ప్రీటర్మ్ లేబర్ కి దారి తీసే ఈ 8 కారణాలను ప్రతి మహిళ తెలుసుకోవాలి

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మాతృమూర్తిగా బిడ్డకు జన్మనిచ్చే అదృష్టం స్త్రీని వరించడం ఒక గొప్ప విషయం. మాతృమూర్తి అవ్వాలని తల్లిగా తన ప్రేమను బిడ్డకు పంచాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. తనలో ఇంకో ప్రాణికి జీవం పొసే భాగ్యం కేవలం స్త్రీలకు మాత్రమే దక్కడం అదృష్టం. అయితే, ఇంకో ప్రాణికి జీవం పోయడం సాధారణ విషయం కాదు. స్త్రీలు ప్రసవ సమయంలో పునర్జన్మనెత్తుతారని అందుకే అంటారు. ఇది, ఎంతో వేదనతో కూడిన విషయం. ఎన్ని, ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ప్రసవ సమయానికి ముందే ప్రసవం జరిగే ప్రమాదం ఉంది. మాములుగా 37 వారాలకు జరగవలసిన ప్రసవం ముందుగా జరిగే ప్రమాదం ఎన్నో అంశాల వలన తలెత్తుతుంది. ప్రీమెచ్యూర్ బేబీస్ అనేక రకాలైన ఆరోగ్యసమస్యలతో బాధపడతారు. భవిష్యత్తులో కూడా వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

పెల్విక్ స్ట్రెస్, నెలసరి వంటి నొప్పులు, వెజీనల్ కెనాల్ నుంచి బ్లడ్ డిశ్చార్జ్ లేదా వాటర్ డిశ్చార్జ్, లోవర్ బ్యాక్ వద్ద అసాధారణ నొప్పి వంటి లక్షణాలు తలెత్తినప్పుడు అవి ప్రీటర్మ్ లేబర్ కి దారితీసే ప్రమాదం ఉంది.

ప్రీటర్మ్ లేబర్ కి దారితీసే కారణాలను కింద వివరించాము. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యకరమైన ప్రసవం జరిగేందుకు ప్రెగ్నన్సీ టెన్యూర్ లో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

1. ఇంతకు ముందు అబార్షన్ లేదా మిస్ క్యారేజ్ జరిగి ఉండటం వలన:

1. ఇంతకు ముందు అబార్షన్ లేదా మిస్ క్యారేజ్ జరిగి ఉండటం వలన:

ఇంతకు ముందు మీకు ప్రీటర్మ్ లేబర్ జరిగి ఉండుంటే ఈ ప్రెగ్నన్సీలో కూడా ప్రీటర్మ్ లేబర్ సంభవించే ప్రమాదం కలదు. అటువంటి సందర్భంలో, మీ వైద్యులు మీకందించిన సూచనలన్నిటినీ మీరు తప్పక పాటించాలి. తద్వారా, మీ ఆరోగ్యంతో పాటు కడుపులోనున్న మీ బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంతకు ముందు అబార్షన్ జరిగి ఉండుంటే ఈ ప్రెగ్నన్సీ లో ప్రీటర్మ్ లేబర్ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువలన, మీరు తగినంత రెస్ట్ ను తీసుకోవాలి. అలాగే, ఇంకొక ప్రెగ్నన్సీకి ప్రయత్నించే ముందు మీరు వైద్యులు సూచించినంత గ్యాప్ ను తీసుకోవాలి. ఇంతకు ముందు ఏవైనా ఆరోగ్యసమస్యల వలన అన్బర్న్ బేబీని కోల్పోయారంటే తదుపరి ప్రెగ్నన్సీలో ప్రీటర్మ్ లేబర్ జరిగే సూచనలు కలవు. అందువలన, మీ వైద్యులు మీకందించే సూచనలను మీరు జాగ్రత్తగా పాటించి సరైన ఆహారనియమాలను కూడా పాటించి అలాగే సరైన జీవనశైలి అలవాట్లను కూడా పెంపొందించుకుంటే ప్రసవం సరైన సమయానికి సజావుగా జరుగుతుంది.

2. లేత వయసులో లేదా లేటు వయసులో గర్భాన్ని దాల్చడం.

2. లేత వయసులో లేదా లేటు వయసులో గర్భాన్ని దాల్చడం.

