Latest Updates
-
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు!
గర్భిణీ స్త్రీ జామకాయ తినడం పొందే గొప్ప ప్రయోజనాలు..!!
గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారాలల్లో అత్యంత ముఖ్యమైనవి పండ్లు. గర్భిణీలు స్త్రీలు తనగలిగిన పండ్లలో జామకాయాలు కూడా ఒకటి. జామకాయాలో అనేక ప్రయోజనాలున్నాయి. సాధారణ వ్యక్తులకు మాత్రమే కాదు, గర్భిణీలకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది.
గర్భిణీలు జామకాయ తినడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జామకాయలో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ ఎ లు గర్భిణీలకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. అంతే కాదు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. ఇంకా జామకాయలో విటమిన్ బి3 మరియు బి6లు కూడా పుష్కలంగా ఉన్నాయి .ఇవి మతిమరుపును నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.
ఏదేమైనా , గర్భిణీస్త్రీలు ఏలాంటి పండ్లు తినాలనుకున్నా, ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే పండ్లలో చాలా వరకూ గర్భిణీలకు హానీ కలిగించే పండ్లు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా సిట్రస్ పండ్లలో నిమ్మ. అలాగే బొప్పాయి, పైనాపిల్ వంటివాటికి గర్భిణీలు దూరంగా ఉండాలి.
అయితే జామకాయను నిరభ్యరంతరంగా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. గర్భాధారణ సమయంలో గర్భిణీలు జామకాయ తినడం వల్ల ఎక్కువ లాభాలు పొందుతారు. ఎందుకంటే జామకాయలో ఫాలీఫినాల్స్, ఐరన్, క్యాల్షియం, థైమిన్, పొటాషియం, మెగ్నీషియం, మరియు ఫాస్పరస్ లు అత్యధికంగా ఉన్నాయి.
జామకాయ తొక్కను తినడంవల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది . మలబద్దక సమస్యలను నివారిస్తుంది. గర్భధారణ సమయంలో ఏ పండ్లు తిన్నా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఏవైనా సరే మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి . గర్భిణీలు జామ కాయను తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

వ్యాధినిరోధకత పెంచుతుంది:
జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్లడ్ ప్రెసర్ కంట్రోల్లో ఉంచుతుంది:
గర్భధారణ సమయంలో హైబ్లడ్ ప్రెజర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజూ జామకాయ తినడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది.

బేబీలో నాడీవ్యవస్థస్ట్రాంగ్ గా ఉంటుంది:
జామకాయలో ఉండే ఫోలిక్ యాసిడ్ బేబీ బ్రెయిన్ మరియు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది .

మనస్సును విశ్రాంతి పరుస్తుంది:
ప్రతి రోజూ జామకాయను తినడం వల్ల నాడీవ్యవస్థను స్మూత్ చేస్తుంది . మరియు ఒత్తిడి తగ్గిస్తుంది.

మలబద్దకం నివారిస్తుంది:
జామకాయలో ఫౌబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బ్లడ్ షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది.
గర్భధారణలో సాధారణంగా వచ్చే సమస్య జస్టేషనల్ డయాబెటిస్ . కాబట్టి రోజుకొక్క జామపండు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు మరియు డయాబెటిస్ ను నివారించుకోవచ్చు.

కంటి చూపును మెరుగుపరుస్తుంది:
జామకాయలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. బిడ్డలో కంటి సమస్యలకు లేకుండా ఆరోగ్యంగా ఏర్పడుటకు సహాయపడుతుంది.

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:
జామకాయలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. జామకాయలో ఉండే లికోపిన్ మరియు విటమిన్ సి శరీరంలోని టాక్సిన్స్ ను నివారిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
రెగ్యులర్ డైట్ లో జామకాయ చేర్చుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
