల్ల. మిగతావి ఇద్దరికీ సంబంధించిన సంయుక్త సమస్యలు లేక అంతుపట్టని సమస్యలు.
వంధ్యత్వం గురించి తెలుసుకోవలసిన కొన్ని వాస్తవాలు ఇవిగో :

మీమీ వత్తిడిని జయించండి :
వత్తిడిని అధిగమించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అది మీ గర్భధారణ అవకాశాలను మెరుగు పరుస్తుంది. మీరు గర్భం ధరించాలని అనుకుంటుంటే ఇది చాలా ముఖ్యం. వత్తిడిని దూరంగా వుంచండి, కుటుంబంతోనో స్నేహితుల తోనో సమయం గడపండి. పుస్తకాలు చదవండి, మీ పనుల ప్రాధమ్యాలను తెలుసుకోండి.

వంధ్యత్వం
స్త్రీ వంధ్యత్వం అర్ధం చేసుకోవడానికి, చికిత్సకు తేలిక, ఎందుకంటే చాలా సందర్భాల్లో సమస్య తెలిసే వుంటుంది.

మీ పోషణ లోపాలను పరిష్కరించుకోండి :
మీరు ఏమి తినడం లేదో చూసుకుని, మీరు ఏమి తింటున్నారో శ్రద్ధ వహించండి. గర్భ ధారణకు పనికి వచ్చే అత్యుత్తమ ఆహారాలు ఏవో తెలుసుకోండి. మీ భోజనంలో ఏమి మానేయాలో మీ వైద్యుడిని అడిగి తెలుసుకోండి. సంతానోత్పత్తి అవకాశాలు పెరగాలంటే మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

నాళాల వ్యాధులు :
15-18% వంధ్యత్వం కేసులు నాళాల వ్యాధుల వల్లనే వస్తాయి, అంటే మీ ఫాలోపియన్ నాళాలు మూసుకు పోయాయన్నమాట. అందువల్ల దానికి సంబంధించిన కొన్ని పరీక్షలు మీరు చేయించుకోవాలి.

వంధ్యత్వంలో వయసు పాత్ర కూడా వుంది :
వంధ్యత్వానికి, వయసుకు ప్రత్యేకమైన, ప్రత్యక్షమైన సంబంధం వుంది. శరీర ధృడత్వం, రోగనిరోధక శక్తి, హార్మోన్ల స్థాయి యుక్త వయసులో వున్నప్పుడు చాలా ఎక్కువగా వుంటాయి, కాబట్టి ఈ అంశాన్ని కూడా దృష్టి లో వుంచుకోవాలి. వయసు మళ్లే కొద్దీ శక్తి సామర్ధ్యాలు తగ్గిపోతూ వస్తాయి. అందువల్ల వంధ్యత్వానికి సంబంధించిన చికిత్స ఎప్పుడూ చిన్న వయసులోనే మొదలు పెట్టాలి.

బాగా నిద్ర పొండి :
మంచి నిద్ర లేకపోవడానికి వంధ్యత్వానికి సంబంధం వుందని తెలియ చేసే కొన్ని పరిశోధనలు వున్నాయి. అందువల్ల మీరు తరచుగా పార్టీలకు వెళ్ళే వారైతే ఈ విషయం గురించి తెలుసుకోవాలి. రాత్రి పూట ఎక్కువ సేపు మెలకువగా వుంటే హార్మోన్ స్థాయిల్లో చాలా మార్పులు వచ్చి వంధ్యత్వానికి అవకాశాలు పెరుగుతాయి. సరిపడా నిద్ర లేకుండా ఎక్కువ కాలం వుండే వారికి వంధ్యత్వం తో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తారు. ఇది శరీరంలోని హార్మోన్ల స్థాయిని ప్రభావితం చేస్తుంది, ఇదే వంధ్యత్వానికి ప్రధాన కారణం.

స్త్రీలలో వంధ్యత్వానికి రోగ నిర్ధారణ, చికిత్స :
ఈ మొత్తం ప్రక్రియలో వంధ్యత్వానికి మూల కారణం ఏమిటో నిర్ధారించి సరైన చికిత్స ఏమిటో కనుక్కోవడమే పెద్ద మలుపు, దీంట్లోనే వివిధ రకాల కేసులు చూసిన అనుభవం వున్న వారి నైపుణ్యం పెద్ద పాత్ర పోషిస్తుంది.

