గర్భదారణ సమయంలో డార్క్ స్కిన్ కు కారణం మరియు నివారించే మార్గం!

By: Mallikarjuna
Subscribe to Boldsky

మహిళ జీవితంలో గర్భధారణ అద్భుతమైన అనుభూతి. బిడ్డను కనగడం వెనుక అద్భుతమైన అనుభూతితో పాటు, సంతోషం కూడా ఉంటుంది. అది ఆమెకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే గర్భాధారణతో పాటు కొన్ని సమస్యలు కూడా వస్తాయి.

మహిళ గర్భం పొందిన తర్వాత శరీరంలో మార్పులు కనబడుతాయి. బరువు పెరుగుతారు, బెల్లీ పెద్దగా పెరుగుతుంది. మార్నింగ్ సిక్ నెస్ మొదలగు లక్షణాలు కనబడుతాయి. ఈ లక్షణాలన్నీ కూడా ఒక్కో మహిళలో ఒక్కో విధంగా ఉంటుంది.

శరీరంలో అంతర్గత సమస్యలతో పాటు, బహిర్గతంగా కూడా అనేక సమస్య ఎదురవుతాయి. ముఖ్యంగా చర్మంలో మార్పులు కనబడుతాయి. పొట్ట పెద్దగా పెరిగినప్పుడు ప్రసవం తర్వాత పొట్ట సాగినట్లు, పొట్ట చర్మంపై చారలు కనబడుతాయి. ముఖ్యంగా బిడ్డ పొట్టలో పెరిగేప్పుడు చర్మం సాగడం జరుగుతుంది. ఫలితంగా చర్మం పొడిబారడం, దురద, రాషెస్ వంటి లక్షణాలు కనబడుతాయి. కొంత మంది మహిళల్లో ఈ లక్షణాలతో పాటు చర్మ రంగులో కూడా మార్పు కనబడుతుంది.

Skin Darkening During Pregnancy And How It Is Caused

గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలు ఫేస్ మరియు బాడీ స్కిన్ లో డార్క్ కలర్ ప్యాచెస్ అనుభువం కలిగి ఉంటారు. ఈ పరిస్థితి మెల్స్మా లేదా క్లోసమా అంటారు. ఈ డార్క్ ప్యాచెస్ నే కొన్ని సందర్భాల్లో మాస్క్ ప్రెగ్నెన్సీగా సూచిస్తుంటారు. ఎందుకంటే, ముఖ నుదిటి భాగం, ముక్కు మరియు బొగ్గల మీద లో పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది.

ఈ పిగ్నెంటేషన్ అక్కడికి మాత్రమే పరిమితం కాకుండా, అండర్ ఆర్మ్ గడం, నిప్పల్స్ మరియు జెనిటల్ ఏరియాల్లో కూడా డార్క్ పిగ్మేటషన్ వస్తుంది. అందుకు ముఖ్య కారణం గర్భధారణ సమయంలో శరీరం నుండి ఎక్కువ మెలనోమా ఉత్పత్తి కావడమే.

కొంత మంది మహిళల్లో ఇతరలు కంటె ఎక్కువ పిగ్మేంటేషన్ కు గురి అవుతారు. ఎండలో ఎక్కువగా బహిర్గతం అవ్వడం వల్ల కూడా శరీరంలో మెలనిన్ ఉత్తత్పత్తి ఎక్కువ అవుతుంది. ఈ సమస్య తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. డెలివరీ తర్వాత తొలగిపోతుంది.

మెలస్మాన్ ను ట్రీట్ చేయడం ఎలా:

- ఈ పిగ్మెంటేషన్ తాత్కాలికం, ఎండలో తిరగడం వల్ల డార్క్ ప్యాచెస్ పెరుగుతాయి,. కాబట్టి, బయటకు తిరగాల్సి వస్తే గొడుగు పట్టుకెళ్ళడం, సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం చేయాలి.

- చర్మానికి కెమికల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం నివారించాలి. గర్భదారణ సమయంలో చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. అందువల్ల కెమికల్ ప్రొడక్ట్స్ అంత మంచిది కాదు.

గర్భిణీ స్త్రీలలో మెలస్మా సమస్య తక్కువగా ఉన్నాప్పుడు, అంత సమస్య కాకపోవచ్చు. కానీ కొంత మంది మహిళల్లో ఎక్కువగా ఉన్నవారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం కొన్ని ఆయుర్వేదిక రెమెడీలు ఉపయోగపడతాయి.

స్కిన్ పిగ్మేటేషన్ ను నివారించడానికి కొన్ని ఆయుర్వేదిక రెమెడీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

1) గ్రేప్ సీడ్ ఆయిల్ :

1) గ్రేప్ సీడ్ ఆయిల్ :

మెలస్మా లేదా డార్క్ పిగ్మెంటేషన్ తగ్గించడంలో గ్రేప్ సీడ్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ప్రోఆంథోసైనైడ్స్ అనే ఆయిల్స్ ఉండటం వల్ల ఎఫెక్టివ్ గా మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి డార్క్ ప్యాచెస్ ను నివారిస్తుంది కొబ్బరి నూనెలో కొద్దిగా గ్రేప్ సీడ్ ఆయిల్ మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతంలో రోజుకు రెండు సార్లు అప్లై చేయాలి.

2) దానిమ్మ జ్యూస్:

2) దానిమ్మ జ్యూస్:

ఫ్రెష్ దానిమ్మ జ్యూస్ లో ఎల్లాజిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. మెలస్మా ప్యాచెస్ ను ఇవి కనబడకుండా చేస్తాయి .

ఫ్రెష్ దానిమ్మ తొక్క తీసి, విత్తనాలను బ్లెండర్ లో వేసి పేస్ట్ చేయాలి. తర్వాత వడగట్టి, జ్యూస్ తియ్యాలి. ఈ మిశ్రమాన్ని డార్క్ ప్యాచెస్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.

3) అలోవెర జెల్ :

3) అలోవెర జెల్ :

గర్భధారణ సమయంలో చర్మం డ్రైగా మారుతుంది. పొడి చర్మం మరియు మెలస్మా సమస్యల అలోవెర జెల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది స్కిన్ డ్యామేజ్ ను కూడా నివారిస్తుంది.

అలొవెర లీఫ్ నుండి జెల్ తీసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చన్నీటితో కడగాలి.

4) గందం పేస్ట్ :

4) గందం పేస్ట్ :

గందంలో కూలింగ్, మరియు బ్లీచింగ్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి స్కిన్ ఇరిటేషన్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తాయి.

ఒక టీస్పూన్ గంధం పేస్ట్ ను 2 టేబుల్ స్పూన్ల వాటర్ తో కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

5) బాదం మిల్క్ :

5) బాదం మిల్క్ :

బాదంలో ప్రోటీన్స్ మరియు విటమిన్లు అధికంగా ఉన్నాయి. ఇది స్కిన్ కంప్లెక్షన్ ను నివారిస్తుంది. చర్మంలో పొడిని తగ్గించి పోషణను అందిస్తుంది. గుప్పెడు బాదంలను తీసుకుని, రాత్రి నీళ్ళలో నానబెట్టాలి. ఉదయం వాటిని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి, ప్రభావిత ప్రదేశంలో అప్లై చేయాలి.

English summary

Skin Darkening During Pregnancy And How It Is Caused

Skin Darkening During Pregnancy And How It Is Caused,Skin darkening is one of the common problems, especially noticed during pregnancy. But there are certain remedies one can try to get rid of dark skin durin
Subscribe Newsletter