For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో తల్లి బ్రెయిన్ లో మార్పులు వస్తాయా..?

మీరు గర్భధారణ సమయంలో చాలా భౌతిక మరియు మానసిక మార్పులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే, గర్భధారణ సమయంలో తల్లి యొక్క మెదడులో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది.

By Lekhaka
|

మీరు గర్భధారణ సమయంలో చాలా భౌతిక మరియు మానసిక మార్పులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే, గర్భధారణ సమయంలో తల్లి యొక్క మెదడులో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది.

గర్భిణీ స్త్రీలలో బరువు పెరుగుట, హిప్ మరియు కడుపు ప్రాంతాల విస్తరణ, అవాంఛిత జుట్టు అభివృద్ధి,పాదాల వాపులు వంటి అనేక భౌతిక మార్పులను గమనిస్తూ ఉంటాం.

అలాగే గర్భిణీ స్త్రీ యొక్క శరీరంలో సంభవించే వివిధ హార్మోన్ల అసమతౌల్యం కారణంగా మానసిక కల్లోలం, నిరాశ వంటి కొన్ని మానసిక మార్పులు కూడా సంభవిస్తాయి.

Can Pregnancy Lead To Changes In The Mother's Brain

గర్భధారణ మరియు మెదడులో మార్పులు

కాబట్టి గర్భధారణ సమయంలో మరియు గర్భం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కూడా శరీరంలో సంభవించే కొన్ని మార్పుల గురించి తెలుసుకోవటం ముఖ్యం. ఎందుకంటే ఇది ఆరోగ్య సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది.

ఇటీవల, ఒక ప్రముఖ పరిశోధనా అధ్యయనంలో ఒక గర్భవతి యొక్క మెదడు లో నిర్దిష్ట లేదా దీర్ఘకాల మార్పులు ఉండవచ్చని తెలిసింది. ఇది నిజమా? అనే విషయాన్నీ ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

Can Pregnancy Lead To Changes In The Mother's Brain

గర్భధారణ మరియు న్యూమరాలజి మార్పుల మధ్య లింక్

గర్భధారణ సమయంలో మహిళ యొక్క శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. వాటి ప్రభావం ఆమె శరీరం మరియు 9 నెలల శిశువు పోషణ మీద పడుతుంది.

హార్మోన్లు మెదడు లో ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో కొన్ని విధులను నిర్వర్తించడానికి వివిధ భాగాలకు చేరతాయి.

గర్భధారణ సమయంలో అవసరమైన కొన్ని హార్మోన్లను మెదడు ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్స్ గర్భవతి అయిన మహిళపై ప్రతికూలంగా చూపితే నిర్దిష్ట లేదా దీర్ఘకాల మార్పులు సంభవిస్తాయి.

Can Pregnancy Lead To Changes In The Mother's Brain

అలాగే, పరిశోధన అధ్యయనంలో గర్భవతి యొక్క మెదడు లో సంభవించే ఈ నరాల మార్పులు కొన్ని మంచి ప్రవర్తనకు దారి తీయవచ్చని తెలిపారు.

గర్భిణీ స్త్రీ యొక్క మెదడులో సంభవించే నరాల మార్పులు ఆమె మానసికంగా మంచి మార్గంలో ఉండటానికి మరియు ఆమె పిల్లల పట్ల శ్రద్ధ వహించడానికి సహాయపడతాయి. అలాగే తల్లిని రక్షిత మరియు కేరింగ్ ప్రవృత్తులు ఉండేలా సిద్ధం చేస్తాయి.

గర్భధారణ సమయంలో మెదడు నరాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, గర్భవతి మహిళ తీవ్ర మానసిక కల్లోలం వంటి అసాధారణ లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే, అప్పుడు ఆమెను పరీక్షించాలి.

English summary

Can Pregnancy Lead To Changes In The Mother's Brain?

If you are a woman who is going through pregnancy, you would be experiencing a lot of physical and emotional changes, right? However, is it possible for certain changes in the brain of the mother to occur during pregnancy?
Story first published:Sunday, January 8, 2017, 12:50 [IST]
Desktop Bottom Promotion