For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐదవ నెల స్కానింగ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

ఒక స్త్రీ గర్భం దాల్చిన తరువాత ఐదవ నేలలోకి అడుగుపెట్టినప్పుడు, ఆమె శరీరంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలోనే గర్భంలోని శిశువు కదలటం ప్రారంభిస్తుంది. ఇక గర్భంలో ఉన్న శిశువుతో తల్లి మాట్లాడ

By R Vishnu Vardhan Reddy
|

ఒక స్త్రీ గర్భం దాల్చిన తరువాత ఐదవ నేలలోకి అడుగుపెట్టినప్పుడు, ఆమె శరీరంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలోనే గర్భంలోని శిశువు కదలటం ప్రారంభిస్తుంది. ఇక గర్భంలో ఉన్న శిశువుతో తల్లి మాట్లాడటానికి ఉత్తమమైన సమయం ఇదే. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలకు ప్రతిస్పందనగా శిశువు కదలవచ్చు. ఈ సమయంలో కడుపు యొక్క పరిమాణం ఒక్కో స్త్రీకి ఒక్కో రకంగా ఉంటుంది. కానీ, సాధారణంగా అందరికి కొద్దిగా చొచ్చుకొచ్చినట్లు ఉంటుంది.

things to know about 5th month scanning

ఇక ఈ సమయంలో తరచూ ఆస్పత్రికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక అయిదవ నెలలో వైద్యునితో అతిముఖ్యమైన సమావేశం జరుగుతుంది. ఈ సమయంలోనే మీకు వైద్యులు స్కానింగ్ చేస్తారు.

ఈ స్కానింగ్ నే ఆంగ్లంలో ' అనోమలీ స్కాన్ ' అని అంటారు. అంటే క్షుణ్ణమైన స్కానింగ్ అని అర్ధం. దీనినే మరికొంతమంది ' మోర్ఫోలోజి స్కాన్ ' లేదా ' 20 వరాల స్కాన్ ' అని కూడా అంటారు. సాధారణంగా గర్భం దాల్చిన 18 నుండి 20 వరాల మధ్యలో ఈ స్కానింగ్ చేయడం జరుగుతుంది. మీరు గనుక ఈ రకమైన స్కానింగ్ చేయించుకోవడానికి సిద్దపడుతున్నారా మరియు ఈ స్కానింగ్ లో ఏమి ఆశించవచ్చు అని ఆశ్చర్యపోతున్నారా ? అలా అయితే ఈ వ్యాసం మీ కోసం. వీటన్నింటి గురించి సవివరంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

స్కానింగ్ చేయించుకోవడానికి గాను మిమ్మల్ని మీరు ఎలా సంసిద్ధం చేసుకోవాలి :

స్కానింగ్ చేయించుకోవడానికి గాను మిమ్మల్ని మీరు ఎలా సంసిద్ధం చేసుకోవాలి :

అనోమలీ స్కానింగ్ చేయించుకోవడానికి ఎటువంటి ప్రత్యేకమైన తయారీ అవసరం లేదు. మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకొని ఉండాలి మరియు మీరు బుక్ చేసుకున్న అప్పాయింట్మెంట్ సమయానికంటే ఓ 15 నిమిషాల ముందే ఆస్పత్రికి వెళ్ళాలి. ఇలా చేయడం ద్వారా చివరి నిమిషంలో ఉరుకులపరుగున ఆసుపత్రికి వెళ్లే అవసరం ఉండదు మరియు ఒత్తిడికి కూడా లోనవ్వరు.

3 వ నెలలో స్కానింగ్ చేసే సమయంలో మూత్రాశయం నిండుగా ఉండవలసిన అవసరం ఉంది. కానీ, ఈ సారి అలా ఉండనవసరంలేదు. కావున మీరు దాని పై దృష్టి పెట్టనవసరం లేదు. కాకపోతే, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మిగతా స్కానింగులతో పోలిస్తే ఈ స్కానింగ్ పూర్తవ్వడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా ఈ స్కానింగ్ చేయడానికి 45 నిముషాలు పడుతుంది. ఒక వేళ గర్భంలో ఉన్న శిశువు గనుక సహకరిస్తే అంతకు ముందే పూర్తవుతుంది.

