Latest Updates
-
చెట్టినాడ్ శనగ కుర్మా..చపాతీతో తింటుంటే కిక్కే కిక్కు! -
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా.. -
రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు! -
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి -
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.!
ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా కొబ్బరి ఎందుకు తినాలి ?
కొబ్బరిని ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు, పచ్చి కొబ్బరి ఇలా ఏ రకంగా తీసుకున్నా.. గర్భధారణ సమయంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. 9 నెలల గర్భధారణ సమయమంతా.. కొబ్బరిని తీసుకోవడం సేఫ్ అండ్ హెల్తీ.
ప్రెగ్నెన్సీ సమయంలో కావాల్సిన న్యూట్రియంట్స్ కొబ్బరిలో ఎక్కువగా ఉంటాయి. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. కొబ్బరినూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల అవి బేబీ డెవలప్ మెంట్ కి, ఎదుగుదలకు ఉపయోగపడతాయి. కొబ్బరిలో ల్యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తల్లిలో పాల ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే జాయింట్ పెయిన్స్ ని నివారిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే విటమిన్ ఈ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి గర్భధారణ సమయంలో ఖచ్చితంగా కొబ్బరి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెన్సీకి సంబంధించిన అలసట, అనారోగ్య సమస్యలకు కూడా కొబ్బరి చెక్ పెడుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా కొబ్బరి తినాలి అనడానికి రకరకాల కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మార్నింగ్ సిక్ నెస్
గర్భధారణ సమయంలో ఎక్కువగా ఇబ్బందిపెట్టే వాంతులు, వాంతుల ఫీలింగ్ ను కొబ్బరిలో ఉండే కొబ్బరినూనెతగ్గిస్తుంది. అలాగే ఎసిడిటీ, హార్ట్ బర్న్ ను తగ్గిస్తుంది. ఉదయాన్నే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ నుంచి బయటపడవచ్చు. లేదా కొబ్బరినీళ్లు, కొబ్బరిపాలు తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

స్ట్రెచ్ మార్క్స్, పొట్టపై దురద
గర్భధారణ సమయంలో.. పొట్టపై ఇబ్బందిపెట్టే దురద, స్ట్రెచ్ మార్క్స్ ని కొబ్బరి నూనె రాయడం వల్ల తగ్గించవచ్చు. అలాగే కొబ్బరినూనె మాయిశ్చరైజ్ చేసి, చర్మానికి పోషణను అందిస్తుంది.

బ్రెస్ట్ మిల్క్
గర్భధారణ సమయంలో రెగ్యులర్ గా కొబ్బరి తీసుకోవడం వల్ల మంచి పోషకవిలువలు అందుతాయి. దీనివల్ల బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి అవుతాయి. అంతేకాదు కొబ్బరినూనెలో ఉండే ల్యూరిక్ యాసిడ్ బ్రెస్ట్ మిల్క్ ఏర్పడటానికి సహాయపడుతుంది.

రక్త ప్రసరణకు
ప్రెగ్నెన్సీ సమయంలో 50 శాతం రక్తం పెరిగి పాదాలు, కాళ్లలో వాపుకి కారణమవుతుంది. రక్తప్రసరణ తక్కువగా జరిగితే.. ఇలాంటి వాపులకు కారణమవుతుంది. కొబ్బరి తినడం వల్ల రక్తప్రసరణ పెరిగి వాపులను తగ్గిస్తుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్
కొబ్బరినీళ్లు తాగడం వల్ల యూరిన్ ఎక్కువగా వెళ్తారు. దీంతో బ్యాక్టీరియా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ద్వారా బయటకు పోతాయి. కొబ్బరి తినడంతోపాటు కొబ్బరినీళ్లు ఖచ్చితంగా తాగాలి.

అనీమియా
గర్భధారణ సమయంలో కొబ్బరిపాలు తీసుకోవడం వల్ల అనీమియా తగ్గుతుంది. ఐరన్ రిచ్ డైట్ తీసుకోకపోవడం వల్ల గర్భిణీ స్త్రీల్లో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి.. కొబ్బరి పాటు తీసుకుంటే.. ఐరన్ అందుతుంది.

కాన్స్టిపేషన్
కొబ్బరినీళ్లతో పాటు, కొబ్బరి తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో వేధించే మలబద్ధకం నివారించవచ్చు. కొబ్బరి వల్ల గర్బిణీ స్త్రీలు పొందే అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఇది.



Click it and Unblock the Notifications