For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీల చర్మంలో కలిగి మార్పులేంటో మీకు తెలుసా

By :krishnadivya P
|

మాతృత్వం ఒక తియ్యని కల. పెళ్లైన ప్రతి మహిళా ఈ ఆనందం అనుభవించాలని కోరుకుంటుంది. గర్భవతి అయిన దగ్గర్నుంచి కాన్పు జరిగేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదెంతో సవాల్‌తో కూడిన అంశం. ఈ కాలంలో మహిళల చర్మంలో మార్పులు వస్తాయి. దాంతోపాటే అనుభవాలూ వస్తాయి.

గర్భం ధరించినప్పుడు ఉదయం జ్వరంగా ఉంటుంది. జలుబు, అలసట, వాపులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జట్టు రాలిపోతుంది. తొమ్మిది నెలలూ ఇదే విధంగా ఉంటుంది. అయితే చర్మం ఎలాంటి మార్పులకు గురవుతుందనే తెలుసుకోవాలని ఆడవారికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

గర్భధారణ సమయంలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పటికే చాలా మంది తెలుసుకొని ఉంటారు. తొలి మూడు నెలల్లో చర్మం రంగు పెరుగుతుందని, మిలమిలా మెరుస్తుందని, ప్రకాశవంతంగా మారుతుందని దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికీ ఇలాగే ఉంటుందా? వేర్వేరు మార్పులు ఉంటాయా? అందరికీ ఒకే దశలో ఒకేలాంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకుందాం.

తల్లి కాబోతున్న ప్రతి మహిళా ఈ విషయాలను తప్పక తెలుసుకుంటుంది. అందులో కొన్ని సానుకూల మార్పలు ఉండగా కొన్ని ఇష్టమైనవి కాకపోవచ్చు. అవేంటంటే?

1. ఆరోగ్యవంతమైన మెరుపులీనే చర్మం

1. ఆరోగ్యవంతమైన మెరుపులీనే చర్మం

గర్భధారణ సమయంలో మహిళల్లో ఉండే హార్మోన్లలో మార్పుల వల్ల చర్మంలో మార్పులు వస్తాయి. దీనివల్లే చర్మం మరిన్ని స్రవాలను ఉత్పత్తి చేస్తుంది. దాంతో చర్మం అందంగా మారుతుంది. మెరుపులీనుతుంది. హార్మోన్ల మార్పు గర్భిణుల శరీరాన్ని మరింత ఆరోగ్యవంతంగా కనిపించేలా చేస్తుంది.

2. పెరిగే రక్త ప్రసరణ

2. పెరిగే రక్త ప్రసరణ

తల్లికాబోయే వారి ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రెండో త్రైమాసికంలో అంటే మూడు నుంచి ఆరు నెలల కాలంలో ఇలా అవుతుంది. గర్భాశయంలో బిడ్డ పెరుగుతుండటంతో శరీరంలో అన్ని అంగాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. లోపల పెరుగుతున్న బిడ్డకోసమే ఇలా జరుగుతుంది. సాధారణంగా జరిగే ప్రసరణ కన్నా 50 శాతం అధికంగా జరుగుతుంది. అందుకే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

3. పోషకాహారంతో పెరిగే అందం

3. పోషకాహారంతో పెరిగే అందం

గర్భధారణ సమయంలో స్త్రీలు చక్కని పోషకాహారం తీసుకుంటారు. ఆరోగ్య కరమైన పదార్థాలు, పండ్ల రసాలు, తాజా కూరలు, పండ్లు, ఫోలిక్‌ యాసిడ్‌, మల్టీ విటమిన్స్‌ వంటి తీసకుంటారు. ఆహారంలో వచ్చిన ఈ కొత్త అలవాట్లతో చర్మం మరింత అందంగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది.

4. చర్మంపై నల్ల మచ్చలు

4. చర్మంపై నల్ల మచ్చలు

తల్లికాబోయే వారు ఇష్టపడని అంశం ఇదే. గర్భధారణ సమయంలో అందరూ స్త్రీలు తమ చర్మం సౌందర్యం పెరగడాన్ని ఆస్వాదిస్తారు. అయితే చర్మంపై కొన్ని చోట్ల నల్ల మచ్చలు రావడం వారిని ఇబ్బందికి గురిచేస్తుంది. చర్మంపై, ముఖంపై కొన్ని చోట్ల నలుపు, గోధుమ రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఇవి బహిరంగంగా కనిపించడంతో కాస్త బాధపడతారు.

5. చర్మంపై అధిక పిగ్మెంటేషన్‌

5. చర్మంపై అధిక పిగ్మెంటేషన్‌

గర్భిణి బాధపడే మరో అంశం అధిక పిగ్మెంటేషన్‌. గర్భధారణ సమయంలో మెలనోసైట్‌- స్టిములేటింగ్‌ హార్మోన్‌ (ఎంఎస్‌హెచ్‌) ఎక్కువగా విడుదల అవుతుంది. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ కన్నా ఎక్కవుగా ఈ హార్మోన్‌ విడుదల కావడంతో చర్మం నలుపు రంగులోకి మారుతుంది. తెలుపు రంగు చర్మం ఉన్నవారూ దీన్ని అనుభవిస్తారు.

6. మొటిమలు

6. మొటిమలు

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మరో ఇబ్బంది మొటిమలు. జిడ్డు చర్మం ఉన్న వారిని ఎక్కువగా ఇది బాధిస్తుంది. శరీరంలో ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ పెరగడం వల్ల స్రవాలు ఎక్కువగా విడుదల అవుతాయి. ఇది చర్మంపై పెళుసుదనం పెంచుతుంది. చిన్న చిన్న బొడిపెల్లాంటివి వచ్చి మొటిమలుగా మారతాయి.

English summary

Changes Seen On The Skin During Pregnancy

Pregnancy is usually accompanied with a number of uncomfortable symptoms like morning sickness, nausea, fatigue, hair fall, swelling, etc, which you may have to face all through the next nine months.However, there is one change that expecting mothers are often curious to know about and that is the change which takes place to the skin in pregnancy.
Story first published:Wednesday, January 24, 2018, 12:41 [IST]
Desktop Bottom Promotion