For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూపర్ఫిటేషన్ : సరోగసీ గర్భిణి, రెండవ గర్భం దాల్చడం ?

|

జెస్సికా అలెన్, ఇద్దరు పిల్లల తల్లి, ఆమె తన కొత్త ఇంటిని నిర్మించుకుని, గృహిణిగా స్థిరపడాలన్న కోరికతో సర్రోగేట్ వలె సైన్అప్(రిజిస్టర్) చేయాలని నిర్ణయించుకుంది. కానీ, తన జీవితం తరువాత 11 నెలలలో నాటకీయంగా మలుపులు తిరుగుతుందని గ్రహించలేకపోయింది.

అరుదైన సూపర్ఫిటేషన్ సమస్య - మెడికల్ చరిత్రలో ఇప్పటికి కేవలం 10 సార్లు మాత్రమే రికార్డ్ చేయబడిన ఒక వైద్య సంబంధిత పరిస్థితి :

జెస్సికా తన బయలాజికల్ కుమారునితో గర్భం దాల్చింది, కానీ అదే సమయంలో ఆమె ఒక చైనీస్ జంట యొక్క సర్రోగేట్ చైల్డ్ ని గర్భంలో కలిగి ఉంది. క్రమంగా ఖర్చుతో కూడిన చట్టపరమైన సమస్యలను అనేకం ఎదుర్కొని, తన కొడుకును దక్కించుకోవలసివచ్చింది.

అవగాహన నిమిత్తం: బయలాజికల్ అనగా జీవసంబంధమైన అని అర్ధం. అనగా సరోగసీ, టెస్ట్-ట్యూబ్ వంటి ఏ ఇతర విభాగంలోనికి రాకుండా, తనంతట తానే భాగస్వామితో గర్భం దాల్చడం.

superfetation-surrogacy

ప్రకృతి సహజంగా కాకుండా, గర్భధారణకు ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా :

మరొక మహిళ ద్వారా ఫలదీకరణం చేయబడిన పిండమును సరోగేట్ తల్లి గర్భంలో చొప్పించబడే విధానాన్ని, సరోగసీ అని వ్యవహరిస్తారు. ప్రసవం తర్వాత, ఆ బిడ్డను బయోలాజికల్ తల్లిదండ్రులకు అందివ్వబడుతుంది.

గర్భధారణ అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక సవాలుతో కూడిన దశ కావడం చేత, మరియు గర్భధారణ కారణంగా మధుమేహం మరియు ఇతర ప్రాణంతక వైద్య పరిస్థితులకు లోనవడం చేత, ఈ ప్రక్రియ అత్యంత ఖరీదైనదిగా ఉంటుంది.

జెస్సికా అలెన్, శాన్డియాగోలోని ఒమేగా ఫ్యామిలీ గ్లోబల్ IVF సెంటర్లో ఒక సర్రోగేట్ వలె సంతకం చేశాక, ఆమె ఒక చైనీస్ జంట జంటకు $ 30,000 (9 నెలల్లో వాయిదాలలో చెల్లించారు) కు నిర్ణయించారు. అంతేకాకుండా, ఆమె పూర్తిగా అన్నివిధాలా సరిపోయినట్లు నిర్ధారణ గావించబడింది కూడా. ఈ చైనీస్ జంటను “లియస్” జంటగా గుర్తించబడింది.

superfetation-surrogacy

కానీ ఆశ్చర్యకరంగా తనకు చేయబడిన స్కానింగ్ రిపోర్టులలో, తన 6 వారాల సర్రోగేట్ గర్భంలో ఒక వింత చోటుచేసుకుందని గ్రహించడం జరిగింది – ఇంతకు ముందు లేని రెండవ బిడ్డ.

క్రమంగా ఈ “లియస్” జంటకు, ఒకే విడతలో కవలలు జన్మిస్తున్నారని తెలియడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరియు జెస్సికాకు $ 5,000 మొత్తాన్ని కూడా అదనంగా పెంచారు. కానీ జెస్సికా మరియు “లియస్” జంటకు వైద్య సిబ్బంది చెప్పని ప్రధాన విషయం ఏమిటంటే ఆ ఇద్దరు పిల్లలు ప్రత్యేకమైన “సాక్స్” లలో ఉన్నారు, ఇది కవలల విషయంలో అత్యంత అసాధారణ పరిస్థితి.

డెలివరీ తరువాత అగ్నిపరీక్ష :

జెస్సికా ఏప్రిల్ 2016 లో సరోగసీ ద్వారా గర్భవతిగా మారింది. మరియు ఆ సంవత్సరం డిసెంబర్లో, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

నియమాల ప్రకారం, డెలివరీ తర్వాత పిల్లలను ఆమె నుండి, “లియస్” జంటకు అప్పగించడం జరిగింది. కనీసం వారిని ముట్టుకోవడానికి కూడా అనుమతినివ్వలేదు. ఆ తర్వాతి కాలంలో, స్టాఫ్ నర్సులు ఆ పిల్లల చిత్రాలను చూపించడం జరిగింది. ఆమె పగిలిన హృదయానికి ఉపశమనంలా. ఏదిఏమైనా పురిటినొప్పులు పడి బిడ్డలకు జన్మనిన్చిన తల్లికదా.