స్కానింగ్ ఎలా చేస్తారంటే :

స్కానింగ్ ఎలా చేస్తారంటే :

5 వ నెలలో పొత్తికడుపు భాగంలో ఎక్కువగా స్కానింగ్ చేయడం జరుగుతుంది. వైద్యుడు లేదా స్కానింగ్ చేసే నిపుణుడు మీ యొక్క పొట్ట పై ద్రవ రూపంలోని ఒక అర్ధ ఘనపదార్ధాన్ని రాస్తారు. దీనినే జెల్ అని కూడా అంటారు. అలా రాసిన తర్వాత ట్రాన్సడుసర్ అనే స్కానింగ్ పరికరాన్ని పొట్ట పై పెట్టి, శిశువు యొక్క చిత్రాలను తెర పై చూడటం జరుగుతుంది. మీ వైద్యుడు గనుక మీ గర్భాశయాన్ని పరీక్షించాలని భావిస్తే, ట్రాన్స్ వెజినల్ స్కాన్ అంటే యోనికి సంబంధించిన స్కాన్ కూడా చేయడం జరుగుతుంది.

శిశువు ఎలా కనపడతాడు :

శిశువు ఎలా కనపడతాడు :

ఇంతకముందు చేసిన స్కాన్ ల కంటే కూడా ఈ స్కానింగ్ లో శిశువు యొక్క చిత్రం ప్రస్ఫుటంగా కనపడుతుంది. కానీ, శరీరం మొత్తం పూర్తిగా ఏర్పాటు అయి ఉండదు. ఎముకలు తెల్లగా కనపడతాయి. ఎంతో సున్నితమైన కండరాలు బూడిద రంగులో కనపడతాయి మరియు శిశువు చుట్టూ ఉన్న ఉమ్మనీరు నలుపు రంగులో కనపడుతుంది. శిశువు కదులుతుండటం కనపడుతుంది మరియు ముఖ కవళికలు కూడా కనపడతాయి. ఈ సమయంలో శిశువు ప్రతి అరగంటకు ఒక సరి గర్భంలోనే మూత్ర విసర్జన చేస్తుంది.

అనోమలీ స్కానింగ్ చేయడం ద్వారా ఏమి గుర్తిస్తారు ?

అనోమలీ స్కానింగ్ చేయడం ద్వారా ఏమి గుర్తిస్తారు ?

శిశువులో ఏమైనా అసాధారణతలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ స్కానింగ్ ని ఎంతో క్షుణ్ణంగా చేయడం జరుగుతుంది. అసాధారణతలు అంటే, శరీర వృద్ధికి సంబంధించి ఏవైనా వినాశనలు చోటు చేసుకున్నాయా అనే విషయమై ప్రత్యేకమైన దృష్టిని పెడతారు. మరికొన్ని పరిస్థితులను తనిఖీ చేయడానికి కూడా ఈ స్కానింగ్ చేస్తారు. ఆ పట్టికను మనం ఇప్పుడు చూడబోతున్నాం. మిమ్మల్ని కొద్దిగా భయబ్రాంతులకు గురిచేయడానికి ఈ పట్టిక గురించి చెప్పడంలేదు. ఇవన్నీ సాధారణంగా వచ్చే పరిస్థితులు కావు, అసాధారణమైనవి. అనోమలీ స్కానింగ్ సందర్భంగా వైద్యులు ఏమి తనిఖీ చేస్తారు అనే విషయానికి సంబంధించి మీకు సమాచారం ఇవ్వడం కోసమే ఇవ్వి ఇక్కడ చెబుతున్నాము.

వెన్నుముక్కకు సంబంధించిన చీలిక తెరిచి ఉండటం :

వెన్నుముక్కకు సంబంధించిన చీలిక తెరిచి ఉండటం :

ఈ రకమైన వైకల్పం వెన్నుముక ప్రాంతంలో చోటుచేసుకుంటుంది. దీనినే మరో రకంగా ' ఓపెన్ న్యూట్రల్ ట్యూబ్ డిఫెక్ట్ ' అని కూడా అంటారు. ఈ రకమైన వ్యాధిని ప్రతి 10 వేల పుట్టుకలలో ఆరుగురిలో మాత్రమే ఈ లోపం కనపడుతుంది. ఈ స్థితిని స్కానింగ్ సమయంలో తెరపై చూసినప్పుడే చాలా సులభంగా కనిపెట్టవచ్చు.

