For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ‌ర్భ‌స్థ మ‌ధుమేహం మీకు తెలుసా! ఇదేమైనా ప్ర‌మాద‌క‌ర‌మా?

By Krishnadivya P
|

త‌ల్లి కాబోతున్నార‌ని తెలియ‌గానే ఉండే సంతోష‌మే వేరు! పుట్ట‌బోయే బుజ్జాయి గురించి ఎన్నో క‌ల‌లు కంటారు. ఆ ఊహ‌ల్లో గ‌డిపేస్తూ ఆనందంగా ఉంటారు. సుఖ ప్ర‌స‌వం కావాల‌ని కోరుకుంటారు. అయితే అంద‌రికీ స‌హ‌జ కాన్పు కాక‌పోవ‌చ్చు. కొంద‌రికి శ‌స్త్ర చికిత్స అవ‌స‌రం కావ‌చ్చు. గ‌ర్భం ధ‌రించిన కాలంలో ఎన్నో సార్లు వైద్య స‌హాయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిందే ఒక‌టి గ‌ర్భ‌స్థ మ‌ధుమేహం (జెస్టేష‌న‌ల్ డ‌యాబెటిస్‌).

ప్ర‌తి గ‌ర్భ‌వ‌తి ఈ ర‌కమైన మ‌ధుమేహం గురించి తెలుసుకుని తీరాలి. భార‌త‌దేశంలోని ప‌ట్ట‌ణ ప్రాంతాలు, సెమీ అర్బ‌న్‌, ప్రాంతాల్లో ఈ ర‌క‌మైన మ‌ధుమేహం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. చ‌క్క‌ని, క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన జీవ‌న‌శైలి అనుస‌రించ‌డం ద్వారా ఈ గ‌ర్భ‌స్థ మ‌ధుమేహాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. మ‌రో విష‌యం ఏమిటంటే బిడ్డ పుట్టిన త‌ర్వాత ఈ మ‌ధుమేహం మాయ‌మ‌వుతుంది. ఈ గ‌ర్భ‌స్థ మ‌ధుమేహం ల‌క్ష‌ణాలు, వాటి ప్ర‌భావాల గురించి తెలుసుకుందాం.

1. ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌డం

1. ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌డం

చాలావ‌ర‌కు ఈ గ‌ర్భ‌స్థ మ‌ధుమేహం ల‌క్ష‌ణాలు తెలియ‌వు. ఎందుకంటే ఇవ‌న్నీ చాలా సాధార‌ణంగా క‌నిపించ‌డ‌మే కార‌ణం. స‌హజంగా గ‌ర్భవ‌తులకు అల‌స‌ట‌, పెరిగే దాహం. జ‌లుబు, వాంతులు కావ‌డం సాధార‌ణ‌మే. ఇవే గ‌ర్భస్థ మ‌ధుమేహానికి ల‌క్ష‌ణాలు. అందువ‌ల్లే ఏది దేనివ‌ల్ల వ‌చ్చిందో తెలియ‌దు. దీని గురించి తెలుసుకోక‌పోవ‌తే త‌ల్లికి, పుట్ట‌బోయే బిడ్డ‌కు ఇబ్బందే.

2. ప‌రీక్ష‌లు చేయించ‌డం

2. ప‌రీక్ష‌లు చేయించ‌డం

ఈ ర‌క‌మైన మ‌ధుమేహాన్ని గుర్తించ‌డానికి ప‌రీక్ష‌లు చేయించ‌డ‌మే స‌రైన మార్గం. ఎందుకంటే ల‌క్ష‌ణాలేమిటో తెలియ‌వు కాబట్టి. మాతృత్వ ప‌రీక్ష‌ల్లో త‌ల్లికి ర‌క్తంలో అధిక గ్లూకోజు స్తాయులు క‌నిపిస్తే మ‌రిన్ని టెస్టులు చేసి త‌ల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా చూసుకుంటారు.

ఎక్కువ బ‌రువుతో శిశువుల జ‌న‌నం

ఎక్కువ బ‌రువుతో శిశువుల జ‌న‌నం

త‌ల్లి శ‌రీరంలో అధిక గ్లూకోజు ఉంటే దాన్ని క‌డుపులోని శిశువులు శోషించుకుంటారు. దీనినిఏ మ్యాక్రోసోమియా అంటారు. దీనివ‌ల్ల పుట్ట‌బోయే శిశువులు అధిక బ‌రువుతో ఉంటారు.

4. జీవ‌న శైలిలో మార్ప‌లు

4. జీవ‌న శైలిలో మార్ప‌లు

మంచి జీవిన శైలి ద్వారా ఈ ర‌క‌మైన మ‌ధుమేహాన్ని రాకుండా అడ్డుకోవ‌చ్చు. గ‌ర్భ‌వ‌తి తొమ్మినెల‌లు మొత్తం అవ‌స‌ర‌మైన మోతాదులోనే పండ్లు, కూర‌గాయాలు తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు రావు. శ‌రీరంలో గ్లూజోకు స్థాయులు అన‌వ‌స‌రంగా పెర‌గ‌వు. ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ రోజుల్లో కొంద‌రు మ‌ద్య‌పానం సేవిస్తున్నారు. అలాంటిది అస్స‌లు మంచి ప‌ద్ధ‌తి కాదు. దీన్ని ఎవ‌రూ ప్రోత్స‌హించ‌కూడ‌దు.