లేత వయసులో గర్భాన్ని దాల్చడం కూడా ప్రీటర్మ్ లేబర్ జరిగేందుకు ఒక కారణంగా మారుతుంది. 14-19 వయసు మధ్యలో గర్భాన్ని దాల్చితే ప్రీటర్మ్ లేబర్ జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే, వయసు మీరుతున్నప్పుడు అంటే 35-40 ఏళ్ళ వయసులో గర్భం దాల్చినా ప్రీటర్మ్ లేబర్ జరిగే ప్రమాదాలు ఎక్కువే. ఎందుకంటే, వయసు మీరుతున్న కొద్దీ మహిళల్లో హైపెర్టెన్షన్ అలాగే డయాబెటిస్ వంటి ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదాలు ఎక్కువ. అదేవిధంగా, 14-19 ఏళ్ళ వయసులో గర్భం దాల్చడానికి శరీరం పూర్తిగా సిద్ధంగా ఉండదు. అందువలన, సరైన వయసులో గర్భాన్ని దాల్చడం వలన ప్రసవం సజావుగా జరుగుతుంది. లేత వయసులో అలాగే వయసు మీరిన తరువాత గర్భం దాల్చినట్లయితేప్రీటర్మ్ లేబర్ జరిగే ప్రమాదాలను తప్పక దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

3. గర్భం దాల్చిన తరువాత ఎదురయ్యే ఆరోగ్య సమస్యల వలన:

3. గర్భం దాల్చిన తరువాత ఎదురయ్యే ఆరోగ్య సమస్యల వలన:

ప్రీ ఎక్లెమ్సియా, HELLP సిండ్రోమ్, జెనిటల్ ఇన్ఫెక్షన్స్ అలాగే యుటెరిన్ మరియు సెర్వికల్ ప్రాబ్లమ్స్ వంటివి ప్రీటర్మ్ లేబర్ జరగడానికి కారణమయ్యే కొన్ని అంశాలు. గర్భం దాల్చిన తరువాత హై బ్లడ్ స్ట్రెస్ లేదా యూరిన్ లో హై హెల్త్ ప్రోటీన్ కంటెంట్ కనిపిస్తే ప్రీటర్మ్ లేబర్ సంభవించే ప్రమాదం కలదు.

HELLP డిజార్డర్ అనే ఆరోగ్యస్థితిలో రెడ్ సెల్స్ ఫెయిల్యూర్ అవడం లేదా లివర్ ఫంక్షన్ లో లోపం తలెత్తడం అలాగే రక్తం గడ్డకట్టడంలో సమస్యలు తలెత్తడం వంటివి గమనించవచ్చు. ఇవన్నీ, ప్రీటర్మ్ లేబర్ కి దారితీసే అంశాలే.

4. ఇంతకు ముందు ప్రెగ్నన్సీలో ట్విన్స్, ట్రిప్లెట్స్ లేదా క్వాడ్రప్లెట్స్

4. ఇంతకు ముందు ప్రెగ్నన్సీలో ట్విన్స్, ట్రిప్లెట్స్ లేదా క్వాడ్రప్లెట్స్

ట్విన్స్ ని, ట్రిప్లెట్స్ ని ఆలాగే క్వాడ్రాప్లెట్స్ ని కనడం ఎంతో ఎమేజింగ్ గా అనిపించడం సహజం. అయితే, అటువంటి పరిస్థితులనేవి, ప్రీటర్మ్ లేబర్ కి దారితీసే ముఖ్యకారణాలు. కడుపులో ఒకరి కంటే ఎక్కువ శిశువులు ఒకే సమయంలో ప్రాణం పోసుకునేటప్పుడు ప్రెగ్నన్సీ పీరియడ్ లెన్త్ అనేది కాస్తంత తగ్గుతుంది. అటువంటి సందర్భాలలో, వైద్యులను తరచూ సంప్రదించి ఆరోగ్యస్థితుల గురించి వారికి వివరించాలి. తద్వారా, పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు.

