For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో వచ్చే సాధారణ చర్మ సమస్యలు !!

గర్భధారణ సమయంలో వచ్చే చర్మ సమస్యలు బిడ్డ పుట్టాక వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే ఈ చర్మ మార్పులు పుట్టే బిడ్డకు ప్రమాదం కావు.

By Lakshmi Bai Praharaju
|

గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. గర్భధారణ సమయంలో తప్పనిసరిగా వచ్చే మార్పులలో చర్మ సమస్యలు ప్రధానంగా కనపడతాయి.

అంతేకాకుండా, ఇంతకుముందే ఉన్న చర్మ సమస్యలు గర్భధారణ సమయంలో తీవ్రతరమౌతాయి. ఈ మార్పులు శరీరంలో సంభవించే హార్మోన్ల మార్పుల వల్ల కావచ్చు. ఇవి చర్మం, జుట్టు, గోళ్ళ పై ప్రభావం చూపిస్తాయి.

గర్భధారణ సమయంలో వచ్చే చర్మ సమస్యలు బిడ్డ పుట్టాక వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే ఈ చర్మ మార్పులు పుట్టే బిడ్డకు ప్రమాదం కావు.

గర్భధారణ సమయంలో సరైన సమతుల ఆహరం తీసుకుంటే శరీరం మంచి స్ధితిలో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి, ఈ చర్మ సమస్యల గురించి తెలుసుకోవడం చాలా మంచిది. నివారణ అనేది చికిత్స కంటే మంచిదన్న మాట వింటూనే వుంటాం కదా!

అందువల్ల, గర్భధారణ సమయంలో స్త్రీ ఎదుర్కునే చర్మ సమస్యలు, వాటి నివారణా మార్గాల గురించిన జాబితాను బోల్డ్ స్కై ఈ వ్యాసంలో మీకు అందిస్తోంది. అవి చదివి వాటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి.

గర్భధారణ సమయంలో వచ్చే సాధారణ చర్మ సమస్యలు

skin problems in pregnancy

చర్మంపై మచ్చలు : గర్భధారణ సమయంలో చర్మంపై మచ్చలు పడడం సహజం. ఇవి సాధారణంగా పొట్ట, తొడలు, పిర్రల మీద కనిపిస్తాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ కి పూర్తి చికిత్స లేనప్పటికీ, వ్యాయామం ద్వారాను, విటమిన్ A కలిగి ఉన్న లోషన్ లను అప్లై చేయడం ద్వారాను వీటిని తగ్గించవచ్చు.

వెరికోస్ వెయిన్స్: గర్భధారణ సమయంలో కాలిపై వెరికోస్ లైన్స్ ఊదా, నీలి రంగులలో కనిపిస్తాయి. ఇది అదనపు రక్త ప్రసరణ వల్ల జరుగుతుంది. ఇది చాలా నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. విటమిన్ C ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారాను. అదనపు బరువు పెరగకుండా చూసుకోవడం ద్వారాను దీన్ని నివారించవచ్చు.

skin problems in pregnancy

యాక్నే: గర్భధారణ సమయంలో హార్మోన్లు అదనంగా ఉత్పత్తి అవడం వల్ల యాక్నే, మొటిమలు రావొచ్చు. ఉదయం పూట, సాయంత్రం పూట తేలికపాటి సబ్బును ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ పరిస్ధితిని తగ్గించుకోవచ్చు.

దురదలు పుట్టే చర్మం: గర్భధారణ సమయంలో చర్మం సాగడం వల్ల ఈ సమయంలో దురద వస్తుంది. ఉదర భాగంలో చర్మాన్ని తేమగా ఉంచడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. యాంటీ-ఇచ్ క్రీములు, లోషన్ల సహాయంతో కూడా త్వరిత ఉపశమనాన్ని పొందవచ్చు.

skin problems in pregnancy

చర్మం నల్లబడడం: చర్మం నల్లబడడం అనేది గర్భధారణ సమయంలో సహజం. దీన్ని మెలాస్మా అని పిలుస్తారు. నలుపు మచ్చలు సాధారణంగా నుదురు, బుగ్గలపై కనిపిస్తాయి. ఇవి ఎక్కువ పిగ్మేన్టేషన్ వల్ల వచ్చే ఫలితాలు. అయితే, తేలికపాటి మంచి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం ద్వారా వీటిని నివారించవచ్చు.

English summary

skin problems in pregnancy

Sticking to a proper pregnancy diet can help keep the skin in a good condition. Hence, it would be good to know about these skin problems. Like they say, prevention is better than cure!Therefore, in this article, we at Boldsky will be listing out some of the skin problems that affect a woman during her pregnancy and the ways to prevent it. Read on to know more about it.
Story first published:Tuesday, January 30, 2018, 15:07 [IST]
Desktop Bottom Promotion