Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే!
గర్భధారణ సమయంలో దంతాలు, చిగుళ్ళ సమస్యలను నివారించే హోం రెమెడీస్
గర్భధారణ సమయంలో మహిళ సంతోషంగా గడపాల్సిన సమయం. అయితే అనుకోకుండా కొన్ని అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి.గర్భిణీలో వచ్చే అనారోగ్య సమస్యల్లో దంతసమస్యలు ఒకటి. చిగుళ్ళు, లేద దంత సమస్యలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. హార్మోనులు మార్పుల వల్ల దంతాలు సెన్సిటివ్ గా మారుతాయి. దాంతో దంత సమస్యలు ఏర్పడుతాయి.
గర్భధారణ సమయంలో దంతాలు, చిగుళ్ళ నొప్పులు బాధిస్తుంటే, ఇవి గర్భధారణ ప్రారంభదశలో చాలా కష్టంగా ఉంటుంది.
దంతాల్లో రక్తస్రావం అవ్వడానికి కారణం: ప్రెగ్నెన్సీ హార్మోనులు చిగుళ్ల మీద ప్రభావం చూపుతాయి. అదే విధంగా శరీరంలోని ఇతర కణాల మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇది టెండర్ నెస్, దంతాలు, చిగుళ్లలో వాపు , నోట్లో కణతులు మరికొన్ని కారణాల వల్ల ఇలా జరగుతుంది: గర్భధారణ సమయం ప్రోజెస్టరాన్ హార్మోన్స్ ఎక్కువగా శ్రవించడం, షుగర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, క్యాల్షియం లోపం వల్ల చిగుళ్లు టెండర్నెస్ గా మారుతాయి.దంతాలను శుభ్రం చేసుకున్నాప్పుడు రక్తస్రావం జరుగుతుంది. స్వీట్స్, స్ట్రార్చ్ ఫుడ్స్ తినడం తగ్గించాలి. క్యాల్షియం లోపం , క్యావిటి, నోట్లో రంద్రాలు, సైన్ బ్లాక్ అవ్వడం ఇవన్నీ దంత సమస్యలకు కారణమవుతుంది.

వెజిటేబుల్స్ ఫ్రూట్స్:
గర్భిణీ రెగ్యులర్ డైట్ లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్ ప్రొడక్ట్స్ మరియు డైరీ ప్రొడక్ట్స్, చీజ్ మిల్క్ వంటివి ఎక్కువగా చేర్చుకోవాలి. ఇవి తల్లి, బిడ్డకు క్షేమం.

నీళ్ళు సరిపడా తాగాలి:
రోజుకు రెండు మూడు లీటర్ల నీళ్ళు తప్పనిసరిగా తాగాలి, హాట్ అండ్ హుమిడిటి వాతావరణంలో నివసించే వారు సోడ మరియు కెఫిన్ డ్రింక్స్ తగ్గించాలి.

చాక్లెట్స్ మానేయాలి:
చాక్లెట్స్, ఇతర షుగర్ ఫుడ్ స్నాక్స్ ను తినడంతగ్గించాలి. ఇది దంతక్షయాన్ని పెంచతుంది.

బ్రషింగ్:
రోజుకు రెండు మూడు సార్లు బ్రష్ చేయడం మంచిది. బ్రషింగ్ కోసం సాఫ్ట్ బ్రెష్ ను ఎంపిక చేసుకోవాలి. బ్రష్ చేయడం వల్ల దంతాల మద్య పాచి, ఆహారస్పటికలను తొలగిస్తుంది. మంచి క్వాలిటీ టూత్ పేస్ట్ ను ఉపయోగించాలి.

విటమిన్ సి మరియు క్యాల్షియం ఫుడ్స్:
రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి .

