For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మొదటి బిడ్డతో మీ రెండో గర్భాన్ని ఎలా పంచుకోవాలి ?

By Super
|

మీరు ప్రపంచంలోకి మరో బిడ్డను తీసుకురావాలని ఆలోచిస్తున్నారా? గర్భ సమాచారాన్ని పంచుకోనడానికి సరైన సమయం ఎప్పుడో అనేది అధిక ప్రసంగం! కొత్తగా వచ్చే చిన్న పిల్ల ఇతర కుటుంబీకులను ఎంతగా ప్రభావితం చేస్తుందో ఆశ్చర్యంగా ఉంటుంది? మీ కొత్త బేబీ మీ మొదటి బేబీ పై ఎంత ప్రభావం చూపిస్తుందో జాగ్రత్త వహించాలి? అవును, ఆమె మరో బేబీ కావాలి అనుకున్నపుడు తనకు తానే మనసులో ఆలోచించవలసిన కొన్ని న్యాయమైన, సరైన ప్రశ్నలు.

రెండవ బిడ్డ కోసం ఎదురుచూసే తల్లి, మీ మొదటి బిడ్డకు కొత్తగా రాబోయే బిడ్డ పుట్టుక గురించి నిజమైన, సున్నితమైన పద్ధతిలో తెలియచేయడం అవసరం. మొదటి బిడ్డ కుటుంబంలో, తల్లితండ్రుల హృదయంలో తన స్థానం బలహీన పడుతుందేమోనని భావిస్తాడు. అలా అనుకోవడం సహజ౦. తనతో గడిపే సమయాన్ని కొత్త బేబీ తీసేసుకుంటుందని అతను భావిస్తాడు.

దీని గురించి మీ మొదటి బిడ్డకు ముందే తెలియచేయడం మంచిది. దీనివల్ల తరువాత జరిగే బాధాకరమైన సంఘటనలను నివారించవచ్చు. రాబోయే పరిస్థితులను గురించి ఆ బిడ్డకు వివరించండి. మీకుగనక ఆ విషయాలను ఎలా తెలియ చేయాలో, ఎలా మొదలు పెట్టి పరిస్థితిని అర్ధం చేసుకునేట్టు చేయాలో తెలియకపోతే నేనుమీకు కొన్ని అందుబాటులో ఉండే చిట్కాలు చెప్తాను.

 How to Share Your Second Pregnancy with Your First Child

చేయవలసిన పనులు

కొత్తగా పుట్టిన తోబుట్టువును పసిపిల్లలకు ఇవ్వండి. ముద్దుపెట్టుకుని, బంధ౦గా చేయండి.

అలాగే మీ మొదటి బిడ్డకోసం సమయాన్ని కేటాయించండి. పుట్టిన బేబీ గాడనిద్రలో ఉన్నపుడు, పూర్తి సమయాన్ని మొదటి బిడ్డతో గడపండి.

చేయకూడని పనులు

మీరు మీ 2 వ బెబీతో ఇంట్లోకి ప్రవేశించినపుడు మొదటి పిల్లాడిని నిర్లక్ష్యం చేయకండి.

కొత్త బిడ్డ గురించి అతిగా చురుకును ప్రదర్శించకండి.

సలహాలు

మీరు గర్భందాల్చిన మొదటి నుండి అందుకు సంబంధించిన అన్ని విషయాలలో మీ వాడిని భాగస్వామిని చేయండి. బుడిబుడి అడుగులు వేసే మీ చిన్నారికి, తనకు ఒక తమ్ముడు/చెల్లెలు తయారవుతుందని చెప్పండి.

మీరు డాక్టరు దగ్గరికి వెళ్ళేటపుడు మీ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళండి. మీ పొట్టలోని బిడ్డ గుండె కొట్టుకోవడాన్ని అతనికి వినిపించండి. మీ డాక్టర్ చురుకైన వాడైతే, మీ పొట్టలో ఏం జరుగుతుందో అతనికి వివరించమనండి.

ఈ సమయం నుండి ఈ సమయం వరకు నువ్వు అమ్మ, నాన్న లతో ఆడుకోవచ్చని పిల్లాడికి చెప్పడం అవసరం. ఒక బొమ్మ సహాయంతో, ఎలా పాలు పట్టాలో, బేబీ డైపర్లను ఎలా మార్చాలో వాడికి చూపించాలి.

కొత్తగా పుట్టిన బేబీని చూసుకోవడానికి తనకు చేతనైన సహాయం చేయమని మొదటి పిల్లవాడికి చెప్పాలి.

మీరు హాస్పిటల్ లో ఉండడానికి మీ సంచీ సర్దుకోవడంలో మీ మొదటి పిల్లవాడిని పల్గోననీయండి. బేబీ పుట్టిన తరువాత, ఇతర కుటుంబ సభ్యులకు కొత్త బేబీని పరిచయం చేసేలా తయారుచేయండి. అంతేకాకుండా, కొత్తగా పుట్టిన బేబీకి ఒక పేరు నిర్ణయించామని కూడా చెప్పండి.

English summary

How to Share Your Second Pregnancy with Your First Child


 Thinking about bringing another baby of yours into this world? Inquisitive! When is the right time to share pregnancy news? Wondering how the arrival of this new little member will impact other family members? Concerned about how the new addition will affect your first baby? Yes, these are some of the legitimate and obvious questions that cross mothers’ mind while preparing herself for another child of hers.
Story first published: Thursday, May 15, 2014, 15:33 [IST]
Desktop Bottom Promotion