గర్భవతిగా ఉన్నసమయంలో అధిక చక్కెర పదార్థాలు తీసుకోవటం వల్ల పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం రావచ్చు.

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

తమ ఆహారంలో తీసుకునే అధిక చక్కెర వల్ల, కడుపుతో ఉన్న సమయంలో, ఆ తర్వాత పిల్లల్లో అలర్జీ, ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువని ఒక అధ్యయనంలో తేలింది.

క్వీన్ మేరి యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల ప్రకారం, అధిక చక్కెర తీసుకునే తల్లుల్లో- ఆహారం, పానీయాల్లో, సహజంగా ఉండే చక్కెర ఎక్కువవుండే తేనె, సిరప్స్, పళ్లరసాలు- వీటన్నిటి వల్ల పిల్లల్లో 38శాతం అలర్జీ, 73 శాతం ఇద్దరిలో అలర్జీ, 101శాతం అలర్జీతో వచ్చే ఆస్తమా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.

 Sugar Intake In Pregnancy Linked To Asthma Risk In Kids,

శాస్త్రవేత్తలు మరింత వివరిస్తూ తల్లులు అధికంగా తీసుకునే చక్కెర పదార్థాల వల్ల పోస్ట్ నేటల్ అలర్జిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ ను సృష్టించి, ఎదిగే బిడ్డ ఊపిరితిత్తిలో అలర్జిక్ వాపును తేవచ్చని తెలిపారు.

ముఖ్యంగా, చంటిబిడ్డ చిన్నప్పుడంతా అధిక చక్కెర ఆహారం తీసుకోకపోయినా, దీనితో దానికి సంబంధం లేదని ఈ విశ్లేషణలో పరిశోధకులు తేల్చారు.

యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్ లో ప్రచురితమైన ఈ అధ్యయనానికి, 9000 వేల తల్లిబిడ్డల జంటలు పాల్గొన్నారు.

 Sugar Intake In Pregnancy Linked To Asthma Risk In Kids,

తల్లులు గర్భసమయంలో తీసుకునే అధిక చక్కెర స్థాయిలకి, 7-9 ఏళ్ళ మధ్య పిల్లలకి వచ్చే ఆస్తమా, జలుబు, హే జ్వరం, ఎక్జిమా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకి మధ్య సంబంధాన్ని ఈ విశ్లేషణ తెలిపింది.

ఈ ఫలితాల ప్రకారం కడుపుతో ఉన్నప్పుడు తీసుకునే అధిక చక్కెర స్థాయిలకి అటోపీ ఆస్తమాకి- అలర్జీతో వచ్చే జలుబు, ఆస్తమా, ఎక్జిమా వంటి చర్మవ్యాధిని పెంచే జన్యుపరమైన చర్యకి దారితీస్తుందని తెలిసింది.

ఏది ఎలా వున్నా, ఎక్జిమా లేదా హే ఫీవర్ కి మాత్రం ఏ సంబంధం లేదని తెలిసింది.

 Sugar Intake In Pregnancy Linked To Asthma Risk In Kids,

క్యూఎంయూఎల్ కి చెందిన ప్రొఫెసర్ మరియు శాస్త్రవేత్త సియెఫ్ షహీన్ మాట్లాడుతూ, “ఈ విశ్లేషణల ప్రకారం కేవలం అధిక చక్కెర పదార్థాల వల్లనే ఈ అలర్జీ, ఆస్తమాలు పిల్లల్లో వస్తుందని చెప్పలేం.” అని అన్నారు.

కానీ మరీ ఎక్కువ చక్కెర పదార్థాల వాడకం చూసి, ఈ పరిశోధనను మరింత త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉన్నది,”అని జతచేసారు.

“ఇదే సమయంలో, మేము గర్భిణీ స్త్రీలకు అధిక చక్కెరలేని ఆహారాన్ని తీసుకోమని సూచిస్తున్నాం.” అని తెలిపారు.

English summary

Sugar Intake In Pregnancy Linked To Asthma Risk In Kids

Women who consume excessive sugar in their diet during their pregnancy may increase the risk of allergy and allergic asthma in their children, a study has claimed. High maternal intake of fructose causes a persistent postnatal allergic immune response that can lead to allergic inflammation. Here are some findings.