ఘన పదార్థాలకు దూరంగా ఉండాలి:
గట్టిగా ఉండే ఆహారాలను దంతాలతో నమలడం, దంతాలను బాటిల్ ఓపెనర్స్ గా ఉపయోగించడం చేయకూడదు. ఇలా చేస్తే దాంతాలకు చిగుళ్ళకు హాని జరగుతుంది.

చూయింగ్ గమ్:
రెగ్యులర్ గా చూయింగ్ గమ్ నమిలే వారిలో దంతాలు ఫ్రాక్యర్ అవుతాయి. చాలా చల్లగా ఉండే కేఫినేటెడ్ పానియాలకు దూరంగా ఉండాలి. ఇవి దంతాల యొక్క సెన్సిటివిటీని తగ్గించేస్తాయి.

స్మోకింగ్ మానేయాలి:
దంతాలు, చిగుళ్ళకు హానికలిగించడం మాత్రమే కాదు, ఇది పుట్టబోయే బిడ్డకు ప్రమాదం,

రోజూ పాచి తొలగించాలి:
దంతా మద్య ఉన్న ప్యాచిని రెగ్యులర్ గా తొలగించాలి . అయితే దాన్ని తొలగించుకోవడానికి సరైన పద్దతిని ఎంపిక చేసుకోవాలి.

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది దాంతాలు, చిగుళ్ళ సమస్యను నివారిస్తుంది. ఫీనోఫినాల్స్ గ్రీన్ టీలో ఉండే పాచి ఏర్పడకుండా చేస్తుంది. దంత క్షయం ఏర్పడకుండా నివారిస్తుంది.

ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ ను సలాడ్స్ తో తీసుకోవచ్చు.దంతాలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. పాచి ఏర్పడకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎముకలు స్ట్రాగ్ చేస్తుంది, దంత సమస్యలను దూరం చేస్తుంది.

తేనె:
ఇది నేచురల్ రెమెడీ, స్వీట్ గా కూడా ఉంటుంది, ఇందులో యాంటీబ్యాక్టీరియల్ లక్షనాలు, న్యూట్రీషియన్స్, విటమిన్ మరియు మినిరల్స్ ఎక్కువ, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా మెయింటైన్ చేయడానికి ఇవి సహాయపడుతాయి.

క్లోవ్ ఆయిల్:
లవంగం నూనె, ఇది మరో యాంటీసెప్టిక్ నేచురల్ రెమెడీ.దంత సమస్యలను దంతక్షయాన్ని నివారిస్తుంది. లంగాలను నోట్లో వేసుకుని నమలడం లేదా లవంగం నూనెను చిగుళ్లకు దంతాలకు మర్ధన చేయడం మంచిది. ఇది మరో ఆల్టర్ నేటివ్ డెంటల్ మెడిసిన్. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అలోవెర:
అలోవెరలో నయం చేసే గుణాలు, యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ. ఇది క్యావిటిని తగ్గిస్తాయి, ఇన్ఫ్లమేషన్ , బ్లీడింగ్ మరియు దంతాల వాపులను తగ్గిస్తాయి. దాంతో దంత సమస్యలను నివారిస్తాయి.

ట్రిఫల:
మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఓరల్ బ్యాక్టీరియాను తొలగించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతంది. దీన్ని కొద్దిగా వాటర్ లో మిక్స్ చేసి గార్గిలింగ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడ:
దంత, చిగుళ్ళ సమస్యను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది, పేస్ట్ కు కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి బ్రెష్ చేయాలి. తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి.
గర్భధారణ సమయంలో మహిళ సంతోషంగా గడపాల్సిన సమయం. అయితే అనుకోకుండా కొన్ని అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి.గర్భిణీలో వచ్చే అనారోగ్య సమస్యల్లో దంతసమస్యలు ఒకటి. చిగుళ్ళు, లేద దంత సమస్యలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. హార్మోనులు మార్పుల వల్ల దంతాలు సెన్సిటివ్ గా మారుతాయి. దాంతో దంత సమస్యలు ఏర్పడుతాయి.



Click it and Unblock the Notifications