చీలిక పెదవి :

చీలిక పెదవి :

ఈ రకమైన పరిస్థితి గురించి అందరికి చాలా బాగా తెలుసు. పెదాలు నిర్మాణ సమయంలో ఏర్పడే లోపం ఇది. ఈ చీలిక ఒక్కొక్కరిలో ఒక్కోరకంగా ఉంటుంది. ప్రతి పదివేల పుట్టుకలో పదిమందిలో మాత్రమే ఈ లోపం కనపడుతుంది.

తలలేని పుట్టుక :

తలలేని పుట్టుక :

ఇది కూడా ' ఓపెన్ న్యూట్రల్ ట్యూబ్ డిఫెక్ట్ ' లాంటిదే. పుర్రెలో ఉండే ఎముకలు నిర్మాణ సమయంలో సరిగ్గా జరగకపోవడం వల్ల ఏర్పడే వైఫల్యం ఇది. ఈ పరిస్థితి వల్ల మెదడు వృద్ధి చెందే దశలో దానికి తీవ్రమైన నష్టం వాటిల్లితుంది. ప్రది 10 వేల పుట్టుకలలో ఆరుగురిలో ఈ లోపం కనపడుతుంది.

డయాఫ్రాగటిక్ హెర్నియా :

డయాఫ్రాగటిక్ హెర్నియా :

ఊపిరితిత్తుల్లో ఉండే డయాఫ్రాగమ్ ( శరీరంలో రొమ్ము భాగాన్ని ఉదర భాగం నుంచి వేరు చేసే కండరము ) కు నష్టం కలగటం వల్ల డయాఫ్రాగటిక్ హెర్నియా సంభవిస్తుంది. దీనివల్ల పుట్టుక తర్వాత శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రతి 10 వేల పుట్టుకలలో నలుగురిలో ఈ లోపం కనపడుతుంది.

గ్యాస్ట్రోసిస్సిస్ మరియు ఎక్సోఫాఫోస్ :

గ్యాస్ట్రోసిస్సిస్ మరియు ఎక్సోఫాఫోస్ :

ఉదర గోడ ప్రాంతంలో చోటుచేసుకునే లోపాన్ని గ్యాస్ట్రోసిస్సిస్ మరియు ఎక్సోఫాఫోస్ అని అంటారు. ఈ సమస్య వల్ల శిశువు జన్మించిన తర్వాత ఆహారం ఇచ్చు సమయంలో సమస్యలు తలెత్తుతాయి. ప్రతి 10 వేల పుట్టుకలో ఐదుగురిలో ఈ సమస్య తలెత్తుతుంది.

పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధి :

పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధి :

ఈ వ్యాధి గుండెకు సంబంధించినది. ఇది మూడు రకాలుగా విభజించబడించి. గుండె యొక్క పరిమాణం, గుండె యొక్క పనితనం లేదా గుండె యొక్క గుండె చప్పుడు ఆధారంగా విభజించడమైనది. పుట్టుకతో వచ్చే ఈ గుండె సంబంధిత వ్యాధుల భారిన ప్రతి 10 వేల పుట్టుకలో 35 మంది ఈ వ్యాధికి గురౌతున్నారు.

ద్వైపాక్షిక మూత్రపిండ అవయవ పెరుగుదల లోపం :

ద్వైపాక్షిక మూత్రపిండ అవయవ పెరుగుదల లోపం :

మూత్రపిండాలు గనుక ఏర్పడకపోతే, ఈ స్థితి తలెత్తుతుంది. ఇటువంటి సమయంలో ఉమ్మనీరు అస్సలు ఉండకపోవచ్చు లేదా చాలా కొద్దిగా మాత్రమే ఉండవచ్చు. ప్రతి పదివేల పుట్టుకలలో ఒక్కరిలో మాత్రమే ఈ లోపం తలెత్తుతుంది.