నిపుణులు
నిపుణులు సాధారణంగా తీసివేత పద్ధతిలో వెళ్తారు. మొదటి దశలో అసలు అండోత్పత్తి సాధారణంగా ఉందా లేక అసలు లేదా అనేది నిర్ధారిస్తారు. ఓవులేషన్ కిట్ వాడి, శరీర ఉష్ణోగ్రతను, ప్రోజేస్టిరాన్ స్థాయిని పరీక్షి౦చి ఇది తెలుసుకుంటారు. తరువాత చాలా సార్లు అల్ట్రా సౌండ్ పరీక్షలు కూడా చేస్తారు.

మగవారిలో వంధ్యత్వానికి రోగనిర్ధారణ, చికిత్స :
మగవారిలో వంధ్యత్వం కనుక్కోవడం, చికిత్స చేయడం రెండూ చాలా క్లిష్టమైనవే. వీర్య నమూనాలు లాబొరేటరీ లో పరీక్షించి వాటి సంఖ్యా, బలం, ఇతర అంశాలు తెలుసుకుంటారు. హార్మోన్ స్థాయిలను పరీక్షించి టేస్టోస్టిరాన్ స్థాయిలు కనుక్కుంటారు. మర్మావయవాల నిర్మాణంలో లోపాలు, ఎస్ టి డి లేదా వి డి, పూర్వ స్ఖలనం లాంటి భౌతిక అంశాలు కూడా పరీక్షిస్తారు. ఇక్కడే మనం గర్భధారణను విజయవంతం చేసి, చిన్ని ప్రాణాన్ని ఈ ప్రపంచం లోకి తెచ్చే అన్ని ప్రయత్నాలు చేస్తాం.

బంధాలు బలహీనం అవడం :
దంపతులు ఇద్దరి మధ్యా బంధం బలహీనం అయితే వంధ్యత్వాన్ని పరిష్కరించడం మరింత కష్టతరం అవుతుంది. భాగస్వాములు ఇద్దరూ చక్కటి అనుబంధాలు కలిగి అంతర్గత కలహాలు లేకుండా వుండాలి. ఇది శారీరికంగా, మానసికంగా, ఉద్వేగాల పరంగా ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాల్సిన సమయం. మగవారికైతే ఈ బాధ్యత మరింత పెరుగుతుంది, ఎందుకంటే స్త్రీలు చాలా శారీరిక బాధను అనుభవించాల్సి వుంటుంది. చికిత్సా ప్రక్రియలో చాలా సార్లు స్త్రీలు ఐ వి ఎఫ్ గర్భం ధరించాలి, చాలా పరీక్షలు చేయించుకోవాలి, దీని వల్ల వారి మీద చాలా ఒత్తిడి వుంటుంది.

అర్ధం కాని వంధ్యత్వం
అర్ధం కాని వంధ్యత్వం గా పిలువబడే (వంధ్యత్వానికి కారణం తెలియకపోయినా, నిర్ధారించలేక పోయినా) పరిస్థితి దీంట్లో వున్న ప్రతివారికి చాల బాధాకరంగా వుంటుంది. దురదృష్ట వశాత్తూ చాలా సాధారణమైన ఈ పరిస్థితి కొన్ని సార్లు చికిత్సకు ప్రతిబంధకంగా మారవచ్చు. వంధ్యత్వ చికిత్స కోసం క్లినిక్ లకు వెళ్ళే దంపతులలో 10% మందికి అర్ధం కాని వంధ్యత్వంగా నిర్ధారణ జరుగుతుంది. మరే ఇతర వ్యాధి లాగానే వంధ్యత్వాన్ని కూడా తగ్గించుకోవచ్చని గుర్తుంచుకోండి, ఆరోగ్యంగా వుండండి, వంధ్యత్వాన్ని ఎదుర్కొగలుగుతారు.



Click it and Unblock the Notifications











