అద్దె గర్భాన్ని ఆశ్రయించిన సన్నీ లియోన్ : అద్దె గర్భం ( సరోగసీ ) గురించి తెలుసుకోవాల్సిన నిజాలు

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

భారతదేశంలో ప్రస్తుతం అద్దె గర్భానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ అద్దె గర్భాన్ని ఆంగ్లంలో సరోగసీ అంటారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ అద్దె గర్భాల విధానాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. తుషార్ కపూర్ నుండి మొదలుపెడితే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కరణ్ జోహార్ వరకు ఇలా చాలా మంది తమ కుటుంబాలను వృద్ధి చేసుకోవడానికి అద్దె గర్భాన్ని ఆశ్రయించారు.

బాలీవుడ్ లో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించి ఆనతికాలంలో ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న తారల్లో సన్నీ లియోన్ కూడా ఒకరు. ఈమె కూడా ఈమధ్యనే అద్దె గర్భం ద్వారా ఇద్దరు కవలలను పుట్టించుకుంది. ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఎంతో అందాన్ని వ్యక్తం చేసింది. అప్పుడే పుట్టిన కవలపిల్లలకు అషేర్ మరియు నోహ్ అనే పేర్లు పెట్టింది. ఈ విషయాలన్నింటిని సామజిక మాధ్యమాల్లో పంచుకొని, తన పిల్లల గురించి చెబుతూ అంతులేని ఉత్సాహాన్ని వ్యక్తపరిచింది.

Sunny Leone Opts For Surrogacy: Things To Know About Surrogacy

అసలు అద్దె గర్భం ( సరోగసీ ) అంటే ఏమిటి ?

ఎప్పుడైతే ఒక జంట పిల్లలను కావాలని అనుకుంటారో, కానీ ఆ సందర్భంలో వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉండవచ్చు. అందుకు కారణం తల్లి తండ్రులు ఇద్దరికీ లేదా ఎవరో ఒకరికి పిల్లలను కనే సామర్థ్యం లేకపోవచ్చు. ఈ సరోగసీ అనే పద్దతిలో తండ్రి యొక్క వీర్యాన్ని వేరొక స్త్రీలోకి చొప్పించడం జరుగుతుంది. ఆ మహిళ తొమ్మిది నెలల పాటు బిడ్డని మోసి కన్న తర్వాత, ఆ బిడ్డని ఆ జంటకు ఇవ్వడం జరుగుతుంది. సంప్రదాయ బద్దంగా జరిగే అద్దె గర్భం ప్రక్రియ అంటే ఇదే.

సరోగసీ ని వేరొక రకంగా కూడా చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే స్త్రీలలో ఉండే అండాలను, పురుషుల్లో ఉండే వీర్యం ద్వారా ఫలదీకరణం చేసిన తర్వాత, ఆ పిండాన్ని అద్దె గర్భం మహిళ గర్భాశయంలోకి పంపడం జరుగుతుంది. అలా ఆ మహిళ బిడ్డను మోసి మరియు కన్న తర్వాత ఆ జంటకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో స్త్రీల యొక్క జీవ సంబంధమైన బిడ్డ మాత్రమే పుట్టడం జరుగుతుంది. ఎందుకంటే, ఆమె యొక్క అండాలను వాడారు కాబట్టి.

Sunny Leone Opts For Surrogacy: Things To Know About Surrogacy

ఎందుకు జంటలు సరోగసీ విధానాన్ని ఆశ్రయిస్తున్నారు :

ఈమధ్య కాలంలో చాలామంది సరోగసీ అనే విధానాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అందుకు వివిధ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీలు, వినోదరంగానికి చెందిన వారు ఈ పద్దతులను ఎక్కువగా అనుసరిస్తున్నారు. సౌందర్యానికి సంబంధించిన కారణాలు లేదా సమయం లేకపోవడం వల్ల ఇలా చేస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు. వీటికి తోడు కొన్ని వైద్యపరమైన సమస్యల వల్ల కూడా ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. అవి ఏమిటంటే...

