For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు తీసుకోవల్సిన 5 హెల్తీ ఫ్రూట్ జ్యూస్ లు...!

|

తల్లి కాబోయే మహిళలు పుట్టబోయే తమ బిడ్డకు మంచి పోషకాహారాన్నందించాలి. ప్రతి రోజూ ఒక గ్లాసెడు పండ్ల రసం తాగితే అది మీరు ఆహారంలో తీసుకోవాల్సిన విలువలన్ని ఇస్తుంది. చెడు ఫలితాలు ఏమీ లేని విటమిన్లు, మినరల్స్ అన్నీ అందుతాయి. గర్భవతిగా వున్నపుడు తీసుకోవాల్సిన వెజిటబుల్స్, పండ్ల రసాలు మొదలైనవి పరిశీలిద్దాం!

సాధ్యమైనంతవరకు ఎరువులు, పురుగుమందులు వేయకుండా వున్న ఆహార పదార్ధాలను, విషపూరిత పదార్ధాలున్న ఆహారాలను వదలండి. టాక్సిక్ ఆహారాలు బేబీ ఎదుగుదలను, మెమొరీని అరికడతాయి. తాజా పండ్లు, కూరగాయల రసాలు తాగండి. కడుపులోని బిడ్డకు పోషక విలువలు కల ఆహారం అందుతుంది. వైద్యుని సలహాపై కొన్ని విటమిన్లు కూడా వాడవచ్చు. టీ లేదా కాఫీ తాగే వారైతే, వీటికి బదులు పండ్ల రసాన్ని తాగండి. శరీరానికి అవసరమైన నీరు లభించటమే కాక పోషకాలు కూడా అందుతాయి.

ఆరోగ్యకరమైన, పోషక విలువలు కల ఈ పండ్ల రసాలు గర్భవతి తాగితే ఆమెకు కావలసిన విటమిన్లు, కడుపులోని బిడ్డ ఎదుగుదలకు కావలసిన పోషకాలు లభిస్తాయి. గర్భవతి షుమారు 9 నెలలపాటు శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తన బిడ్డను కనాలి. అందుకుగాను ఆమెకు ఆ దశలో మేలు చేసే ఆహారాలు ఇవ్వటం ఎంతో ప్రధానంగా గుర్తించి కుటుంబ సభ్యులు ఆహారం పట్ల శ్రధ్ధ వహించాలి.

గర్భిణీ తీసుకొనే పోషకహారాల్లో జ్యూసులు ముఖ్యమైనవి. ఇవి తల్లిబిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంతే కాదు, ఒక గ్లాసు హెల్తీ జ్యూస్ తీసుకోవడం వల్ల రోజులో ఉత్సాహంగా, పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగి ఉంటారు . ఫ్రెష్ హోం మేడ్ జ్యూసులు తాగడం వల్ల చర్మంలో గ్లో పెరుగుతుంది. ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందుతారు. అయితే గర్భిణీలు ఎలాంటి జ్యూసులు తాగాలో తెలియకపోతే ఈ క్రింద కొన్ని హెల్తీ జ్యూస్ లను లిస్ట్ అవుట్ చేసి అందివ్వడం జరిగింది మరి అవేంటో తెలుసుకుందాం..

 ఆపిల్ జ్యూస్:

ఆపిల్ జ్యూస్:

గర్భిణీ స్త్రీలు ఒక గ్లాసు ఆపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల తప్పనిసరిగా రిఫ్రెష్ అవుతారు. గర్భధారణ కాలం 9నెలలు ఆరోగ్యంగా గడుస్తుంది. మరి దీన్ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం..

రెండు మూడు ఆపిల్స్ తీసుకుని, తొక్క తీసి, ముక్కలుగా కట్ చేసి, కొద్దిగా నీటిలో వేసి ఉడికించాలి.

తర్వాత ఉడికిన ముక్కలను చల్లార్చి , మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి, అందులోనే కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా వాటర్, అవసరమయితే పంచదార లేదా తేనె మిక్స్ చేయాలి.

మొత్తం మిశ్రమం కలిపి, ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. తర్వాత చల్లగా సర్వ్ చేయాలి.

