For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాధారణ సమయంలో వేవిళ్ళు..వికారానికి చెక్ చెప్పండిలా

|

గర్భిణీ స్త్రీలకు వికారం మరియు వాంతులు సర్వ సాధారణం. మహిళలు గర్భందాల్చిన సమయంలో ఎక్కువగా బాధించే సమస్య వేవిళ్ళు. ఈ వేవిళ్ళ వల్ల కొందరు బాగా నీరసపడిపోతారు. నోటికి రుచికరంగా ఉండే ఆహారం తీసుకున్నప్పటికీ.. అవి వెంటనే వాంతుల రూపంలో బయటకు రావడం జరుగుతుంది. ఈ వేవిళ్లు కొందరిలో తక్కువగా ఉంటే మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఆస్పత్రుల్లో కూడా చేరాల్సి ఉంటుంది. కొందరికి గర్భం ధరించనప్పటి నుండి ప్రసవం అయ్యేంత వరకూ ఈ వేవిళ్ళు బాధిస్తుంటాయి. అయితే, ఈ తరహా ఇబ్బందులు ప్రతి గర్భిణిలోనూ ఉండవని వైద్యులు అంటున్నారు.

సాధారణంగా గర్భిణీ స్త్రీలకు కలిగే వేవిళ్లు రెండు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది సాధారణ వాంతులు, రెండవది తీవ్రమైన వాంతులు అని పిలుస్తారు. సాధారణ వేవిళ్ళనే మార్నింగ్ సిక్‌ నెస్ అని కూడా పిలుస్తుంటారు. మార్నింగ్ సిక్ నెస్ కు డాక్టర్ ను సంప్రదించడం పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. అయితే రెండోరకం వాంతులు మాత్రం కొద్దిగా ప్రమాదకరమైనవే. ఈ వాంతుల లక్షణాలను పరిశీలిస్తే...

Vomiting During Pregnancy: Home Remedies

మార్నింగ్ సిక్‌ నెస్‌లో పేరుకు తగ్గట్టుగానే ఉదయం లేచిన వెంటనే కడుపులో వికారం, అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాంతి కూడా అవుతుంది. ఉదయమే కాకుండా మిగిలిన వేళల్లో కూడా వాంతులవుతాయి. ఈ వాంతులు పసరు కలిగి ఉంటాయి. ఈ వాంతుల వల్ల ఆరోగ్యమేమీ చెడిపోదు. సుమారు మూడు నెలల పాటు ఈ వాంతుల వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. తర్వాత నెమ్మదిగా తగ్గుముఖంపడతాయి. రెండో రకం అంతే తీవ్రమైన వాంతులలో ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింటుందట. సుమారు వెయ్యి మందిలో ఒకరు ఈ విధంగా బాధపడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వాంతులవుతున్నప్పుడు కొన్నిసార్లు విరేచనాలు కూడా అవుతుంటాయట. కడుపులో నొప్పి, నీరసంగా ఉండడంతో పాటు జ్ఞాపకశక్తి తగ్గిపోవటం అరికాళ్ళు, అరిచేతులలో సూదులు గుచ్చినట్లు ఉండటం వంటివి ఈ రకం వేవిళ్ల లక్షణం.

వేవిళ్ళు ఎందుకు వస్తాయి? గర్భం ధరించినపుడు ఆమెలో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వస్తాయి. హెచ్ సిజి అనే హార్మోన్ ఈ వికారం కలిగిస్తుంది. దీనిని హ్యూమన్ గొనడోట్రోపిన్ హార్మోన్ అని పిలుస్తారు. ఇది రిలీజ్ అయితే వికారం కలుగుతుంది. అండాశయం ఈస్ట్రోజన్ విడుదల చేస్తుంది. ప్రొజెస్టిరోన్ హార్మోన్ గర్భవతిలో గర్భాశయంలోని కండరాల సడలింపుకు సహకరిస్తుంది. ఇది బేబీ ఎదురుదల మరియు పుటుకలకు తేలికగా వుంటుంది. అదే సమయంలో ఆమె పొట్ట మరియు పేగులను కూడా రిలాక్స్ చేసి అధిక జీర్ణ ఆమ్ల రసాలను ఉత్పత్తి చేసి గుండె మంట వంటివి కలిగిస్తుంది. ప్లాసెంటా ద్వారా ఎనర్జీ పోయినపుడు లో బ్లడ్ షుగర్ స్ధాయి అంటే హైపోగ్లైసీమియా ఏర్పడుతుంది. ఇది కూడా ఆమెలో వికారం కలిగిస్తుంది.

