For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ 10 కారణాల వలన మీరు ప్రెగ్నెంట్ కాలేకపోతున్నారు

  |

  కొంతమంది దంపతులకు సంతానాన్ని పొందటమనేది కష్టతరంగా మారుతుంది. ఎన్ని సార్లు ప్రయత్నించినా వారికి సంతానం కలగదు. దీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే దంపతులతో ఎవరో ఒకరిలో లోపం ఉందేమో తెలుసుకోవాలి.

  అయితే, ఒక నిర్ధారణకు వచ్చే ముందు ప్రతి నెల కేవలం 25 శాతం మాత్రమే సంతానాన్ని పొందేందుకు అనువుగా ఉంటుందని తెలుసుకోవాలి. ఎటువంటి ఫెర్టిలిటీ కాంప్లికేషన్స్ లేని ఆరోగ్యకరమైన దంపతులకు ఇది వర్తిస్తుంది.

  10 Reasons Why Youre Not Getting Pregnant

  ఈ అనాలజీ ప్రకారం సంతానం కోసం ప్రయత్నించే వారు సాధారణంగా 4 నెలల సమయం తరువాత గర్భం దాల్చే అవకాశం ఉంది. ఈ లోపు, మిమ్మల్ని ప్రెగ్నెంట్ అవకుండా అడ్డుకుంటున్న కారణాలపై మీరు శ్రద్ధ వహించాలి. తద్వారా, తగిన జాగ్రత్తలను మీరు తీసుకోవచ్చు.

  1. ఒవ్యులేషన్ పీరియడ్ కి అలాగే ఇంటర్ కోర్స్ కి మధ్యలో మిస్ మ్యాచ్ ఉండటం:

  1. ఒవ్యులేషన్ పీరియడ్ కి అలాగే ఇంటర్ కోర్స్ కి మధ్యలో మిస్ మ్యాచ్ ఉండటం:

  మహిళ ఒవ్యులేట్ అవడానికి ముందు రోజు శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. అయితే, ఒవ్యులేట్ అవుతున్న రోజు పాల్గొంటే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు తక్కువే. ఒవ్యులేషన్ రోజు సెక్స్ లో పాల్గొంటే స్పెర్మ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్ లో కి చేరి ఎగ్ కోసం వేచి చూడాలి. ఎగ్ అనేది కేవలం 24 గంటలు మాత్రమే జీవించి ఉంటుంది. మరోవైపు, స్పెర్మ్ అనేది 5 రోజుల పాటు శరీరంలో యాక్టివ్ గా ఉంటుంది. మీ పీరియడ్ మొదటి రోజు నుంచి కౌంట్ చేస్తూ వచ్చి 7 నుంచి 20 వ రోజులలో మీరు సెక్స్ లో పాల్గొంటూ ఉంటే మీరు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  2. పోలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్):

  2. పోలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్):

  ఓవరీస్ లో సిస్ట్ లు ఉన్నవారికి ఈ కండిషన్ తలెత్తుతుంది. ఈ కండిషన్ తో బాధపడుతున్న మహిళలు ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు గురవుతారు. ముఖంపై అలాగే శరీరంపై రోమాలు ఎక్కువగా ఉంటాయి. హెయిర్ లాస్ సమస్య ఉంటుంది. శరీర బరువు అధికంగా ఉంటుంది. పీసిఓఎస్ సమస్యతో బాధపడే మహిళలు రెగ్యులేట్ గా ఒవ్యులేట్ అవ్వరు. ఒవ్యులేషన్ కోసం వీరికి ట్రీట్మెంట్ అవసరం. అధ్యయనాల ప్రకారం దాదాపు 10 శాతం మంది మహిళలు రీప్రొడక్టివ్ ఏజ్ లో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, చింతించకండి. ఈ కండిషన్ ను సులభంగా మేనేజ్ చేయవచ్చు. ఈ కండిషన్ గలవారు కూడా ప్రెగ్నెంట్ కాగలరు.

  3. మొబైల్ ఫోన్స్ రేడియేషన్స్:

  3. మొబైల్ ఫోన్స్ రేడియేషన్స్:

  సెల్ ఫోన్స్ నుంచి విడుదలయ్యే ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియషన్ అనేది స్పెర్మ్స్ ని డేమేజ్ చేస్తుంది. మీరు మీ పాకెట్ లో మొబైల్ ఫోన్ ని క్యారీ చేసేటట్టయితే ఆ అలవాటును మానుకోండి. ఎందుకంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్ కు దగ్గరిగా ఫోన్స్ ను ఉంచడం మంచిది కాదు.

  4. అనారోగ్యకరమైన శరీర బరువు:

  4. అనారోగ్యకరమైన శరీర బరువు:

  బరువు తక్కువుగా ఉన్నా లేదా అదనపు శరీర బరువు సమస్యతో మీరు బాధపడుతున్నా కూడా గర్భం దాల్చేందుకు ఇబ్బంది పడే అవకాశాలు కలవు. హైపోథాలమస్ (మెదడుకి సంబంధించిన ఒక భాగము)కి డేమేజ్ జరిగితే పిట్యూటరీ గ్లాండ్ చేత నియంతరింపబడే ఇతర అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ముఖ్యంగా ఓవరీల పనితీరు దెబ్బతింటుంది.