ప్రాణాంతక అస్థిపంజర అసహజత్వం :

ప్రాణాంతక అస్థిపంజర అసహజత్వం :

ఈ ప్రాణాంతక అస్థిపంజర అసహజత్వం పరిస్థితితులు మొత్తం 350 రకాలు ఉన్నాయి. చేతులు, కాళ్ళు, ఛాతి లేదా పుర్రెకు సంబంధించిన ఎముకల్లో ఈ లోపాలు తలెత్తుతుంటాయి. చాలా సందర్భాల్లో ఎముకలు అసహజంగా పెరుగుతుంటాయి. ఇందువల్ల శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో వృద్ధి అసమానంగా ఉంటుంది. ప్రతి 10 వేల పుట్టుకలో ఒకరిలో మాత్రమే ఈ లోపం తలెత్తుతుంది.

ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ మరియు పాటస్ సిండ్రోమ్ :

ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ మరియు పాటస్ సిండ్రోమ్ :

ఈ పరిస్థితుల్లో శరీరంలో ఉన్న కణాల్లో ఉన్న క్రోమోజోములలో, అసాధారణ నిర్మాణం జరుగుతుంది. శిశువులో ఇలా జరగటం చాలా ప్రాణాంతకం. ఈ సమస్యకు నివారణ లేదు. ప్రతి 10 వేల పుట్టుకలో ఇద్దరు లేదా ముగ్గురిలో మాత్రమే ఈ లోపం కనపడుతుంది.

వైద్యులు పైన చెప్పబడిన వాటితో పాటు ఇవి కూడా చూస్తారు.

వైద్యులు పైన చెప్పబడిన వాటితో పాటు ఇవి కూడా చూస్తారు.

బొడ్డుతాడు

జరాయువు

ఉమ్మనీరు యొక్క పరిస్థితిని మరియు స్థితిని పరిశీలించడం జరుగుతుంది.

శిశువు యొక్క కొలతలు కూడా తీసుకొని శిశువు బరువుని అంచనావేస్తారు.

శిశువు యొక్క లింగంను తెలుసుకుంటారు :

శిశువు యొక్క లింగంను తెలుసుకుంటారు :

గర్భంలో ఉన్న శిశువు యొక్క లింగాన్ని గుర్తించడానికి ఇది ఉత్తమమైన సమయం. శిశువు గనుక సహకరిస్తే ఈ విషయాన్ని ఖచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. కానీ, భారత దేశం లో ఉన్న చట్టాల ప్రకారం లింగాన్ని తెలుసుకోవడం అనేది చట్టరీత్య నేరం మరియు శిక్షార్హం. కాబట్టి మీరు ఈ ప్రశ్న గురించి పూర్తిగా మరిచిపోవడం మంచిది మరియు శిశువు పుట్టబోయే వరకు ఎవరు పుట్టబోతున్నారు అనే విషయమై అంచనావేస్తూ ఉండండి.

స్కానింగ్ సమయంలో ఏదైనా సమస్యను గుర్తించడం జరిగితే ఏమి చేయాలి :

స్కానింగ్ సమయంలో ఏదైనా సమస్యను గుర్తించడం జరిగితే ఏమి చేయాలి :

మీ వైద్యుడ్ని సంప్రదించండి మరియు వారు చెప్పే సూచనలను సలహాలను భయపడకుండా పాటించండి, ఆచరించండి. ఏదైనా సమస్య గనుక ఉంటే, మీరు ఆస్పత్రుకి ఎక్కువసార్లు వెళ్ళవలసి ఉంటుంది. ఎంతైనా మీకు పుట్టబోయే బిడ్డే కదా, కొన్ని సార్లు కష్టపడక తప్పదు. సానుకూల దృక్పధం తో వ్యవహరించండి.

English summary

things to know about 5th month scanning | 5th month scanning | how is scan done on 5th month of pregnancy | how to prepare oneself before going for 5th month scanning

The scan of the second trimester is called the 'anomaly scan'. Some even call it the 'morphology scan' or the '20 week scan'. This is usually taken during the weeks from 18-20. If you are preparing yourself for the scan and wondering what to expect, this article is for you.
Story first published:Tuesday, January 16, 2018, 18:45 [IST]
Desktop Bottom Promotion