అయినప్పటికీ, ఇది సరోగసీ విషయంలో సాధారణమే కాబట్టి, జెస్సికా కొంతకాలం భాదపడినా, కాలంతోపాటు తిరిగి ఆమె తన జీవితాన్ని పునఃప్రారంభించింది.

కానీ ప్రసవం జరిగిన నెల తర్వాత “లియస్” జంట పంపిన పిల్లల చిత్రాల ప్రకారం, వారి పోలికలలోని అసాధారణతలను చూసి అనుమానం కలిగి, తిరిగి ఆ జంటను సంప్రదించడం జరిగింది.

superfetation-surrogacy

నమ్మలేని నిజం చవిచూడడం వారి వంతైంది :

లియస్ వారి పిల్లలకు DNA పరీక్ష నిర్వహించి, వారిలో ఒకరు మాత్రమే తమ బయలాజికల్ చైల్డ్ అని నిర్దారించడం జరిగింది. అనగా, మరొక బిడ్డ జెస్సికా మరియు అతని ప్రియుడు జాస్పర్ యొక్క బయలాజికల్ చైల్డ్.

ఈ పరిణామం జెస్సికా మరియు జాస్పర్లను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ కండోం వినియోగిస్తూ, జాగ్రత్తలు తీసుకునేవారు. మరియు సర్రోగేట్ చైల్డ్తో గర్భవతి అయిన తర్వాత కూడా సంభోగంలో కండోమ్స్ ఉపయోగించడం జరిగింది. అలాంటిది, వారికి ఇలా ఎలా జరిగిందో అర్ధం కాలేదు.

సూపర్ఫిటేషన్ - మెడికల్ మిరాకిలా లేక పీడకలనా ?

గర్భిణి స్త్రీ, గర్భధారణ సమయంలో గర్భంలో మరొక పిండం అభివృద్ధి చెందడం అనేది, గర్భధారణ ప్రక్రియలోనే అత్యంత అరుదైన పరిస్థితిగా ఉంటుంది. వైద్య చరిత్రలో ఇప్పటి వరకు ఇటువంటివి రికార్డెడ్ గా 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇటువంటి స్థితి అనేక అనుమానాలకు తావిస్తుంది కూడా.

superfetation-surrogacy

అయినప్పటికీ, జెస్సికా సాధారణ గర్భిణి అయినట్లయితే, ఈ సూపర్ఫిటేషన్ పెద్దగా చర్చనీయాంశం అయ్యేది కాదు. అయితే, అది ఒక సరోగసీ సమయంలో సంభవించిన కారణంగా, క్రమంగా సుదీర్ఘ చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. లియస్ తనకు జరిగిన నష్టానికి $22,000 నష్టపరిహారం ఇవ్వవలసినదిగా డిమాండ్ చేయడం జరిగింది.

సంతానోత్పత్తి కేంద్రం జెస్సికా కొడుకును లియస్ జంటకు దత్తత ఇవ్వడం ద్వారా, ఈ డిమాండ్ను భర్తీ చేయడానికి ప్రయత్నించింది. కానీ జెస్సికా మరియు జాస్పర్ తమ కొడుకును తిరిగి తమకు అప్పగించవలసిందేనని పట్టుబట్టారు. క్రమంగా వారు న్యాయవాదులను సంప్రదించడం జరిగింది. తమ బిడ్డ కానప్పుడు నిబంధనలకు అనుగుణంగా మిన్నకున్నా, తమ బిడ్డే అని తెలిశాక ఏ తల్లీ చూస్తూ ఊరుకోదు అని మరోసారి నిరూపించింది జెస్సికా.

జెస్సికా తన సొంత కుమారుని తిరిగి "దత్తత" తీసుకోడానికి డబ్బు చెల్లించవలసినదిగా లియస్ జంట డిమాండ్ చేయడం కారణంగా, సామాజిక కార్యకర్తలు సైతం ఇరుపక్కలా ఒక ఒప్పందాన్ని కుదర్చలేకపోయారు.

ఈ కోర్టు సమస్య ఒక నెలపాటు కొనసాగింది. చివరకు 2017, ఫిబ్రవరి 5 న, జెస్సికా తన కుమారుని తిరిగి దక్కించుకోగలిగింది. ఆమె మరియు ఆమె ప్రియుడు వారి కుమారునికి మలాచిగా పేరు మార్చారు, ఇప్పుడు అతని వయసు 10 నెలలు.

విషయాన్ని వినగానే ఆశ్చర్యపోయారు కదా ? ఇటువంటివి ఈ ప్రపంచంలో అనేకం జరుగుతున్నా వెలుగులోకి వచ్చేవి మాత్రం కొన్నే అని గుర్తుపెట్టుకోండి. తెలియక తీసుకునే నిర్ణయాలు, తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టే అవకాశాలు లేకపోలేదు. కావున ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తి అవగాహనతో ముందుకు అడుగువేయడం మంచిది. లేనిచో చట్టపరమైన సమస్యలను సైతం తీవ్రంగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే ఈ కథనాన్ని మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి. ఇటువంటి అనేక ఆసక్తికర కథనాల కోసం బోల్డ్స్కై పేజీని సందర్శించండి.

English summary

What Is Superfetation?

Surrogacy is the medical term used to describe a type of pregnancy where the fertilized embryo of another woman is implanted in a surrogate mother's womb who then brings the child to term, after which the child is given over to the biological parents.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more