  5. కమర్షియల్ ల్యూబ్రికెంట్స్:

  5. కమర్షియల్ ల్యూబ్రికెంట్స్:

  గర్భం దాల్చాలని నిర్ణయించుకున్నప్పుడు లవ్ మేకింగ్ అనేది ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ల్యూబ్రికెంట్స్ ని వాడటం అవసరపడవచ్చు. అయితే, వీటిని వాడటం వలన గర్భం దాల్చాలనుకున్న మీ కల నెరవేరదు. ఎందుకంటే, ల్యూబ్రికంట్స్ అనేవి స్పెర్మ్స్ ని యుటెరస్ వద్దకు చేరుకోనివ్వకుండా 60 శాతం వరకు అడ్డుకుంటాయి. ఈ విషయాన్ని అధ్యయనాలు స్పష్టం చేసాయి.

  6. థైరాయిడ్ ప్రాబ్లెమ్స్:

  6. థైరాయిడ్ ప్రాబ్లెమ్స్:

  హైపోథైరాయిడిజం లేదా హైపర్థైరాయిడిజంతో ఇబ్బందిపడే మహిళల్లో రీప్రొడక్టివ్ హార్మోన్ ల బాలన్స్ లో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అందువలన, మెన్స్ట్రువల్ సైకిల్ లో కూడా సమస్యలు ఏర్పడతాయి. బ్లీడింగ్ ఎక్కువగా కావడంతో పాటు ఇరెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలు బాధపెడతాయి.

  ఈ రోజుల్లో థైరాయిడ్ ప్రాబ్లెమ్స్ సర్వ సాధారణంగా మారిపోయాయి. కాబట్టి, ఈ సమస్యకు ట్రీట్మెంట్ ను తీసుకుంటే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

  7. స్మోకింగ్ మరియు డ్రింకింగ్:

  7. స్మోకింగ్ మరియు డ్రింకింగ్:

  మీ లైఫ్ స్టైల్ అనేది ప్రెగ్నెన్సీ పై ప్రభావం చూపుతుంది. స్మోకింగ్ లేదా డ్రింకింగ్ హ్యాబిట్స్ అనేవి గర్భం దాల్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఎక్కువగా టీ, కాఫీలను తీసుకోవడం, ఆల్కహాల్ ను తీసుకోవడం వంటివి మహిళల్లో గర్భాన్ని దాల్చే అవకాశాలను తగ్గిస్తాయి. అలాగే, స్మోకింగ్ హ్యాబిట్ నుంచి కూడా దూరంగా ఉండటం అవసరం. పురుషుల్లో కూడా స్మోకింగ్ మరియు డ్రింకింగ్ హ్యాబిట్స్ అనేవి స్పెర్మ్ మరియు వీర్యం నాణ్యతను తగ్గిస్తాయి.

  9. హానికర టాక్సిన్లు:

  9. హానికర టాక్సిన్లు:

  హానికర టాక్సిన్లకి ఎక్కువగా ఎక్స్పోస్ అవడం వలన కూడా గర్భం దాల్చేందుకు ఇబ్బంది పడతారు. ఈ టాక్సిన్స్ అనేవి ప్లాస్టిక్ బాటిల్స్, ఫుడ్ క్యాన్స్ మరియు క్యాష్ రిసీప్ట్స్ నుండి కూడా మీకు చేరతాయి. పీసీబీ లేదా పోలీక్లోరినేటేడ్ బైఫినాయిల్ అనేది ఇంకొక టాక్సిన్ అనేది మీ దంపతుల రక్తంలో ఉంటే గర్భం దాల్చే అవకాశాలు తక్కువ. మాంసం లేదా చేపరసం ద్వారా ఈ టాక్సిన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

  10. శీతాకాలంలో తగినంత విటమిన్ డి అందకపోవటం:

  10. శీతాకాలంలో తగినంత విటమిన్ డి అందకపోవటం:

  శీతాకాలంలో గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శరీరానికి తగినంత విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా అందకపోవటం వలన ఇలా జరుగుతుంది. శరీరంలోని సెక్స్ హార్మోన్ ని బాలన్స్ చేయడానికి విటమిన్ డి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం వలన ప్రెగ్నెన్సీ అనేది డిలే అవవచ్చు. లేదా మిస్ క్యారేజ్ ప్రమాదం కూడా పెరగవచ్చు.

  గర్భం దాల్చడమనేది ఒత్తిడితో కూడుకున్నది అవవచ్చు. పైన చెప్పబడిన విషయాలను తెలుసుకోవడం ద్వారా గర్భం దాల్చలేకపోవటానికి గల కారణాలపై ఒక క్లారిటీ వస్తుంది.

  English summary

  10 Reasons Why You're Not Getting Pregnant

  It can be quite frustrating for a couple to try to multiple times and still not get pregnant. If it has been too long that you have been trying repeatedly, it is quite likely for you to assume that there you or your partner, or both of you are infertile. But before you jump to that conclusion, it is important for you to be aware of the fact that there only 25% chances of getting pregnant every month. This is with reference to a healthy couple who has not been diagnosed with any fertility complications.
  Story first published: Thursday, May 10, 2018, 12:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more