For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు మీ ప్రసవించే తేదీని దాటారా ?

|

గర్భధారణ జరిగిన 42 వారాలకు గడువు తేదీని ఇస్తారు డాక్టర్లు. అది సహజం . కాని ఆ గడువు తేదీని దాటితే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాద అవకాశాలు ఉండవచ్చు అని డాక్టర్లు హెచ్చరిస్తుంటారు.

గర్భవతులు, 9 నెలల తర్వాత కాన్పు తేది దాటి రోజులు గడుస్తున్న కొద్దీ ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు. కాని కొన్ని సందర్భాలలో ఇలా జరగడం సహజమే అని, అలాంటి పరిస్థితుల్లో డెలివరీ తేదీ, సమయాన్ని లెక్కించడం కష్టతరమవుతుంది అని డాక్టర్లు చెప్తుంటారు. కాని ప్రపంచంలో 7 శాతం శిశువులు కాన్పు తేది దాటిన తర్వాతే పుడుతున్నారని ఒక అంచనా . ఒకవేళ మీ అంచనా తప్పి గడువు తేది దాటిపోతే, మీరు చెయ్యాల్సిన ఒకే ఒక్క పని ఒత్తిడికి, ఆత్రుతకి లోను కాకుండా ఉండడమే.

నిజానికి 42 వారాలు దాటిన తర్వాత గర్భాశయం గర్భస్థపిండానికి అనువుగా ఉండకపోవడం ప్రారంభిస్తుంది. తద్వారా ఉమ్మనీరు (మాయ ) తక్కువ పోషకాలతో, ఆక్సిజన్ తో సరఫరా అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన గడువు తేదీ దాటినా కూడా డెలివరీ కాని పక్షములో, amniotic ద్రవం నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తుంది. ఇది తల్లి. బిడ్డ ఇద్దరికీ ప్రమాదం కావొచ్చు.


ఒక వేళ గడువుతేదీ దాటినట్లయితే మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

నిర్జీవ జననం:

నిర్జీవ జననం:

ఒక వేళ గడువు తేదీని దాటినా కూడా, ఎటువంటి సంజ్ఞ లేని పక్షంలో బహుశా నిర్జీవ జననం కావొచ్చు. అనగా గర్భంలోనే శిశువు మృతి చెంది ఉండవచ్చు. దీనికి ఆక్సిజన్ కొరత కాని , శిశువు విసర్జించిన పదార్ధాలు amniotic ద్రావణం లోనికి చేరి, తిరిగి మరలా శిశువు ఊపిరి ద్వారా శరీరంలోకి చేరుట వలన కాని. సంభవించవచ్చు.దీని కారణం గా నిర్జీవ జననం సంభవించవచ్చు. కావున ఈ సమయాల్లో డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండడం మంచిది. లేనిచో తల్లికి కూడా ప్రమాదం జరిగే అవకాశo ఉంది.

త్వరలో గడువు రావొచ్చు:

త్వరలో గడువు రావొచ్చు:

చాలా మంది పిల్లలు 37 వారాల నుండి 41 వారాల మద్యలో జన్మిస్తుంటారు. అనగా సాధారణంగా కాన్పు తేదీకి వారం అటుకాని , వారం ఇటు కాని జన్మిస్తుంటారు. గడువు తేదీకి ఒక్క వారమే ఎక్కువ గడిస్తే మీరు ఆందోళన చెందనవసరం లేదని డాక్టర్లు చెప్తుంటారు. అయినా కూడా అలాంటి సందర్భాలలో డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండడం మంచిది.

కాన్పుని ప్రేరేపించడం:

కాన్పుని ప్రేరేపించడం:

మీరు మీ గడువు తేదీని దాటినా , మరియు కాన్పు సంకేతాలు లేనప్పుడు, మీరు కొంచెం తక్కువగా అలసిపోయిన భావాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా, వైద్యులు గడువు తేదీ తర్వాత కొన్ని రోజులు వేచి చూస్తారు. ఆపరేషన్స్ ద్వారా కాని, గర్భస్థ పిండాన్ని జన్మకి ప్రేరేపించడం కాని చెయ్యరు. దీనికి ప్రధాన కారణం సహజ ప్రక్రియే అన్నిటికన్నా సురక్షితం కాబట్టి. కాని అవసరాన్ని అనుసరించి డాక్టర్లు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

ప్రసూతి నిపుణుల (Obstetrician) ఆవశ్యకత :

ప్రసూతి నిపుణుల (Obstetrician) ఆవశ్యకత :

ఈ దశలో గర్భస్రావం గురించి భయపడుతున్న తల్లులు ప్రసూతి నిపుణుల సహాయం కోరుకుంటారు. ఈ నిపుణులు మీ చివరి బహిష్టుని దృష్టిలో ఉంచుకుని కాన్పు తేదీని లెక్కలు వేసి నిర్ధారిస్తారు. కొన్ని సమయాల్లో BP మరియు ప్రోటీన్ స్థాయిలు అంచనా వెయ్యుటకు మూత్ర పరీక్షలు కూడా చేస్తారు. వీరు ప్రత్యేకంగా శిక్షితులై ఉంటారు , తద్వారా గర్భిణీ స్త్రీకు దైర్యంగా ఉంటారు.

గర్భం తనిఖీ చెయ్యడం :

గర్భం తనిఖీ చెయ్యడం :

ఒక్కోసారి గర్భంలో ఉన్న శిశువు పరిమాణం ,శిశువు ఉండే తీరుని అంచనా వేయవలసి ఉంటుంది. దీనికి శిశువుకి సంబంధించిన స్కాన్లు చేయవలసి ఉంటుంది. ఒక వేళ గడువు తేదీని దాటిన యెడల, యోని పరీక్షలు చేసి , గర్భాశయం శిశువుకి అనువుగా , మృదువుగా, సాగదీత లక్షణాన్ని కలిగి ఉందో లేదో అన్న అంచనాకి వస్తారు. తద్వారా డాక్టర్లు కాన్పు సంబందించిన నిర్ణయాన్ని తీసుకుంటారు.

శిశువు ప్రమాద సూచనలు:

శిశువు ప్రమాద సూచనలు:

గడువు తేదీ దాటిన తర్వాత సరైన పోషకాలు, ఆక్సిజన్ సరఫరా లేక శిశువు హృదయ స్పందనలు సాధారణం కంటే అధిక స్థాయిలో పెరగడం ప్రారంభిస్తాయి. ఇది గుండెపై అధిక ఒత్తిడికి కారణం అవుతుంది. ఇది శిశువుకి ప్రమాదమే అవుతుంది.

తల్లి ప్రమాద సంకేతాలు :

తల్లి ప్రమాద సంకేతాలు :

గడువు తర్వాత పుట్టే శిశువులు సాధారణంగానే ఎక్కువ పరిమాణంలో ఉంటారు. తద్వారా సాధారణ కాన్పు సమయంలో గర్భాశయo ఎక్కువ ఒత్తిడికి లోనవడం జరిగి, కాన్పు సమయంలో భారం పెరుగుతుంది. ఇది తల్లికి మంచిది కాదు.

English summary

Past Due Date In Pregnancy | Past Due Date & No Labour Signs | Pregnancy Advice For Women

If you are past your due date in pregnancy and no signs of labour, here is some pregnancy advice for you to be aware of.
Story first published:Tuesday, March 13, 2018, 10:08 [IST]
Desktop Bottom Promotion