జామకాయ జ్యూస్:

జామకాయ జ్యూస్:

గర్భిణీలు జామకాయ జ్యూస్ తాగడంవల్ల మలబద్దకం అజీర్తి వంటి సమస్యలను నివారిస్తుంది. ఫ్రెష్ గా జామకాయ జ్యూస్ ను తయారుచేయడానికి 2 జామపండ్లు, 2 చెంచాల పంచదార, నిమ్మరసం కొద్దిగా, మరియు కొద్దిగా అల్లం అవసరమవుతుంది.

తయారీ: జామకాయను ముక్కలుగా కట్ చేసి, నీటిలో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

జామకాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.

అందులోనే అల్లం రసం, నిమ్మరసం, పంచదార వేసి మిక్స్ చేయాలి.

అవసరమయితే ఐస్ క్యూబ్స్ వేసి ఫ్రెష్ గా తాగవచ్చు. లేదా ఫ్రిజ్ పెట్టి చల్లగా అయిన తర్వాత తాగొచ్చు.

 గ్రేప్ జ్యూస్:

గ్రేప్ జ్యూస్:

గ్రేప్ జ్యూస్ తాగడానికి కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఈ జ్యూస్ ను గర్భిణీలు తప్పనిసరిగా తాగాలి. మరియు గ్రేప్ జ్యూస్ ను ఫర్ఫెక్ట్ గా ఎలా తయారుచేయాలో చూద్దాం..

తయారీ: 500గ్రాముల ద్రాక్షపళ్ళు తీసుకుని , మెత్తగా చేయాలి.

తర్వాత వీటిని బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేయాలి.

తర్వాత గ్లాసులో పోసి, ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి. . తర్వాత కొద్దిగా నిమ్మరసం జోడించి చల్లగా సర్వ్ చేయాలి.

 బీట్ రూట్ జ్యూస్:

బీట్ రూట్ జ్యూస్:

బీట్ రూట్ జ్యూస్ గర్భిణికి మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తం ఏర్పరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియా తగ్గిస్తుంది. ఈ జ్యూస్ తయారీకి కావల్సినవి 4 క్యారెట్స్, 2 బీట్స్, 1 ఆపిల్ .

తయారీ: ఈ మూడింటికి తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

తర్వాత వీటిని బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేసి, జ్యూస్ తియ్యాలి.

తర్వాత ఇందులో ఐ క్యూబ్స్ వేసి , ఫ్రెష్ గా సర్వ్ చేయాలి. ఈ జ్యూస్ ను వారంలో రెండు మూడు సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిది.

బనానా మరియు హనీ జ్యూస్:

బనానా మరియు హనీ జ్యూస్:

గర్భణీ తీసుకునే మరో బెస్ట్ ఫ్రూట్ జ్యూస్ బనానా జ్యూస్! బనానా, పెరుగు, మరియు తేనె కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. రుచి చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. ఇది ఫర్ఫెక్ట్ ఆఫ్టర్ నూన్ డ్రింక్ . ఈ జ్యూస్ తయారీకి కావల్సినవి: ఒక కప్పు పాలు, ఒక కప్పు పెరుగు, ఒక అరటి పండు, మరియు తేనె

తయారీ: ఈ మూడు పదార్థాలను బ్లెండర్లో వేసి , మెత్తగా బ్లెండ్ చేయాలి. స్మూత్ గా తయారు చేయాలి.

ఇందులో ఐస్ క్యూబ్స్ వేసి గ్లాస్ లో పోసి చల్లగా తాగాలి.

ఈ జ్యూస్ రుచికరంగా మాత్రమే కాదు అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది.

English summary

5 Healthy Fruit Juices To Take During Pregnancy

Pregnancy is not just about adding 300 extra calories and doing some yoga or exercise on a regular basis. Most people say that you should eat healthy. But have you ever wondered as to what are the most essential items that should be a part of your diet? If you don’t know, then this article is perfect for you.
Story first published: Thursday, July 7, 2016, 16:58 [IST]
Desktop Bottom Promotion