Just In
- 26 min ago హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- 2 hrs ago వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- 2 hrs ago Horoscope on Indian Elections : ఈ ఎన్నికల్లో ఎవరికి రాజయోగం.. ఎవరికి ఓటమి..?
- 3 hrs ago బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
ఫ్యాక్ట్స్ : మీ సెమెన్(వీర్యం) ఆరోగ్యకరంగా ఉందా?తెలుసుకోవడం ఎలా..?
మీకు పిల్లల ప్రణాళిక ఉన్నప్పుడు సహజంగా మీ పునరుత్పత్తి ఆరోగ్యం మీద మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అన్ని చక్కగా ఉంటె కనుక మీ భాగస్వామి గర్భవతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మీకు పిల్లల ప్రణాళిక ఉన్నప్పుడు సహజంగా మీ పునరుత్పత్తి ఆరోగ్యం మీద మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అన్ని చక్కగా ఉంటె కనుక మీ భాగస్వామి గర్భవతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ మొత్తం ప్రక్రియలో వీర్యకణాల సంఖ్య మరియు చలనము ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అలాగే, మీ వీర్యం నాణ్యత కూడా మీ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది.
కాబట్టి, ఇక్కడ ఒక వ్యక్తి యొక్క వీర్యం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవటానికి కొన్ని సాధారణ మార్గాలు ఉన్నాయి. మీరు మీ వీర్యంను కొన్ని అంశాలపై ఆధారపడి నిర్ధారించవలసిన అవసరం లేదు. మీరు ఒక వైద్యున్ని సంప్రదిస్తే మంచి రిపోర్ట్ ఇస్తారు.
ఫ్యాక్ట్ # 1
విస్తృత భుజాలు మరియు చతురస్రాకార దవడలు వంటి పురుష లక్షణాలు కలిగిన వారి కంటే యావరేజ్ పురుషులలో ఆరోగ్యకరమైన స్పెర్మ్ కలిగి ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఫ్యాక్ట్ # 2
కఠినమైన లోదుస్తులు ధరించటం వలన ప్రైవేట్స్ ఉష్ణోగ్రతలు పెరగడం మరియు ఊపిరాడకుండా ఉంటుంది. అందువల్ల సాధారణ లోదుస్తులు వేసుకొనే వారిలో ఆరోగ్యకరమైన వీర్యం ఉంటుంది.
ఫ్యాక్ట్ # 3
తమ దైనందిన జీవితాల్లో ప్లాస్టిక్ ఆహార పాత్రలు ఉపయోగించే పురుషులకు, ఉపయోగించని వారితో పోలిస్తే ఉపయోగించని వారిలో మంచి ప్రయోజనం కనిపించింది.
ఫ్యాక్ట్ # 4
మాంసం తినని వారితో పోలిస్తే సాల్మన్ మరియు ట్యూనా వంటి సముద్ర ఆహారం తినే వారిలో వీర్యం ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పుతున్నారు.
నిజం 5
వ్యాయామం చేయని వారితో పోలిస్తే ప్రతి రోజు గంట కంటే ఎక్కువ వ్యాయామం చేసే వారిలో వీర్యం ఆరోగ్యకరంగా ఉంటుంది.
ఫ్యాక్ట్ # 6
బొడ్డు కొవ్వుతో ఉన్న పురుషులతో పోలిస్తే ఫ్లాట్ పొట్ట ఉన్న పురుషుల్లో వీర్యం ఆరోగ్యంగా ఉంటుంది.
ఫ్యాక్ట్ # 7
చాలా లోతైన పురుష గాత్రం ఉన్నవారిలో వీర్యకణాలు ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే పురుష లక్షణాల కోసం టెస్టోస్టెరాన్ వాడకం ఎక్కువ కావటం వలన ఇటువంటి పరిస్థితి వస్తుంది.