5. అన్నిటికీ ఇన్సూలిన్ అవ‌స‌రం లేదు

5. అన్నిటికీ ఇన్సూలిన్ అవ‌స‌రం లేదు

మీరో విష‌యం తెలుసుకోవాలి. అన్ని మ‌ధుమేహాల్లోలాగా గ‌ర్భ‌స్థ మ‌ధుమేహానికి ఇన్సూలిన తీసుకోన‌క్క‌ర్లేదు. అయితే సాధార‌ణంగానే మహిళ‌కు ముందునుంచి మ‌ధుమేహం ఉంటే త‌క్కువ స్థా యుల్లో ఇన్సూలిన్ తీసుకోవాల్సి రావ‌చ్చు. అయితే కొంచెం క‌ష్టం కాబ‌ట్టి మందు బిల్ల‌ల రూపంలో తీసుకోవ‌డం మేలు.

6. శిశువుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌

6. శిశువుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌

గ‌ర్భంలో ఉన్న శిశువుల‌కు అధిక స్థాయుల్లో ఉన్న గ్లూకోజ్ మంచిది కాదు. వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయుల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచ‌డం క‌ష్టం అవుతుంది. గ‌ర్భంలోని శిశువుల కోసం కొన్ని మందులు క‌లిపిన పాలు తాగ‌డం అవ‌సరం అవుతుంది. శిశువు పుట్ట‌గానే వారిని ఎన్ఐసీయూలో ఉంచాల్సి రావ‌చ్చు.

7 ఇబ్బందుల‌తో జ‌న్మించ‌డం

7 ఇబ్బందుల‌తో జ‌న్మించ‌డం

గ‌ర్భ‌స్థ మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఆ మ‌హిళ ర‌క్తంలో చ‌క్కెర స్థాయ‌ల‌ను నియంత్రించ‌కుండా ఉంటే పుట్ట‌బోయే బిడ్డ‌లు ఇబ్బందుల‌తో జ‌న్మించే అవ‌కాశాలు ఉంటాయి. అంటే మూత్ర‌పిండాల్లో స‌మ‌స్య‌లు, మెద‌డు సంబంధ‌, ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌చ్చు.

8 బ‌రువు పెరుగుద‌ల‌

8 బ‌రువు పెరుగుద‌ల‌

గ‌ర్భం దాల్చ‌క‌ముందే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న మ‌హిళ‌లు న‌వ‌మాసాల స‌మ‌యంలో బ‌రువు పెర‌గ‌డం స‌హ‌జం. అలాంట‌ప్పుడు మీ బ‌రువును నియంత్ర‌ణంలో ఉంచుకుంటూ మ‌ధుమేహాన్ని నియంత్రించుకోవ‌డం అవ‌స‌రం.

9. కాబోయే త‌ల్లికి ఇబ్బందులు

9. కాబోయే త‌ల్లికి ఇబ్బందులు

చాలాసార్లు ఈ గ‌ర్భ‌స్థ మ‌ధ‌మేహం వంశ పారంప‌ర్యంగానూ వ‌స్తుంది. అమెరిక‌న్ ఇండియ‌న్, ఆఫ్రిక‌న్ అమెరిక‌న్‌, ఆసియా మ‌హిళ‌ల‌న మిన‌హాయిస్తే మిగ‌తావారిలో చాలామందికి కుటుంబ చ‌రిత్ర‌ను అనుస‌రించి మ‌ధుమేహం వ‌స్తుంది. ఇలాంటివారు ఒక సారి గ‌ర్భం ధ‌రించినప్పుడు ఈ ర‌క‌మైన మ‌ధుమేహం వ‌స్తే మ‌ళ్లీ గ‌ర్భ‌వ‌తి అయిన‌ప్పుడూ రావొచ్చు.

10. రెండో త్రైమాసికంలోనే

10. రెండో త్రైమాసికంలోనే

గ‌ర్భ‌స్థ మ‌ధుమేహాన్ని గ‌ర్భ‌వ‌తి అయిన వెంట‌నే గుర్తించ‌లేరు. సాధార‌ణం రెండో త్రైమాసికంలో అంటే 24 వారాల త‌ర్వాత‌నే గుర్తించ‌గ‌ల‌రు. తొలి మూడు నెల‌లు దీని ల‌క్ష‌ణాలు తెలియ‌వు.

11. పుట్ట‌గానే ప‌రీక్ష‌లు

11. పుట్ట‌గానే ప‌రీక్ష‌లు

ఈ ర‌క‌మైన మ‌ధుమేహంతో బాధ‌ప‌డ్డ మ‌హిళ శిశువుకు జ‌న్మ‌నివ్వ‌గానే వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించాలి. ఇలాంటి శిశువులో బ్ల‌డ్ షుగ‌ర్ త‌క్కువ‌గా

ఉండే అవ‌కాశాలున్నాయి. అలాగే నాడీ కుటుంబ‌ అభివృద్ధి ఆల‌స్యం కావ‌చ్చు. అందుకే వీరికి చైల్డ్ ఐవీ, గ్లూకోజ్ ప‌రీక్ష‌లు చేయిస్తే భవిష్య‌త్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవ‌చ్చు.

12. సానుకూలంగా ఉండాలి

12. సానుకూలంగా ఉండాలి

గ‌ర్భస్థ మ‌ధుమేహంతో బాధ‌ప‌డే మ‌హిళ‌లు సానుకూల దృక్ప‌థంతో ఉంటే అద్భుత ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు. సానుకూలంగా ఉంటే లోప‌లున్న శిశువైనే ఈ ర‌క‌మైన మ‌ధుమేహం ప్రభావం ఉండదు. కాబ‌ట్టి మీరు నిశ్చింత‌గా ఉండ‌టం అవ‌స‌రం.

English summary

Everything you need to know about gestational diabetes

During pregnancy, pregnant women can be effected with gestational diabetes. However, this does not affect every one. But certain percentage of women do undergo this dangerous condition. There are several reasons and causes for gestational diabetes. Read to know more.
Desktop Bottom Promotion