మరి వికారం, వేవిళ్ళు నుండి కొంత ఉపశమనం పొందడానికి నిమ్మకాయ వాసన చూడటం, చింతపండు తినడం, సూప్స్ తాగడం వంటివి చేస్తుంటారు. వీటితో పాటు కొన్ని వంటింటి చిట్కాలు ఈ వేవిళ్ళను తగ్గిస్తుంది.. మరి అవేంటో చూద్దాం...

1. ఎండిన నిమ్మతొక్క పొడి: నిమ్మకాయను కట్ చేసి తక్కువ మంటమీద కాల్చాలి. తర్వాత ఎండలో బాగా ఎండబెట్టాలి. ఈ ఎండిన నిమ్మచెక్కను మెత్తని పేస్ట్ లా చేసి, ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి. వేవిళ్ళు, వికారం అనిపించినప్పుడు వేడినీటిలో కలుపుకొని త్రాగాలి.

2. అల్లం: వేవిళ్ళను అడ్డుకోవడంలో అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం వాసనతో కడుపు వికారం, వేవిళ్లు తగ్గిపోవచ్చు. చాలా మంది గర్భిణీలు అల్లంను ముక్కలుగా కోసి పొట్టి తీసి వాసన చూస్తుంటారు. దాంతో వేవిళ్ళను, వికారాన్ని అండ్డుకోవచ్చు. అల్లం టీ త్రాగడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది.

3. నిమ్మరసం: ఇది చాలా ప్రసిద్ది చెందిన వంటింటి చిట్కాల్లో ఒకటి. ఇది చాలా ప్రభావితం చేసే హోం రెమడీ. ఒక గ్లాసు నిమ్మరసం త్రాగడం వల్ల గర్భాధారణ సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేవిళ్ళనుండి ఉపశమనం పొందవచ్చు. ఎప్పుడైతే వేవిళ్ళు కలిగే ఫీలింగ్ మొదలవుతుందో అప్పుడే ఈ నిమ్మజ్యూస్ ను తాగవచ్చు. దాంతో ఆ వికారాన్ని తగ్గిస్తుంది. మంచి ఫలితాల కోసం గోరువెచ్చని నీటితో నిమ్మరసాన్ని తాగాలి.

4. అజ్వైన్: అబ్వైన్ లేదా కారం సీడ్స్ నమలడం వల్ల వేవిళ్ళు వికారం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మార్నింగ్ సిక్ నెస్ ను పోగొడుతుంది

5. హెర్బల్ టీ: మరో ఇండియన్ హోం రెమడీ ఒక కప్పు హెర్బల్ టీ తాగడం వల్ల గర్భణీ స్త్రీ వాంతులు, వికారం నుండి తక్షణ ఉపశమనం పొందుతుంది. చాలా రకాల హెర్బల్ టీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏ ఒక్క హేర్బల్ టీ తీసుకొన్నా సరే వికారాన్ని వేవిళ్ళను అడ్డుకుంటుంది.

6. పుదీనా: వాంతులు వికారంతో ఇబ్బంది పడేవారు పుదీనా పచ్చడి తినడం వలన ఆ వికారం తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలకు ఇది ఎంతో మంచిది. పుదీనా ఆకుల రసం ముక్కులో పిండితే అపస్మారకం నుండి రోగికి తెలివి వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు

7. ధనియాలు: ఒక కప్పు ధనియాల కషాయంలో ఒక చెంచా కలకండ పొడిని కలుపుకోండి. ఇందులో ఒక కప్పు బియ్యం కడిగిన నీటిని కలుపుకుని సేవించండి. దీంతో వాంతులు, డోకులాంటివి తగ్గి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

English summary

Vomiting During Pregnancy: Home Remedies | గర్భాధారణ సమయంలో వేవిళ్ళను అడ్డుకొనే చిట్కాలు..


 Nausea and vomiting are common problems of a pregnant woman. Even after avoiding food and drinks that can make a pregnant woman feel pukish. The morning sickness and nausea keeps on affecting the day to day happenings of a pregnant woman.
Story first published: Wednesday, January 23, 2013, 15:12 [IST]
Desktop Bottom Promotion