For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపుతో ఉన్నప్పుడు చర్మంపై రోజియోలా వంటి కురుపులలాగా వస్తే తగ్గించటానికి 5 మంచి చిట్కాలు

|

కడుపుతో ఉన్నప్పుడు చర్మంపై రోజియోలా వంటి కురుపులలాగా వస్తే తగ్గించటానికి 5 మంచి చిట్కాలు

గర్భవతిగా ఉన్నప్పుడు మీ లింఫ్ నోడ్లు వాచి, శరీరంలో నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్ అన్పిస్తోందా? మీ మెడ, చేతు మరియు కాళ్ళపై ర్యాషెస్ వస్తున్నాయా? అవుననిపిస్తే, మీరు రోజియోలా అనే చర్మసమస్యతో బాధపడుతున్నట్టు. కడుపుతో ఉన్నప్పుడు మీ రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది మరియు ఈ దశలో అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కడుపుతో ఉన్నప్పుడు తరచుగా వైరస్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తుంటాయి.

మీరు హెచ్ హెచ్ వి-6 వైరస్ బారినపడితే, మీకు ఇన్ఫెక్షన్ వచ్చి, రోజియోలా వస్తుంది. రోజియోలా యొక్క సాధారణ లక్షణాలు మూడు నుంచి ఐదు రోజులపాటు అధికజ్వరం, మెడపై,భుజాలు,చేతులు, ఛాతీ,ముఖం మరియు కాళ్లపై ర్యాషెస్ వస్తాయి. రోజియోలా ఒక అంటువ్యాధి, ఇది స్పర్శ ద్వారా, రోగి వస్తువులను వాడటం వలన సంక్రమిస్తుంది. అందుకని మీరు రోజియోలాతో బాధపడుతున్నట్లయితే, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ, వైద్యసాయం తీసుకుని, ఈ కింది చిట్కాలను పాటించి ఉపశమనం పొందండి. అవేంటో చదవండి.

1.మీ శరీరంలో నీటిపరిమాణం సరిగా ఉండేలా చూసుకోండి

1.మీ శరీరంలో నీటిపరిమాణం సరిగా ఉండేలా చూసుకోండి

ప్రెగ్నెన్సీ సమయంలో రోజియోలా చర్మ ర్యాషెస్ వస్తే, మీ శరీరం త్వరగా డీహైడ్రేషన్ కి గురవ్వటం వలన మీ గర్భంపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. అందుకని మీరు చాలా ద్రవపదార్థాలు తీసుకుంటూ నీటి పరిమాణాన్ని నిలబెట్టుకోవాలి. మీరు ఎక్కువ నీరును, సూపులను, ఆరోగ్యకరమైన పండ్లు, కాయగూరల రసాలను తీసుకోవాలి. ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవటం వలన మీ శరీరం బలంగా మారి, త్వరగా కోలుకుంటారు. ఎక్కువ నీరు తీసుకోవటం వలన సూక్ష్మజీవులను, విషపదార్థాలు శరీరం నుంచి బయటకి వెళ్ళిపోయి మీకు విశ్రాంతి లభిస్తుంది.

2.ఆవిరి పట్టండి

2.ఆవిరి పట్టండి

కడుపుతో ఉన్నవారు రోజియోలాతో బాధపడుతున్నప్పుడు ఆవిరిపట్టడం వలన ముక్కుదిబ్బడ,గొంతునొప్పి,జలుబు నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా తాజా యూకలిప్టస్ నూనె చుక్కలను కాస్త మీ వేపరైజర్కి జతచేసి ఆవిరిని మెల్లగా పట్టండి. ఇది మీ మూసుకుపోయిన ముక్కును తెరుస్తుంది. ఇంకా లోపల పేరుకున్న మ్యూకస్, కఫాన్ని కరిగిస్తాయి.

3.ఆలోవెరాతో ర్యాష్ లకి ఉపశమనం

3.ఆలోవెరాతో ర్యాష్ లకి ఉపశమనం

రోజియోలాతో బాధపడుతున్నప్పుడు, మీ మెడ, ఛాతీ, చేతులు,కాళ్లపై ర్యాషెస్ రావచ్చు. ఆలోవెరాను వాడితే మీకు ర్యాషెస్ కి ఉపశమనం లభిస్తుంది. ఆలోవెరా యొక్క వాపు వ్యతిరేక, వైరస్ వ్యతిరేక, యాంటిసెప్టిక్ లక్షణాలు కడుపుతో ఉన్నప్పుడు వచ్చే ర్యాషెస్ ను తగ్గిస్తాయి.చిన్న కాటన్ దూదితో ఆలోవెరా తాజారసంను తీసుకుని మీ ర్యాష్ లేదా వాచిన చర్మంపై రాయండి. ఇది మీ ర్యాషెస్ కు ఉపశమనం ఇవ్వటమే కాక, మీ చర్మంపై ఉన్న హానికారక సూక్ష్మజీవులను కూడా చంపేస్తుంది.

4.గోరువెచ్చటి తడి స్పాంజితో ఒళ్ళు తుడుచుకోండి

4.గోరువెచ్చటి తడి స్పాంజితో ఒళ్ళు తుడుచుకోండి

గోరువెచ్చటి స్పాంజి బాత్ చేయటం వలన అధిక జ్వరం మరియు కడుపుతో ఉన్నప్పుడు రోజియోలా వలన వచ్చే చర్మంపై మంట, దురద నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది. అందుకని గోరువెచ్చని నీరు, ఒక స్పాంజి రెడీ చేసుకుని శరీరం మొత్తం తుడుచుకోండి. అద్భుతమైన విశ్రాంతి, ఉపశమనం లభిస్తుంది. ఇలా ఒళ్ళు తుడుచుకోవడం వలన మీ చర్మంకి తేమ లభించి, మంటకి చల్లగా ఉపశమనం దొరికి ర్యాష్ లు తగ్గిపోతాయి.

5. వేపాకులను వాడండి

5. వేపాకులను వాడండి

రోజియోలా గులాబి చుక్కలలాంటి చర్మ ర్యాష్ లని తగ్గించుకోటానికి వేపాకుల పేస్టును రాయండి. ఎందుకంటే వేప ఆకులలో వైరస్ వ్యతిరేక పదార్థం ఉంటుంది. ఇది మీరు కడుపుతో ఉన్నప్పుడు చర్మంపై రోజియోలా స్థితి ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీరు నేరుగా తాజా వేపాకులను కోసి పేస్టులా చేసి చర్మంపై రాసేయండి. ఇంకా మీరు వేప నూనె మరియు ఆలివ్ నూనె చుక్కలను కలిపి ఈ నూనెను మీ ర్యాష్ వచ్చిన చర్మంపై రాస్తే ఉపశమనం లభిస్తుంది.

English summary

Effective Ways to Alleviate Roseola During Pregnancy

Effective Ways to Alleviate Roseola During Pregnancy,
Story first published:Sunday, February 4, 2018, 12:45 [IST]
Desktop Bottom Promotion