For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ టైంలో వేధించే వికారానికి చెక్ పెట్టే హెల్తీ డ్రింక్స్ !

By Swathi
|

ప్రెగ్నెన్సీ చాలా ఆనందాన్ని ఇచ్చినప్పటికీ.. రోజులు గడిచేకొద్దీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వికారం, వాంతులు, ఆందోళన, ఒత్తిడి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. తలతిరగడం, కడుపులో ఇబ్బందిగా ఉండటం, వాంతులు వచ్చినట్టు ఉండటం, ఏదీ తినాలనిపించకపోవడం వంటి రకరకాల సమస్యలు కనిపిస్తాయి. ఇవన్నీ చాలా సాధారణం. కానీ.. వాటిని ఎదుర్కొనేలా మహిళలు తమ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి.

వయసు పెరుగుతున్నా.. హైట్ పెరగని పిల్లలకు ఇవ్వాల్సిన డైట్..! వయసు పెరుగుతున్నా.. హైట్ పెరగని పిల్లలకు ఇవ్వాల్సిన డైట్..!

ప్రెగ్నెన్సీ సమయంలో అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆహారపు అలవాట్లు, డ్రింకింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ లో మార్పులు తీసుకురావాలి. గర్భధారణ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలని నిపుణులు సూచిస్తారు. అయితే ఖాళీ కడుపుతో నీళ్లు తాగాలంటే.. వికారం అనిపిస్తుంది. కాబట్టి ప్రతి సారీ నీళ్లు తాగడం కంటే.. నీళ్ల రూపంలో హెల్త్ డ్రింక్స్ తీసుకోవడం సురక్షితం.

గర్భిణీలు స్ట్రెయిట్ గా పడుకుంటే ఏమవుతుంది ? గర్భిణీలు స్ట్రెయిట్ గా పడుకుంటే ఏమవుతుంది ?

అలా ఇతర హెల్త్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల.. అన్ని సందర్భాల్లో వికారం, వాంతులు అనిపించదు. అలాగే వాంతులు, వికారం కలిగించకుండా ఉండటానికి కూడా ఈ డ్రింక్స్ సహాయపడతాయి. ఏదైనా వాసన రాగానే వెంటనే వాంతులు అవుతున్నాయా ? అలాంటి వాళ్లు కూడా ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్ గా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల వాంతులు, వికారం నివారించవచ్చో చూద్దాం..

లెమన్ వాటర్

లెమన్ వాటర్

తాజాదనాన్నిచ్చే నిమ్మ వికారం, వాంతుల ఫీలింగ్ తగ్గిస్తుంది. ఒక నిమ్మకాయ రసాన్ని నీటిలో కలిపి.. కొద్ది కొద్దిగా తాగండి. ఇది మీకు వికారం నుంచి ఉపశనం కలిగిస్తుంది.

స్మూతీస్

స్మూతీస్

కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీలు ఆహారం తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు పోషకాలతో నిండిన, ఎనర్జిటిక్ స్మూతీలను తయారు చేసుకుని తీసుకోండి. ఫేవరేట్ ఫ్రూట్ స్మూతీ తాగితే.. మంచి ఫలితం ఉంటుంది.

అల్లం వాటర్

అల్లం వాటర్

అల్లంలో ఉండే పోషకాలు, రుచి వికారం, వాంతుల ఫీలింగ్ నుంచి రిలాక్సేషన్ అందిస్తాయి. అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసి.. నీటిలో కలపండి. కొన్ని పుదీనా ఆకులు జతచేసి.. తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. దీన్ని చల్లగా తాగితే బావుంటుంది కాబట్టి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత తీసుకోండి.

వెజిటబుల్ జ్యూస్

వెజిటబుల్ జ్యూస్

ప్రెగ్నెన్సీ టైంలో వికారంతో బాధపడేవాళ్లకు ఇది బెస్ట్ డ్రింక్. ఒక వెజిటబుల్ తీసుకోవడం ఇష్టంలేకపోతే.. రెండుమూడు తీసుకుని.. జ్యూస్ తయారు చేసుకుని తాగండి. దీనివల్ల పోషకాలతో పాటు, వికారం, వాంతుల సమస్య కూడా తగ్గుతుంది.

హెర్బల్ టీ

హెర్బల్ టీ

మార్నింగ్ సిక్ నెస్ నుంచి ఇది ఖచ్చితంగా ఉపశమనం కలిగిస్తుంది. రోజుకి 2 నుంచి 3 కప్పుల అల్లం టీ తీసుకోవచ్చు. ఇది వికారం సమస్యను నివారిస్తుంది.

మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్

మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్

చాలామంది మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో పాల వాసన పడదు. కానీ పాలు తాగడం చాలా అవసరం. అలాంటప్పుడు మీకు ఇష్టమైన ఫ్రూట్ కి, పాలు మిక్స్ చేసి.. యమ్మీ జ్యూస్ తయారు చేసుకుని తాగితే హెల్తీ.

మజ్జిగ

మజ్జిగ

మజ్జిగ కేవలం వికారం, వాంతులను మాత్రమే నివారించదు. ఇది కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. త్వరగా, తేలికగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది. ఈ అమేజింగ్ డ్రింక్ ని కంపల్సరీ మీ డైట్ లో చేర్చుకోవాలి.

లెమనేడ్

లెమనేడ్

ప్లెయిన్ లెమన్ వాటర్ కొద్దిగా పుల్లగా, వగరుగా అనిపించవచ్చు. కాబట్టి లెమనేడ్ ప్రిపేర్ చేసుకోండి. కొద్దిగా పంచదార, సాల్ట్, నిమ్మరసం కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. కొన్ని పుదీనా ఆకులు కలుపుకుని.. తాగడం వల్ల వికారం, వాంతుల సమస్య నుంచి బయటపడవచ్చు.

కొబ్బరినీళ్లు

కొబ్బరినీళ్లు

గర్భధారణ సమయంలో వికారం, వాంతులు నివారించడంలో కొబ్బరినీళ్లు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కొన్ని కొబ్బరినీళ్లు కేవలం వాంతులు, వికారాన్ని మాత్రమే కాదు.. బీపీని కంట్రోల్ ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

English summary

9 Best Drinks For Nausea During Pregnancy

9 Best Drinks For Nausea During Pregnancy. So, go through these best drinks for pregnant women and share the information with your other pregnant friends as well.
Story first published: Wednesday, June 1, 2016, 15:09 [IST]
Desktop Bottom Promotion