5. వెంటవెంటనే గర్భం దాల్చడం:

5. వెంటవెంటనే గర్భం దాల్చడం:

వెంటవెంటనే గర్భం దాల్చడం వలన కూడా ప్రీటర్మ్ లేబర్ సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే, ప్రసవించిన తరువాత శరీరం కోలుకోవడానికి సమయం పడుతుంది. సరైన ఆహారనియమాలతో జీవన శైలి అలవాట్లతో త్వరగా కోలుకునే ఆస్కారం కలదు. గర్భానికి గర్భానికి మధ్య కాస్తంత గ్యాప్ అవసరం. లేదంటే, ప్రీటర్మ్ లేబర్ సమస్య తలెత్తుతుంది. మీరు ఆరోగ్యంగా లేనప్పుడు మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే, పూర్తిగా కోలుకున్నాకే మరొక బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవ్వాలి. కనీసం 18 నెలల పాటు ఇంకొక బిడ్డను కనేందుకు సిద్ధమవకుండా గ్యాప్ ను తీసుకోవాలి. ఆ తరువాత, మరొక బిడ్డకోసం ప్రయత్నిస్తే విజయవంతంగా ప్రసవం సరైన సమయంలోనే జరుగుతుంది.

6. అధిక ఒత్తిడికి గురవడం:

6. అధిక ఒత్తిడికి గురవడం:

ఇప్పుడు పోటీతత్వం విపరీతంగా పెరిగింది. ఇక్కడ మనుగడ సాగించాలంటే ఒత్తిళ్లు తప్పవు. అయితే, ఈ ఒత్తిళ్లనేవి గర్భంపై దుష్ప్రభావం చూపిస్తాయి. అందువలన, గర్భం దాల్చాలని సిద్ధమయినప్పుడు ఒత్తిళ్లకు దూరంగా ఉండటం మంచిది. గర్భం దాల్చిన తరువాత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రశాంతకరమైన సంగీతాన్ని వింటూ ఒత్తిడిని దూరం చేసుకోవాలి. తద్వారా, ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనివ్వగలుగుతారు. లేదంటే, ప్రీటర్మ్ సమస్యకు గురవుతారు.

7. ఇంతకు ముందు తరంలో ప్రీటర్మ్ లేబర్ జరిగి ఉండటం వలన:

7. ఇంతకు ముందు తరంలో ప్రీటర్మ్ లేబర్ జరిగి ఉండటం వలన:

మీ కుటుంబసభ్యులలో ఎవరికైనా ప్రీటర్మ్ లేబర్ హిస్టరీ ఆల్రెడీ ఉండుంటే మీకు కూడా ప్రీటర్మ్ లేబర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరు ప్రీటర్మ్ లేబర్ ద్వారా పుట్టిన వారైతే మీకు కూడా ప్రీటర్మ్ లేబర్ సమస్య తలెత్తే ప్రమాదం ఎక్కువ. ఫ్యామిలీ మెంబర్స్ హిస్టరీతో పాటు జీన్స్ అనేది ఫ్యూచర్ జెనెరేషన్ ని డిసైడ్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి, ఈ విషయాలను వైద్యులకు వెల్లడించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

8. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్ల వలన:

8. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్ల వలన:

తరచూ స్మోకింగ్ అలాగే ఆల్కహాల్ ను సేవించే అలవాటున్న మహిళలలో ప్రీటర్మ్ లేబర్ తలెత్తే సమస్య అధికంగా కనిపిస్తుంది. ప్రెగ్నన్సీ సమయంలోనైనా ఈ అలవాట్లను దూరంగా ఉంచడం వలన ప్రీటర్మ్ లేబర్ ప్రమాదాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ అలవాట్ల వలన బిడ్డ తక్కువ బరువుతో జన్మించడం, ప్లెసెంటా ఇష్యూ అలాగే శిశువు ప్రాణానికి ఆపద ఏర్పడే ప్రమాదం కలదు. ఈ అలవాట్ల వలన ప్రెగ్నన్సీ టెన్యూర్ మొత్తం రిస్కీగా నడుస్తుంది.

గర్భం దాల్చిన దగ్గరనుంచి ప్రసవం వరకూ కూడా వైద్యుల సూచనలు తప్పనిసరి. తద్వారా, ప్రీటర్మ్ లేబర్ వంటి సమస్యలను అరికట్టవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుని పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు.

English summary

8 Causes Of Preterm Labor That Every Woman Should Know

Preterm labor takes place to you when you have pelvic stress, menstrual like aches, blood or water or blood discharge from the vaginal canal and uncommon pain in the lower back.
Story first published: Wednesday, February 14, 2018, 10:00 [IST]