గర్భాశయంలో ఇన్ఫెక్షన్ సోకడం

గర్భాశయం లేకపోవడం లేదా హైస్ట్రెక్టమీ ద్వారా గర్భాశయాన్ని తీసివేసి ఉండవచ్చు.

తరచూ గర్భస్రావం అవడం

ఐ వి ఎఫ్ పద్దతి మాటిమాటికి విఫలం అవడం

వీటికి తోడు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం లేదా తల్లికి గుండె సంబంధిత వ్యాధులు ఉండటం.

ఇలా వివిధ కారణాల ద్వారా సరోగసీ ని ఆశ్రయిస్తున్నారు.

Sunny Leone Opts For Surrogacy: Things To Know About Surrogacy

బిడ్డను మోసే అమ్మని ఎలా ఎంచుకోవాలి ?

బిడ్డను మోసే అమ్మని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే, ఆమె చాలా ఆరోగ్యవంతంగా ఉండాలి మరియు దృఢంగా ఉండాలి. వీటికి తోడు మరెన్నో విషయాలను కూడా ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డను మోసే తల్లిని ఎంచుకొనే విషయంలో కొన్ని విషయాలను ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ అద్దె అమ్మలు ఎవరైతే ఉన్నారో వారి వయస్సు 21 నుండి 40 లోపు ఉండేలా చూసుకోవాలి.

ఏ స్త్రీ అయినా తన గర్భాన్ని మూడు సార్లకు మించి అద్దెకు ఇవ్వకూడదు.

గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యపరమైన పరీక్షలన్నీ చేయాల్సిన అవసరం ఉంది. వీటిల్లో ముఖ్యంగా గుండె సంబంధిత పరీక్షలు, చక్కెర స్థాయిలు మరియు వంశపారంపర్యంగా ఏవైనా వ్యాధులు మొదలగునవి ఉన్నాయా అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

మానసికపరంగా ఏవైనా అనారోగ్యసమస్యలు ఉన్నాయా అనే విషయం కూడా తెలుసుకోవాలి.

ఎవరైతే గర్భాన్ని అద్దెకు ఇవ్వాలనుకుంటారో వారు అంతకు మునుపే ఒక ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి.

Sunny Leone Opts For Surrogacy: Things To Know About Surrogacy

భారతదేశంలో సరోగసీ కి చట్టపరమైన హోదా ఎలా ఉంది ?

2006 లో సరోగసీ కి సంబంధించి ఒక రెగులేషన్ బిల్లుని ఆమోదించడం జరిగింది. దీంతో భారతదేశములో ఇది చట్టపరమైనదిగా మనుగడలోకి వచ్చింది. దీని ప్రకారంగా విదేశీయులు, ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులు, ఒకే లింగం ఉన్న జంటలు, పెళ్లిచేసుకోని జంటలు వీళ్ళందరూ ఈ సరోగసీ విధానానికి అర్హులు కాదని, ఎటువంటి పరిస్థితుల్లో వీరు సరోగసీ విధానాన్ని అవలంభించకూడదని చట్టంలో పేర్కొనబడింది.

చట్ట బద్దంగా పెళ్లిచేసుకొని, 5 సంవత్సరాల కంటే పైబడిన భారతీయ జంటలు మాత్రమే సరోగసీ ని ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు.

ఈ వ్యాసాన్ని ఇతరులకు షేర్ చేయండి.

ఈ వ్యాసం గనుక మీకు నచ్చినట్లైతే మీ దగ్గర స్నేహితులకు, బంధువులతో పంచుకోవడం మరచిపోకండి.

English summary

Sunny Leone Opts For Surrogacy: Things To Know About Surrogacy

The process of surrogacy is done by implanting the father's sperm inside another woman. The surrogate mother then carries the child for 9 months and delivers the baby for the couple. Couples opt for surrogacy due to infection of the womb, history of miscarriages, heart disease, hysterectomy, etc.